ఆ లిస్టులో కేవలం అలియా భట్ మాత్రమే!

అలియా భట్… స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురయిన అలియా.. తన ప్రతిభతోనే అవకాశాలను దక్కించుకుంటూ వస్తోంది. ఇక అప్పటి నుంచి వెనకకు చూసుకోనవసరం లేకుండా చిన్నదాని కెరియర్ సాగిపోతుంది. మధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినా కానీ.. ఈ బ్యూటీ జీవితం మాత్రం ఎటువంటి ఢోకా లేకుండా సాగుతోంది.  ఈ హాట్ గర్ల్ మొన్నే […]

Share:

అలియా భట్… స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురయిన అలియా.. తన ప్రతిభతోనే అవకాశాలను దక్కించుకుంటూ వస్తోంది. ఇక అప్పటి నుంచి వెనకకు చూసుకోనవసరం లేకుండా చిన్నదాని కెరియర్ సాగిపోతుంది. మధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినా కానీ.. ఈ బ్యూటీ జీవితం మాత్రం ఎటువంటి ఢోకా లేకుండా సాగుతోంది. 

ఈ హాట్ గర్ల్ మొన్నే బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. వెంటనే ఈ కపుల్‌కు పండంటి ఆడపిల్ల జన్మించింది. ఇక ఈ అమ్మడు నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అవుతుంది. ఈ మూవీలో బ్యూటీ రోల్ తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రోల్‌తో చిన్నదానికి ఎక్కడ లేని పేరు వచ్చింది. తెలుగులో కూడా అలియాకు మంచి మార్కెట్ ఏర్పడింది. తర్వాత రిలీజయిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మస్త్రకు ఇది ఎంతో తోడ్పడింది. 

టాప్ గేర్‌లో అలియా కెరియర్ 

గత కొన్ని సంవత్సరాలుగా అలియా భట్ కెరియర్ టాప్ గేర్‌లో కొనసాగుతోంది. గత సంవత్సరం నుండి అలియా తన వ్యక్తిగత జీవితంలో మరియు వృత్తిపరంగా గొప్ప పురోగతిని సాధిస్తోంది. ఈ నటి గంగూబాయి కతియావాడితో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతే కాకుండా OTT వేదికగా విడుదలైన డార్లింగ్స్‌తో చిత్ర నిర్మాతగా విజయవంతంగా అరంగేట్రం చేసింది. మరోవైపు ఆస్కార్ బరిలో నిలిచిన పాన్-ఇండియా చిత్రం RRRలో కూడా అమ్మడు నటించింది. ఇక గత సంవత్సరం రణబీర్ కపూర్‌ను పెళ్లి చేసుకున్న ఈ చిన్నది పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఇంపాక్ట్‌ఫుల్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ 2023 జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన అలియా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. 

ఆ మూవీలతోనే

RRR మరియు గంగూబాయి కతియావాడిలో చేసిన రోల్స్ కారణంగా అలియాకు ఈ స్థానం దక్కింది. గంగూభాయ్ కతియావాడి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు మాత్రమే కాకుండా బ్రహ్మస్త్ర వంటి సోషియో ఫాంటసీ, ఎపిక్‌లోనూ ఈ బ్యూటీ నటించింది. పార్ట్ వన్ శివగా తెరకెక్కగా.. ఇందులో ఆమె భర్త రణబీర్ కపూర్‌తో కలిసి నటించింది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ రిలీజ్ కాగా.. అన్ని భాషల్లో ఘన విజయం సొంతం చేసుకుంది. కాగా.. ఈ కపుల్‌కు పండంటి ఆడపిల్ల ఉన్న విషయం తెలిసిందే. ఆ అమ్మాయికి ఈ కపుల్ రాహా అనే పేరు పెట్టారు. అలియా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న  హార్ట్ ఆఫ్ స్టోన్‌లో గాల్ గాడోట్‌తో కలిసి నటించింది. రాబోయే కాలంలో ఆమె దర్శకుడు కరణ్ జోహార్‌తో మళ్లీ కలవనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జూలైలో విడుదల కానున్న రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో రణవీర్ సింగ్ సరసన ఈ బ్యూటీ నటిస్తుంది. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటితే అలియా భట్‌కు ఎటువంటి అడ్డూ అదుపూ ఉండదు. 

చాలా హ్యాపీగా ఉంది.. 

తనకు ఇలా ప్రముఖ మ్యాగజైన్‌లో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని అలియా భట్ వెల్లడించింది. ఇండియా నుంచి అలియా భట్ ఒక్కరే ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. తాను ఇప్పటికే అన్ని రకాల విషయాల ద్వారా అనుభవం పొందానని అలియా పేర్కొంది.