కొత్త ఇల్లు కొన్న ఆలియా భట్

బాలీవుడ్ నటి అలియా భట్ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇటీవల తన మొదటి పెళ్లి వార్సికొత్సవం జరుపుకున్న నటి ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తొంది. ముంబాయిలో ఆలియా.. నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్ట్ బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని కొన్ని వార్తలు ప్రచురితం అయ్యాయి. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ లిస్టులో ఒకరిగా నటి అలియా భట్ ఉన్నారు. కేవలం బాలీవుడ్ సీనీ ఇండస్ట్రీలో […]

Share:

బాలీవుడ్ నటి అలియా భట్ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇటీవల తన మొదటి పెళ్లి వార్సికొత్సవం జరుపుకున్న నటి ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తొంది. ముంబాయిలో ఆలియా.. నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్ట్ బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని కొన్ని వార్తలు ప్రచురితం అయ్యాయి.

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ లిస్టులో ఒకరిగా నటి అలియా భట్ ఉన్నారు. కేవలం బాలీవుడ్ సీనీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సీనీ ఇండస్ట్రీలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణను అలియా భట్ సంపాదించుకున్నారు. అటు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. త్వరలోనే అలియా భట్ తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీ అవ్వనున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా అలియా భట్ ముంబైలో దాదాపు 37 కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన ఇల్లును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ భవనాన్ని కొనుగోలు చేసిన ఆలియా భట్ త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే తన ప్రొడక్షన్ హౌస్ పేరిట అలియా భట్ ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ కోసం అలియా భట్ ఏకంగా 2.26 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా ఖరీదైన ఇల్లను కొనుగోలు చేసి త్వరలోనే ఈమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని, అందుకు సంబంధించిన కార్యకలాపాలని ఇక్కడ నుంచే కొనసాగుతాయని సన్నిహితులు చెబుతున్నారు.

కాగా అలియా భట్ ఇదివరకే ముంబైలో రెండు బంగ్లాలను కొనుగోలు చేశారు. ఒకటి తన చెల్లెలకు కానుకగా ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ భవనం విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇక మరొక  ఇంటిలో ప్రస్తుతం తన భర్తతో కలిసి అలియా నివసిస్తున్నారు. అయితే నటి ఆలియా భట్ ప్రస్తుతం మరొక ఇంటి నిర్మాణ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత నటి ఆలియా రణబీర్ ఈ ఇంట్లోనే ఉండబోతున్నారు. కాగా తను ఓ ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో తన వ్యక్తిగత జివితంలో కొద్దిగా బీజీ అయ్యారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియా త్వరలోనే నిర్మాతగా కూడా మారబోతున్నారని తెలుస్తుంది.

కాగా అలియా… భట్ కుటుంబంలో జన్మించింది. ఆమె చిత్రనిర్మాత మహేష్ భట్ మరియు నటి సోనీ రజ్దాన్ ల‌కు దంపతులకు జన్మించింది . 1999 థ్రిల్లర్ సంఘర్ష్‌లో చిన్నతనంలో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత , కరణ్ జోహార్ యొక్క టీనేజ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012) లో ఆమె తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది . ఆమె రోడ్ డ్రామా హైవే (2014)లో కిడ్నాప్ బాధితురాలిగా నటించినందుకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకుంది. జోహార్ స్టూడియో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన అనేక శృంగార చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది.