గూఢచారి–2 పనుల్లో అడవి శేష్ బిజీ

ఎలాంటి అండదండలు లేకుండానే సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అడవి శేష్. తన టాలెంట్‌నే పెట్టుబడిగా పెట్టి విజయం సాధిస్తున్నాడు. సైడ్ క్యారెక్టర్స్‌తో మొదలుపెట్టి.. పాన్ ఇండియా స్టార్‌‌ స్థాయికి ఎదిగాడు. తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత చిన్న పాత్రలు చేశాడు. కానీ తనలోని రచనను బయటికి తీసి.. ఆసక్తికర కథలను మలచి.. ఆ కథలతో వరుస హిట్లతో బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతడు చేసే ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలోనే. […]

Share:

ఎలాంటి అండదండలు లేకుండానే సినీ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అడవి శేష్. తన టాలెంట్‌నే పెట్టుబడిగా పెట్టి విజయం సాధిస్తున్నాడు. సైడ్ క్యారెక్టర్స్‌తో మొదలుపెట్టి.. పాన్ ఇండియా స్టార్‌‌ స్థాయికి ఎదిగాడు. తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత చిన్న పాత్రలు చేశాడు. కానీ తనలోని రచనను బయటికి తీసి.. ఆసక్తికర కథలను మలచి.. ఆ కథలతో వరుస హిట్లతో బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతడు చేసే ఏ సినిమా అయినా పాన్ ఇండియా స్థాయిలోనే.

పార్ట్‌2 పనుల్లో బిజీ

ఇక ఐదేళ్ల కిందట వచ్చిన ‘గూఢచారి’ సినిమా సూపర్‌‌హిట్. ఆసక్తికర కథనం, ట్విస్టులతో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఈ చిత్రానికి కథ అందించిన అడవి శేష్.. స్క్రీన్‌ప్లేలోనూ భాగమయ్యాడు. 2018 ఆగస్టు 3న ఈ సినిమా రిలీజైంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీసే పనిలో బిజీగా ఉన్నాడు శేష్. గూఢచారి–2కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. తొలి భాగాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయగా.. ఈసారి తన రేంజ్ పెరగడంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించే ప్లాన్‌లో అడవి శేష్ ఉన్నట్లు తెలుస్తోంది.

గూఢచారి2 స్క్రిప్ట్ పనులకు సంబంధించిన విషయాలను సంబంధిత విషయాలు తెలిసిన ఒకరు వెల్లడించారు. ‘‘స్పై థ్రిల్లర్ జీ2(గూఢచారి 2)ని పూర్తి చేసేందుకు అడవి శేష్ తన సమయం మొత్తం వెచ్చిస్తున్నాడు. ఇది పాన్‌ ఇండియాలో రిలీజ్ అవుతుంది. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండియా, యూఏఈ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో షూటింగ్ జరుపుకునే అవకాశం ఉంది. అక్టోబర్‌‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్ర బృంద ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఓ లవ్‌ స్టోరీపైనా శేష్ పని చేస్తున్నారు. ఇప్పటికే అది సగం పూర్తయింది. సీతారామం సినిమా తర్వాత అలాంటి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అందుకే అలాంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని అడవి శేష్ సిద్ధం చేస్తున్నారు” అని   వివరించారు. 

‘‘అడవి శేష్ గత రెండు సినిమాలు మేజర్, హిట్ 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. రెండూ సూపర్‌‌ హిట్ అయ్యాయి. దీంతో తాను ఎంచుకునే సినిమాల విషయంలో శేష్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. వాటితోపాటు ఉన్న సమయాన్ని గూఢచారి స్క్రిప్ట్‌ను పూర్తి చేయడంపై వెచ్చిస్తున్నాడు” అని చెప్పారు. 

సౌత్ ఇండియా ఇండస్ట్రీ స్థాయి పెరిగేలా

గూఢచారి తొలి భాగాన్ని శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు. ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శోభిత ధూళిపాళ్ల, సుప్రియా యార్లగడ్డ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. జీ2 విడుదలయ్యాక అంతర్జాతీయ వేదికపై సౌత్ ఇండియన్ సినిమా మరోస్థాయిలో ఉంటుందని అడవి శేష్ నమ్మకంగా ఉన్నారు.

ఇక తన సినీ కెరియర్ మొదట్లో తీవ్ర ఒడిదుడుకులను అడవి శేష్ ఎదుర్కొన్నారు. ప్రముఖ రచయిత అడవి బాపిరాజు.. శేష్‌కు ముత్తాత. సొంతం సినిమాలో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడవి శేష్ వచ్చారు. 2010లో వచ్చిన కర్మతో హీరో అయ్యారు. ఈసినిమాలో హీరోగా, దర్శకుడిగానూ వ్యవహరించారు. 2011లో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన పంజాలో కనిపించారు. బలుపు, కిస్, దొంగాట, బాహుబలి, రన్‌ రాజా రన్‌ తదితర సినిమాల్లో నటించాడు. అయితే క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్, హిట్2 తదితర సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇప్పుడు తనకు వచ్చిన పేరును నిలబెట్టుకునే పనిలో ఉన్నారు.