‘ఓ మై గాడ్ 2 ‘ టీజర్ కి సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్

మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రం 2015 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్. ఇక్కడ పవన్ కళ్యాణ్ , వెంకటేష్ పోషించిన పాత్రలను అక్కడ అక్షయ్ కుమార్ , పరేష్ […]

Share:

మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రం 2015 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్. ఇక్కడ పవన్ కళ్యాణ్ , వెంకటేష్ పోషించిన పాత్రలను అక్కడ అక్షయ్ కుమార్ , పరేష్ రావల్ పోషించారు. అప్పట్లో బాలీవుడ్ లో ఈ సినిమా ఒక సంచలనం. తన షాప్ కూలిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీఇది యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల సంభవించింది, దీనికి మా కంపెనీ కి ఎలాంటి సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుంటాయి. అప్పుడు కథానాయకుడు ఏకంగా దేవుడి మీద కోర్టు లో కేసు వెయ్యడానికి చూస్తాడు. దేవుడికి వ్యతిరేకంగా వాదించేందుకు ఒక్క లాయర్ కూడా ముందుకు రాదు, దీంతో కథానాయకుడే తన కేసు ని తానూ వాదించుకుంటాడు, అతడి పట్టుదల చూసి ఏకంగా దేవుడే దిగి వచ్చి, అతని సమస్యతో పాటుగా, అదే విషయం లో అన్యాయానికి గురైన వేలాది మంది తరుపున పోరాడి గెలిచేలా చేసి, తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు.

భక్తుడి నమ్మకానికి పరీక్షే ‘ఓ మై గాడ్ 2’ ? :

‘ఓ మై గాడ్’ చిత్రం లో అక్షయ్ కుమార్ మోడరన్ శ్రీకృష్ణ అవతారం లో కనిపించాడు. ఇక తెలుగు లో పవన్ కళ్యాణ్ కూడా ఈ పాత్రలోనే కనిపించాడు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ‘ఓ మై గాడ్’ చిత్రానికి సీక్వెల్ గా మరో సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన టీజర్ ని టీజర్ ని నిన్ననే విడుదల చేసారు, ఈ సినిమాలో అక్షయ్ కుమార్ మహాశివుడి పాత్ర పోషించాడు.  మొదటి భాగం లో ఒక నాస్తికుడికి దేవుడికి మధ్య స్టోరీ నడవగా , రెండవ భాగం లో మాత్రం ఒక భక్తుడికి , దేవుడికి మధ్య స్టోరీ నెడుతుంది. దేవుడు అన్న తర్వాత భక్తుడిని ,నాస్తికుడుని సమానంగా చూడడమే అతని ధర్మం అంటూ ఈ టీజర్ మొదలు అవుతుంది. మొదటి భాగం లో కథానాయకుడిగా పరేష్ రావెల్ నటించగా, రెండవ భాగం లో పంకజ్ త్రిపాఠి నటించాడు. భగవంతుడి మీద నమ్మకం కోల్పోవద్దు అనే అంశాన్ని మాత్రమే నిన్న విడుదల చేసిన టీజర్ లో చూపించారు కానీ, మూవీ మెయిన్ స్టోరీ ఏమిటో మాత్రం రెవీల్ చెయ్యలేదు.

ఆరోజుల్లోనే 90 కోట్ల రూపాయిల వసూళ్లు:

ఇక టీజర్ కి ఇంటర్నెట్ లో పాజిటివ్ కామెంట్స్ తో సమానంగానే నెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. వేరే వాళ్ళ సంగతి పక్కన పెడితే, అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ పై చాలా పాజిటివ్ గా ఉన్నారు. మహాశివుడి గెటప్ లో అక్షయ్ కుమార్ చాలా బాగున్నాడని, అతని ముఖం లో దైవత్వం ఉట్టిపడుతుంది అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. గత కొంతకాలం నుండి అక్షయ్ కుమార్ కి బాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం తో ఆయన కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు అని బలమైన నమ్మకం తో ఉన్నారు అక్షయ్ కుమార్ ఫ్యాన్స్. 2012 వ సంవత్సరం లో  విడుదలైన ‘ఓ మై గాడ్’ చిత్రానికి అప్పట్లోనే 90 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. అంట పెద్ద బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ చేసారు కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.