Aishwarya Rai: అత్త, ఆడపడుచు పిల్లల్ని ఫోటోలో నుంచి తీసేసిన ఐశ్వర్య

మాజీ విశ్వ సుందరి, అందాల తార ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అంటే పడి చచ్చే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఐశ్వర్య రాయ్ అనగానే.. ఆమెను ఆరాధ్యంగా చూస్తారు అభిమానులు. ఎంతోమంది గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఐశ్వర్య ఇటీవలే.. మణిరత్నం దర్శకత్వం వహిస్తూ నిర్మించిన “పొన్నియన్ సెల్వన్” చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఐశ్వర్య. అయితే అనూహ్యంగా […]

Share:

మాజీ విశ్వ సుందరి, అందాల తార ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) అంటే పడి చచ్చే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఐశ్వర్య రాయ్ అనగానే.. ఆమెను ఆరాధ్యంగా చూస్తారు అభిమానులు. ఎంతోమంది గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఐశ్వర్య ఇటీవలే.. మణిరత్నం దర్శకత్వం వహిస్తూ నిర్మించిన “పొన్నియన్ సెల్వన్” చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ఐశ్వర్య. అయితే అనూహ్యంగా సోషల్ మీడియాలో ఆమెని కొంత మంది దారుణంగా ట్రోల్స్(Trolls) చేస్తున్నారు. ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటే..?

సెలబ్రిటీలు ఏం చేసినా అందులో తప్పొప్పులు వెతకడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్‌( (Aishwarya Rai)) ఓ పోస్ట్‌ పెట్టగా చాలామంది దాన్ని తప్పుపడుతున్నారు. అక్టోబర్‌ 11న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amithab Bacchan) తాజాగా తన 81 పుట్టినరోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు .అయితే ఈయన పుట్టినరోజు చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు ప్రతి ఒక్కరు ఆయనకు స్పెషల్ గా విష్ చేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్య ఒక రోజు ఆలస్యంగా మామగారికి బర్త్‌డే విషెస్‌(Birthday wishes) చెప్పింది. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉండునుగాక అంటూ తన కూతురు ఆరాధ్యతో బిగ్‌బీ దిగిన ఫోటోను షేర్‌ చేసింది. అంతా బాగుంది కానీ ఈ ఫోటోను జూమ్‌ చేసి, క్రాప్‌ చేసి మరీ పెట్టింది.

అత్తను కూడా ఫోటోలో నుంచి డిలీట్‌

ఈ విషయం ఎలా తెలిసిందంటే? బిగ్‌బీకి అతడి మనవరాలు నవ్య నవేలి నందా(శ్వేతా బచ్చన్‌ కూతురు) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ(Instagram story)లో షేర్‌ చేసింది. ఇందులో బిగ్‌బీ, జయా బచ్చన్‌(Jaya Bachchan), నవ్య, అగస్త్య, ఆరాధ్య ఉన్నారు. ఇదే ఫోటోను తీసుకున్న ఐశ్వర్య తన అత్తతో సహా అందరినీ క్రాప్‌ చేసి అవతల పడేసింది. బిగ్‌బీ, ఆరాధ్య మాత్రమే ఉండేలా ఎడిట్‌ చేసింది. దాన్ని సోషల్‌ మీడియాలో వదిలింది. ఇది చూసిన జనాలు ఏదో తేడా కొడుతోందని కామెంట్లు చేస్తున్నారు.

ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్యను లైట్‌ తీసుకున్నారా?

కాగా ఇటీవల జయా బచ్చన్‌, శ్వేతా బచ్చన్‌ పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌కు హాజరయ్యారు. ఈ ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్య రాయ్‌తో పాటు, నవ్య కూడా ర్యాంప్‌ వాక్‌ చేసింది. జయ, శ్వేత.. నవ్యను ఎంకరేజ్‌ చేస్తూ ఆమెలో ఉత్సాహాన్ని నింపారు, కానీ ఐశ్వర్యను మాత్రం లైట్‌ తీసుకున్నారు. అందుకే ఈసారి ఐశ్వర్య వారి ఫోటోలను కట్‌ చేసి కేవలం తన కూతురు మాత్రమే కనిపించేలా ఫోటో పోస్ట్‌ చేసిందని ఫ్యాన్స్‌ గెస్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కోపం పెట్టుకున్న ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) కావాలనే వీరి ఫోటోలు ఎడిట్ చేసి తన కూతురు మామయ్య ఫోటోలు మాత్రమే పెట్టుకుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ చాలామంది నెటిజన్స్ మాత్రం ప్రతిసారి ఐశ్వర్యరాయ్ తన కూతురు మామ కలిసి ఉన్న ఫోటోలు మాత్రమే బర్త్డే రోజు పెడుతుంది.ఇందులో అనుమానించదగిన విషయం ఏమీ లేదు అని కొట్టి పారేస్తున్నారు.  

ఇకపోతే ఐశ్వర్య రాయ్‌ చివరగా పొన్నియన్‌ సెల్వన్‌(Ponnian Selvan) సినిమాలో కనిపించింది. ఇక సినిమాల విషయానికొస్తే ఐశ్వర్య రాయ్ తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవి సరసన నటించనున్నారనే టాక్ నడుస్తోంది. ఐశ్వర్య రాయ్‌తో  మరో హీరోయిన్‌గా మృణాల్‌ను అనుకుంటోందట టీమ్. అయితే ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన విడుదలకానుంది. ఈ సినిమమాను యువీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లనుంది.