అబ్బురుపరుస్తున్న అజిత్ యూరప్ బైక్ టూర్ 

హీరో అజిత్ కుమార్ అంటే దేశంలో తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాలలో తనదైన శైలిలో నటించి ఇప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులను దక్కించుకున్నారు హీరో అజిత్ కుమార్. ప్రస్తుతం అజిత్ కుమార్ యూరోప్ లో దర్శనమిచ్చారు. అంతేకాకుండా అతను వరల్డ్ బైక్ టూర్ ప్లాన్ లో భాగంగా యూరప్ లో బైక్ టూర్ లో ఉన్నట్లు ప్రస్తుతం అజిత్ కుమార్ ఫోటోలు వైరల్ గా మారాయి.  డిఫరెంట్ […]

Share:

హీరో అజిత్ కుమార్ అంటే దేశంలో తెలియని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం చిత్రాలలో తనదైన శైలిలో నటించి ఇప్పటికీ కూడా ఎంతోమంది అభిమానులను దక్కించుకున్నారు హీరో అజిత్ కుమార్. ప్రస్తుతం అజిత్ కుమార్ యూరోప్ లో దర్శనమిచ్చారు. అంతేకాకుండా అతను వరల్డ్ బైక్ టూర్ ప్లాన్ లో భాగంగా యూరప్ లో బైక్ టూర్ లో ఉన్నట్లు ప్రస్తుతం అజిత్ కుమార్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

డిఫరెంట్ లైఫ్ స్టైల్: 

హీరో అజిత్ కుమార్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో సూపరిచితులు. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ అదే విధంగా ప్రతి విషయం లోని ప్రత్యేకతను కోరుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రస్తుతం హీరో అజిత్, కొన్ని నెలలుగా వర్డ్ టూర్ చేస్తున్నట్లు సమాచారం. టూర్ లో భాగంగా ఆయన ప్రస్తుతం యూరప్ లో బైక్ టూర్ లో ఉన్నట్లు తీసుకున్న ఫోటోలు, అజిత్ భార్య షాలిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తర్వాత వైరల్ గా మారాయి. 

ముఖ్యంగా అజిత్ తన షూటింగ్ సమయాలలో తప్పిస్తే, మిగిలిన సమయం అంతా కూడా ప్రపంచ పర్యటనలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. నిజానికి ఒక సంవత్సరం గా ఆయన వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అజిత్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండకపోవడం కారణంగా అభిమానులకు ఆయన ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అనే సమాచారం అందుబాటులో ఉండేది కాదు. 

ఇటీవల హీరో అజిత్ భార్య షాలిని ఇంస్టాగ్రామ్ లో ఎకౌంటు క్రియేట్ చేసుకోవడం జరిగింది. కొన్ని నెలల క్రితమే ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన శాలిని తన కుటుంబ విషయాలు అదేవిధంగా హీరో అజిత్, తన పిల్లలు అనౌష్క అలాగే అద్విక్ ఫొటోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. అజిత్ సోషల్ మీడియాలో లేనప్పటికీ, షాలిని మాత్రం అజిత్ అభిమానులను ఏమాత్రం డిసప్పాయింట్ చేయడానికి ఇష్టపడదు. అందుకే, ప్రస్తుతం వరల్డ్ టూర్ లో ఉన్న అజిత్ గురించి కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంటూ, అజిత్ వర్డ్ టూర్ కి ఆల్ ద బెస్ట్ చెప్పింది. అంతేకాకుండా ఇప్పుడు చేస్తున్న యూరప్ బైకు టూర్ విశేషాలు చెబుతూ, అజిత్ బైక్ తో ఉన్న ఫోటోలు షేర్ చేసింది షాలిని. 

అభిమానుల సంతోషం: 

ఇన్స్టాగ్రామ్ లో షాలిని షేర్ చేసిన అజిత్ ఫోటోలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా, తమకు ఎంతో ఇష్టమైన జీవనసైలిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. చాలామంది అజిత్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని తెలియజేస్తూ కామెంట్లు వర్షాన్ని కురిపిస్తున్నారు. తమ అభిమాన హీరో ఫోటోలు షేర్ షేర్ చేసినందుకు అజిత్ భార్య షాలినికి థాంక్స్ చెబుతున్నారు మరికొందరు. 

రాబోయే అజిత్ సినిమాలు: 

ప్రముఖ నటుడు తన యూరప్ బైక్ టూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత విదా ముయార్చి-AK 62 అనే సినిమాలో తన 62వ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మగిజ్ తిరుమేని హెల్మ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు సమాచారం.