అడవి శేష్ కొత్త సినిమా కబుర్లు

టాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కొద్ది రోజులుగా టాలీవుడ్ లో అడవి శేష్ తన హవాను కొనసాగిస్తున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ పెద్ద హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఒకప్పుడు అడవి శేష్ సినిమాలను పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అడివి శేష్ మూవీ వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త దనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అలా ప్రేక్షకులను అడివి […]

Share:

టాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కొద్ది రోజులుగా టాలీవుడ్ లో అడవి శేష్ తన హవాను కొనసాగిస్తున్నాడు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ పెద్ద హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఒకప్పుడు అడవి శేష్ సినిమాలను పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ప్రస్తుతం కాలం మారింది. అడివి శేష్ మూవీ వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త దనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అలా ప్రేక్షకులను అడివి శేష్ నమ్మకాన్ని ఇచ్చాడు. మొన్నే ముంబై బ్లాస్ట్ లో వీరమరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితగాధ ఆధారంగా మేజర్ సినిమాను రిలీజ్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేష్ ప్రస్తుతం గూఢచారి-2 మూవీని చేస్తున్నాడు. మేజర్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసినా కానీ అది హిట్ అయింది. కేవలం మన తెలుగు నాట అనే కాకుండా ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఈ మూవీకి కనెక్ట్ అయ్యారు. 

మహేశ్ నమ్మకాన్ని చూరగొన్న శేష్

సాధారణంగా యంగ్ హీరోల సినిమాలంటే పెద్ద హీరోలు అంతగా కాన్సంట్రేట్ చేయరు. కానీ అటువంటిది అడివి శేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నమ్మకాన్ని చూరగొన్నాడు. శేష్ నటించిన లాస్ట్ మూవీ మేజర్ కు మహేశ్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. మహేశ్ కు ఈ మూవీ తెగ లాభాలు తెచ్చిపెట్టింది. మహేశ్ కేవలం హీరోగా సినిమాలు చేయడం మాత్రమే కాకుండా తన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా యంగ్ హీరోలతో పలు సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. అందులో భాగంగానే అడివి శేష్ తో మేజర్ వంటి పాన్ ఇండియా సినిమాను నిర్మించాడు. ఈ మూవీ రిలీజైన ప్రతి చోటా హిట్ గా నిలిచి మహేశ్ నమ్మకాన్ని నిలబెట్టింది. 

గూఢచారి-2తో బిజీ

ఇలా ప్రామినెంట్ హిట్స్ ఇస్తున్న అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి-2 మూవీ చేస్తున్నాడు. అడవి శేష్ చేసిన చాలా థ్రిల్లర్ మూవీలలాగే ఈ మూవీ కూడా ఒక థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ. గూఢచారి మూవీ ఇప్పటికే వచ్చి హిట్ కొట్టింది. దానికి కొనసాగింపుగానే ప్రస్తుతం గూఢచారి-2 తెరకెక్కుతోంది. కావున ఈ సినిమా రిజల్ట్ మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. 

కొత్త జానర్ లో శేష్

అడివి శేష్ ఎక్కువగా థ్రిల్లర్ యాక్షన్ జానర్ సినిమాలే చేశాడు. అతడి ఫ్యాన్స్ అతడిని యాక్షన్, థ్రిల్లర్ జానర్ లో కాకుండా కొత్త జానర్ లో చూడాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. కానీ చాలా రోజుల నుంచి శేష్ ఇవే తరహా జానర్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ప్రస్తుతం శేష్ అభిమానుల కోరిక నెరవేరేలా ఉంది. అతడు చేస్తున్న గూఢచారి-2 మూవీ తర్వాత శేష్ ఓ లవ్ స్టోరీని చేయనున్నట్లు స్వయంగా ప్రకటించాడు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే విషయం మీద శేష్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా మాట్లాడుతూ.. ఒక కొత్త చిత్రం కోసం లుక్ టెస్ట్ చేశానని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇది ప్రేమకథగా ఉంటుందని కూడా తెలిపాడు. ఈ వార్తను చూసిన శేష్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మూవీలో అడివి శేష్ రొమాంటిక్ లుక్ లో కనిపించడం ఖాయం అని అతడి ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ లో వస్తుందని సమాచారం. 

గూఢచారి-2 సెట్స్ పైకి

2018లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గూఢచారి మూవీకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కొనసాగింపు వస్తుందని 2018లోనే ఈ మూవీలోనే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ మూవీని మేకర్స్ ప్రకటించారు. ప్రకటన అయితే చేశారుగానీ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూశారు. ఈ ఏడాది చివర్లో అత్యంత విజయవంతమైన స్పై థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్‌ ను ప్రారంభించనున్నట్లు హీరో తెలిపారు. 

అది మాత్రమే కాకుండా ఈ హీరో మాట్లాడుతూ… తాను టైట్ షెడ్యూల్ లో ఉన్నానని తెలిపాడు. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా హిందీ ఆఫర్స్ పోగొట్టుకున్నానని తెలిపాడు. అయినా తనకు బాధగా లేదని అన్నాడు. తాను తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు. తన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి కనుక తాను హిందీ సినిమా చేయలేదనే బాధ అంతగా లేదని పేర్కొన్నాడు. అడవి శేష్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అతడు కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా డైరెక్టర్, స్క్రీన్ రైటర్ (కథా రచయిత) గా కూడా మనందరికీ పరిచయమే.