అందరూ చూస్తుండగా మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ బచ్చన్

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఎంత మంది హీరోయిన్లు పుట్టుకొచ్చిన ఐశ్వర్య రాయి బచ్చన్‌ని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేరు. ఈమె అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఆమె నటించాల్సిన అవసరమే లేదు, ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలు, వెండితెర మెరిసిపోతాది. విశ్వ సుందరిగా పేరు తెచ్చుకున్న ఈమె మణిరత్నం  తెరకెక్కించిన ‘ఇద్దరు’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమా తమిళ సినిమానే అయినా, ఆమె ఎక్కువగా బాలీవుడ్‌లోనే నటిస్తూ వచ్చింది. […]

Share:

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఎంత మంది హీరోయిన్లు పుట్టుకొచ్చిన ఐశ్వర్య రాయి బచ్చన్‌ని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేరు. ఈమె అందం గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఆమె నటించాల్సిన అవసరమే లేదు, ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలు, వెండితెర మెరిసిపోతాది. విశ్వ సుందరిగా పేరు తెచ్చుకున్న ఈమె మణిరత్నం  తెరకెక్కించిన ‘ఇద్దరు’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. తొలి సినిమా తమిళ సినిమానే అయినా, ఆమె ఎక్కువగా బాలీవుడ్‌లోనే నటిస్తూ వచ్చింది. అక్కడే ఈమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని తమిళం,  తెలుగు చిత్రాలలో నటించింది. అయితే ఆమె తొలి సినిమా దర్శకుడు మణిరత్నం కాబట్టి , ఆయన ఎప్పుడు డేట్స్ అడిగిన కాదు అనకుండా ఇచ్చేది ఐశ్వర్య రాయ్. ఇద్దరు చిత్రం తర్వాత ఆమె మణిరత్నం తెరకెక్కించిన ‘రావణ్’ అనే చిత్రం లో నటించింది, ఇందులో విక్రమ్ హీరో.

ఈ సినిమా తర్వాత ఆమె రీసెంట్‌గా మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో నటించింది, ఇందులో ఆమె ‘నందిని’ అనే నెగటివ్ రోల్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపర్చింది. ఇక రెండు రోజుల్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ప్రపంచవ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల కానుంది. అందుకోసం మూవీ యూనిట్ మొత్తం ప్రొమోషన్స్‌లో బిజీగా ఉంది, రీసెంట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్ మణిరత్నం కాళ్లు మొక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఉన్న రేంజ్‌కి అలా మొక్కాల్సిన అవసరం లేదు, కానీ మణిరత్నం తనకి సినీ జీవితం ఇచ్చాడు అనే విశ్వాసంతో ఇప్పటికీ ఆయన పట్ల అదే రేంజ్ గౌరవం చూపించడంపై ఐశ్వర్య రాయ్ పట్ల సోషల్ మీడియాలో నెటిజెన్ల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది.

ఇక ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ భాషలలో ప్రారంభం అయ్యింది. అయితే పార్ట్ 1 కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ రేంజ్‌లో పార్ట్ 2 కి జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పార్ట్ 1 కి కేవలం USA ప్రీమియర్ షోస్ నుండే 1 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లు వచ్చాయి. కానీ పార్ట్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ అందులో సగం కూడా లేవు, తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. పార్ట్ 1 కి ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి సుమారుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, సీక్వెల్‌కి అప్పట్లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ రావడం అనేది నల్లేరు మీద నడక అని విశ్లేషకులు సైతం అభిప్రాయం పడ్డారు. కానీ ఇప్పుడు అద్భుతమైన టాక్ వస్తే కానీ అది సాధ్యం కాదు అని అంటున్నారు.