అక్షయ్‌ కుమార్‌‌కు భారత పౌరసత్వం

బాలీవుడ్‌ యాక్టర్‌‌ అక్షయ్‌ కుమార్‌‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా ఆయనకు భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్‌‌ స్వయంగా ట్విట్టర్‌‌ (ఎక్స్) ద్వారా వెల్లడించాడు. పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను షేర్‌‌ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘దిల్‌ ఔర్‌‌ సిటిజన్‌షిప్‌, దోనో హిందూస్థానీ (నా హృదయం.. పౌరసత్వం .. రెండూ హిందూస్థానీ)’ అని ట్విట్టర్‌‌లో రాసుకొచ్చాడు. ఎరుపు రంగు ఫోల్డర్‌‌పై గవర్నమెంట్‌ ఆఫ్‌  ఇండియా మినిస్ట్రీ […]

Share:

బాలీవుడ్‌ యాక్టర్‌‌ అక్షయ్‌ కుమార్‌‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా ఆయనకు భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్‌‌ స్వయంగా ట్విట్టర్‌‌ (ఎక్స్) ద్వారా వెల్లడించాడు. పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను షేర్‌‌ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. ‘‘దిల్‌ ఔర్‌‌ సిటిజన్‌షిప్‌, దోనో హిందూస్థానీ (నా హృదయం.. పౌరసత్వం .. రెండూ హిందూస్థానీ)’ అని ట్విట్టర్‌‌లో రాసుకొచ్చాడు. ఎరుపు రంగు ఫోల్డర్‌‌పై గవర్నమెంట్‌ ఆఫ్‌  ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్‌ అఫైర్స్, సర్టిఫికెట్‌ ఆఫ్ సిటిజన్షిప్ అని ముద్రించి ఉన్న పౌరసత్వం పత్రాలను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు. ఆయన పూర్తి పేరు అక్షయ్ హరిఓం భాటియా పేరు మీద పౌరసత్వం మంజూరు అయింది. దీంతో కెనడా పౌరసత్వాన్ని అక్షయ్‌ రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్‌ అవుతూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు. 

 తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్‌ గతంలో  వెల్లడించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందటే తన కెనడా పాస్‌పోర్ట్‌ ను కూడా రెన్యూవల్‌ చేయించుకున్నాడు. అయితే, ఇండియాలో ఉంటూ భారత పౌరసత్వాన్ని కలిగి ఉండకపోవడానన్ని చాలా మంది తప్పుబట్టారు. కెనడా పౌరసత్వం ఉండి ఇండియాలో ఉండటంపై అక్షయ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.దీనిపై చాలా సార్లు అక్షయ్‌  కుమార్‌‌ వివరణ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో 2019లో భారతీయ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, అయితే కరోనా కారణంగా ఆలస్యం అయిందని చెప్పాడు. 

అయితే, కెనడా పౌరసత్వం తీసుకోవడంపై అక్షయ్‌ కుమార్‌‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. ‘‘1990ల్లో నేను చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. వరుసగా 15 సినిఆలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న నా ఫ్రెండ్‌ సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసమే ఆ దేశ పాస్ట్‌ పోర్ట్ కు అప్లయ్ చేసుకున్నాను. ఆ వెంటనే కెనడా పాస్‌పోర్ట్ వచ్చింది. అదే సమయంలోనే అప్పటికే నేను నటించిన రెండు సినిమాలు ఇండియాలో ఘన విజయం సాధించాయి. దీంతో నేను కెనడాకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఆ పాస్‌పోర్ట్‌ సంగతి కూడా నేను మర్చిపోయాను. అందుకే మళ్లీ ఇప్పుడు ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాను” అంటూ అసలు విషయం వెల్లడించాడు అక్షయ్. 

పౌరసత్వం లేనంత మాత్రాన తాను భారతీయుడిని కాదని అనుకోవడం లేదని అన్నాడు. తాను ఇక్కడే స్థిరపడ్డానని, ఇక్కడే సంపాదిస్తున్నానని, అందులో కొంత మొత్తాన్ని సమాజానికి తిరిగి చెల్లిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. నాకు తిరిగి భారత పౌరసత్వం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. కెనడా పౌరసత్వంపై ప్రజలు రకరకాలుగా మాటలు మాట్లాడారని, అవి తనను ఎంతగానో బాధ పెట్టాయన్నాడు. 

కాగా, ఇటీవల విడుదల అయిన అక్షయ్‌ కుమార్‌‌ మూవీ ఓ మై గాడ్‌2 సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌‌లో రన్‌ అవుతుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.50 కోట్ల మార్కును దాటింది. గదర్2 కారణంగా తక్కువ స్క్రీన్లు కేటాయించినప్పటికీ ఓ మై గాడ్‌2కి కేవలం నాలుగు రోజుల్లో రూ.55 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో శివుడిగా నటించి బెస్ట్ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. 

ఓ మై గాడ్‌2 మూవీ కంటే ముందు అక్షయ్‌ కుమార్‌‌  నటించిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేదు. చాలా రోజుల తర్వాత అక్షయ్ ఖాతాలో సక్సెస్‌ పడింది. అంతకుముందు సెల్ఫీ, రామ్‌సేతు, రక్షాబంధన్, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌, బచ్చన్ పాండే తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయాయి.