మెగా ప్రిన్సెస్ క్లీంకారా కొణిదెల..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి మనకి తెలిసింది ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది పాపకు మెగా ఇంట ఘనంగా బారసాల వేడుక నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది పాపకు క్లీన్ తార అని పేరు పెట్టారు ఈ ప్రత్యేకమైన పేరు పై సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి ఇంతకీ ఆ చిన్నారికి ఈ పేరు పెట్టింది ఎవరు.. ఆ పేరు వెనుక ఉన్న మరికొన్ని సీక్రెట్స్ ఇప్పుడు […]

Share:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన సంగతి మనకి తెలిసింది ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చింది పాపకు మెగా ఇంట ఘనంగా బారసాల వేడుక నామకరణం అంగరంగ వైభవంగా జరిగింది పాపకు క్లీన్ తార అని పేరు పెట్టారు ఈ ప్రత్యేకమైన పేరు పై సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి ఇంతకీ ఆ చిన్నారికి ఈ పేరు పెట్టింది ఎవరు.. ఆ పేరు వెనుక ఉన్న మరికొన్ని సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

రామ్ చరణ్ ఉపాసన జూన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులయ్యారు. కొణిదెలా వారసురాలు రావడంతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది. జూన్ 20వ తేదీన రామ్ చరణ్ ఉపాసనలకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే . జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పటల్లో ఉపాసన ప్రసవించింది. తాను తాతగా మారిన ఆనందంలో అదే రోజు చిరంజీవి వెంటనే హాస్పటల్ కి వెళ్లి తన మనవరాలిని చూసి మురిసిపోయారు. పాప తనలాగే ఉందని డిశ్చార్జ్ రోజు మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ తెలిపారు. 

చిరంజీవి ట్వీట్ చేస్తూ.. నా మనవరాలికి క్లీంకారా కొణిదెల అని  నామకరణం చేసాము. ఈ పేరుని లలితా సహస్రనామ శ్లోకం నుండి తీసుకున్నాము క్లీంకారా అంటే ప్రకృతికి స్వరూపం అని అర్థం. అంతే అతీతమైన అమ్మవారి శక్తి అని కూడా ఈ పేరులో ఉంటుంది. మా బిడ్డ ఎదిగే కొద్ది లక్షణాలను కూడా పొందుతుంది అని అనుకుంటున్నాము అంటూ చిరంజీవి పోస్ట్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జూన్ 30 న  పాపని ఉయ్యాలలో వేస్తూ ఒకపక్క చిరంజీవి సురేఖ నిలబడగా మరోపక్క రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. 

ప్రస్తుతం మెగా వారసురాలి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ చిన్నారి పేరుని KKK గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన కూతురుకు తన బాబాయ్ ఒరిజినల్ పేరు కళ్యాణ్ కుమార్ కొణిదల KKK పేరు కలిసొచ్చే విధంగా తన కుమార్తెకు క్లీన్ కారా కొణిదల KKK అని నామకరణం చేశారని , పలువురు ఇద్దరి పేర్లు మ్యాచ్ చేస్తున్నారు.  ఇలా పవన్ కళ్యాణ్ ఒరిజినల్ పేరుతో రామ్ చరణ్ కూతురు పేరు మ్యాచ్ అవ్వడంతో బాబాయ్ పేరుని తన కుమార్తె పేరు కలిసి వచ్చేలా రామ్ చరణ్ పెట్టుకున్నారని అనుకుంటున్నారు.

ఇంతకీ రామ్ చరణ్ ఉపాసనల కూతురికి క్లీన్ కారా అని పేరు పెట్టింది మరెవరో కాదు ఉపాసనా తల్లి శోభన కామినేని. ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఉపాసన నువ్వు పుట్టినప్పుడు నీకు క్లీన్ కారా అని పేరు పెట్టాలనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. రామ్ చరణ్ ఉపాసనలకు అభినందనలు. మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము కారా అని తన మనవరాలు బారసాల వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది శోభన కామినేని. ఈ పోస్ట్ కి ఉపాసన స్పందిస్తూ ధన్యవాదాలు అమ్మ అని రిప్లై ఇచ్చింది.