కైలీ జెన్నర్ కలల ఇంద్రభవనం

సెలబ్రిటీలు తమ కలల ఇంద్ర భవనాల గురించి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు అనే సంగతి నేటిజెన్లకు తెలియని విషయం కాదు. ముఖ్యంగా హాలీవుడ్ నటులు ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఇంద్ర భవనాలను కట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అందులో ప్రత్యేకమైన ఆకర్షణలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కైలీ జెన్నర్ కలల ఇంద్ర భవనాన్ని పైపైన చూసే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. భవన నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న సందర్భంలోనే.. ప్రతి ఒక్క చూపులను కట్టిపడేస్తోంది ఈ ఇంద్ర […]

Share:

సెలబ్రిటీలు తమ కలల ఇంద్ర భవనాల గురించి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు అనే సంగతి నేటిజెన్లకు తెలియని విషయం కాదు. ముఖ్యంగా హాలీవుడ్ నటులు ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఇంద్ర భవనాలను కట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అందులో ప్రత్యేకమైన ఆకర్షణలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కైలీ జెన్నర్ కలల ఇంద్ర భవనాన్ని పైపైన చూసే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. భవన నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న సందర్భంలోనే.. ప్రతి ఒక్క చూపులను కట్టిపడేస్తోంది ఈ ఇంద్ర భవనం. మరి ఆ విశేషాలు మనము తెలుసుకుందాం.. 

కైలీ జెన్నర్ కలల ఇంద్రభవనం: 

ఐదు ఎకరాల హిడెన్ హిల్స్ ల్యాండ్‌లో ఉన్న కైలీ భవనం, నిజంగా ప్రతి ఒక్కరూ ఒక విశాలవంతమైన ఇంద్ర భవనం అంటున్నారు. ఈ ఇంద్ర భవనంలో సుమారు 15 బెడ్‌రూమ్‌లు, 12-కారు గ్యారేజీలు ఉన్నాయట. కైలీ జెన్నర్, మేకప్ మొగల్.. అంతే కాకుండా రియాలిటీ టీవీ స్టార్, ఆమె హిడెన్ హిల్స్ మాన్షన్, రియల్ ఎస్టేట్ ప్రపంచంలో రికార్డులు సృష్టిస్తోంది. 2020లో కొనుగోలు చేసిన $15 మిలియన్ల ఆస్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఆకర్షణీయమైన ఇంద్రభవనంగా రూపుదిద్దుకొంది.

ఇంద్ర భవనం విశేషాలు: 

5 ఎకరాల ప్రైమ్ హిడెన్ హిల్స్ ల్యాండ్‌లో ఉన్న కైలీ మాన్షన్ విలాసవంతమైన జీవనానికి నిదర్శనంగా మారుతోంది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీలో 15 బెడ్‌రూమ్‌లు, అండర్ గ్రౌండ్ గ్యారేజ్, ఇన్ఫినిటీ పూల్, ఇతర ఐశ్వర్యవంతమైన సౌకర్యాలు ఉంటాయి. విల్ స్మిత్ , ఆమె స్వంత కర్దాషియాన్ వంటి వారు ఈ భవనానికి అతి దగ్గరలోనే నివసిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖులు నివసించే ఇటువంటి ప్రత్యేకమైన ఎన్‌క్లేవ్‌ వల్ల, ఈ ప్రదేశం స్టార్-స్టడెడ్ కంటే తక్కువ కాదు.

భవనం నిర్మాణం 2021 ప్రారంభంలో ప్రారంభమైంది. ఇటీవల ఆ భవనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చకర్లు కొడుతుండటంతో భవన నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. భవన రూపకల్పన నిజంగా కైలీ దృష్టికి జీవం పోసింది. ప్రాపర్టీ డిజైన్‌లో 18,000-చదరపు అడుగులలో ఇల్లు ఉంటుంది, 12-కార్ల గ్యారేజ్, గెస్ట్ హౌస్, సెక్యూరిటీ బేస్, పూల్ మరియు స్పోర్ట్స్ కోర్ట్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ ఇంద్ర భవనానికి సంబంధించిన కొన్ని విషయాలు గోప్యంగానే ఉన్నప్పటికీ, నిజానికి ఈ ఇంద్ర భవనం ప్రపంచంలోనే ఆకర్షణీయంగా కనిపించే భవనంగా మారింది. అంతేకాకుండా విలాసవంతమైన భవనాలలో ఒకటిగా నిలిచింది.

పరిపూర్ణత కోసం కైలీ అభిరుచి ఆమె కొత్త ఇంటిలోని ప్రతి మూల కనిపిస్తుందని చెప్పుకోవాలి. గత ఇంటర్వ్యూలో, ఆమె తన వ్యక్తిగత స్థలం, ముఖ్యంగా తన ఇంటికి సంబంధించిన కబోర్డ్స్ మరియు గ్లామ్ రూమ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణం సుమారు పూర్తయినప్పటికీ, కైలీ జెన్నర్ కలల ఇంటిని ప్రత్యేకించి చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అభిమానులు, రియల్ ఎస్టేట్ ఔత్సాహికుల కోసం, ఈ భవనానికి సంబంధించి లుక్, విలాసవంతమైన స్టైల్.. కర్దాషియాన్-జెన్నర్ పేరుకు మారుపేరుగా మారే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. కానీ ఇటువంటి ఇంద్రభవనాన్ని చూసేందుకు ఒక్కరోజు కూడా సరిపోదు అంటున్నారు ఔత్సాహికులు. 18 వేల చదరపు అడుగులలో ఉండే ఇల్లు ఇతర సౌకర్యాలను చూసేందుకు నిజంగానే వారం రోజులు కేటాయించాల్సిన అవసరం ఉందేమో. మరి ఇందులో నివసించే సెలబ్రిటీ సంగతి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీలకు ఎంతో ఖర్చుతో కట్టించుకున్న, తమకు ఇష్టమైన ఇంద్రభవనాలలో తమదైన శైలిలో సేద తీరడం మామూలు విషయమే అంటున్నారు నేటిజన్లు.