సిద్ధార్థ్‌ను ట్యాగ్ చేస్తూ అదితి పోస్ట్

హీరో సిద్ధార్థ్ .. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కథానాయకుడు. అయితే తెలుగు ప్రేక్షకులు కొత్తదనమున్న చిత్రాలు కాకుండా కమర్షియల్ మూవీస్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, ఫ్యామిలీ హీరోలకే పట్టం కడుతున్నారనే ఉద్దేశంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలను చాలా కాలం పాటు చేయలేదు. కొన్నాళ్లు ముందు శర్వానంద్‌ తో కలిసి మహా సముద్రం అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన ఇప్పుడు […]

Share:

హీరో సిద్ధార్థ్ .. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కథానాయకుడు. అయితే తెలుగు ప్రేక్షకులు కొత్తదనమున్న చిత్రాలు కాకుండా కమర్షియల్ మూవీస్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, ఫ్యామిలీ హీరోలకే పట్టం కడుతున్నారనే ఉద్దేశంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలను చాలా కాలం పాటు చేయలేదు. కొన్నాళ్లు ముందు శర్వానంద్‌ తో కలిసి మహా సముద్రం అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆయన ఇప్పుడు తెలుగు సినిమాల వైపే చూడటం లేదు.

ఈ కోలీవుడ్ హీరో ఇప్పుడు హైదరబాదీ బ్యూటీ అదితి రావు హైదరితో డేటింగ్‌లో ఉన్నాడు. అదితి రావు హైదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. ఇక ఈ సినిమా తరువాత అదితికి మంచి అవకాశాలే వచ్చినా విజయాలు మాత్రం దక్కలేదు. దీంతో అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ నే నమ్ముకుంది. ఇక ఎన్ని సినిమాలు చేసినా అదితికి రాని పేరు.. హీరో సిద్దార్థ్ తో ఆమె నడుపుతున్న ప్రేమాయణం ద్వారా వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిత్యం వీరిద్దరూ ముంబై వీధుల్లో జంటగా కనిపిస్తూనే ఉన్నారు. కానీ, ఎప్పుడు వీరు తమ రిలేషన్ గురించి అధికారికంగా చెప్పలేదు. దీంతో మీరు అసలు పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అనే అనుమానం అభిమానుల్లో ఎక్కువైపోతుంది. ఇక ప్రస్తుతం సిద్దార్థ్, అదితి తమ కెరీర్ ను చక్కదిద్దుకొనే పనిలో పడ్డారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

వీరిద్దరూ కలిసి మహా సముద్రంలో నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరు ఈ వార్తలను అవుననలేదు..అలాగని ఖండించనూ లేదు. దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ న్యూస్ ఇంకా వైరల్ అవుతూ వచ్చింది.వీరిద్దరు తరచుగా డేట్‌లకు వెళ్లడం, సెలూన్‌లకు వెళ్లడం, రెస్టారెంట్లలో భోజనం చేయడం, కారులో కలిసి పని చేసేందుకు వెళ్లడం, పొన్నియిన్ సెల్వన్ ఆడియో లాంచ్, జూబ్లీ మూవీ ఈవెంట్, శర్వానంద్ పెళ్లి వంటి పబ్లిక్ ఈవెంట్‌లు వంటివాటిని తరచుగా గమనించవచ్చు.  కానీ ఎట్టకేలకు ఈ వార్తలకు సిద్ధార్థ్, అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా అదితి రావ్ హైదరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో “నేను నా అభిమాన వ్యక్తికి భంగం కలిగించబోతున్నాను” అనే క్యాప్షన్‌తో ఒక మీమ్‌ను షేర్ చేసింది. నటి  ప్రస్తుతం రూమర్స్ ఉన్న ప్రియుడు సిద్ధార్థ్‌ పేరును ట్యాగ్ చేసింది. పైగా అతన్ని ‘తనకు ఇష్టమైన వ్యక్తి’ అని కూడా పిలిచింది. 

ఈ జంట సోషల్ మీడియాలో ముద్దుగా రొమాన్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. వారు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పుట్టినరోజులు వంటి ప్రత్యేక రోజులలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించడాన్ని ఎప్పటికీ కోల్పోరు. సిద్ధార్థ్ అదితి ఫోటోలపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీట్ కామెంట్స్ కూడా పోస్ట్ చేశాడు. గతంలో సిద్దార్థ్ కూడా అదితి రావు హైదరి పుట్టినరోజున ఆమెతో ఉన్న ఫొటోను సిద్ధార్థ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు నా గుండెల్లో యువరాణి అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ కామెంట్ వెనుక ఇద్దరి మధ్య లవ్ ఉందనే విషయాన్ని వారు చెప్పకనే చెప్పేశారంటున్నారు నెటిజన్స్.