షీ స్లేస్ ఛాంపియన్ అవార్డు గెలిచిన అదితి రావ్ హైదరీ

భాషా అవరోధాలను తొలగించి కొత్త పాత్రలను పోషించినందుకు అదితి షీ స్లేస్ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది. అదితి రావ్ హైదరీ బలమయిన మహిళల సమక్షంలో పెరిగింది. ఆమె తల్లి విద్యా రావు, ప్రసిద్ధ శాస్త్రీయ గాయని మరియు ఆమె అమ్మమ్మ శాంతా రామేశ్వర్ రావు ఒక ప్రసిద్ధి చెందిన విద్యావేత్త. హెచ్‌టి హెల్త్ షాట్స్ షీ స్లేస్ అవార్డ్స్ ఈవెంట్‌లో అవార్డు అందుకున్న, అదితి రావ్ హైదరి.. తన గత అనుభవాలు.. తన ఎదుగుదలకు మరియు భవిష్యత్తు […]

Share:

భాషా అవరోధాలను తొలగించి కొత్త పాత్రలను పోషించినందుకు అదితి షీ స్లేస్ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది. అదితి రావ్ హైదరీ బలమయిన మహిళల సమక్షంలో పెరిగింది. ఆమె తల్లి విద్యా రావు, ప్రసిద్ధ శాస్త్రీయ గాయని మరియు ఆమె అమ్మమ్మ శాంతా రామేశ్వర్ రావు ఒక ప్రసిద్ధి చెందిన విద్యావేత్త. హెచ్‌టి హెల్త్ షాట్స్ షీ స్లేస్ అవార్డ్స్ ఈవెంట్‌లో అవార్డు అందుకున్న, అదితి రావ్ హైదరి.. తన గత అనుభవాలు.. తన ఎదుగుదలకు మరియు భవిష్యత్తు కోసం ఎలా సిద్ధమయ్యాయో వివరించింది.

అదితి చాలా టాలెంటెడ్ నటి, ఆమె చాలా పాపులర్ టీవీ షోలలో కనిపించింది. అదే విధంగా ఓటీటీలో విదులైన తాజ్ మరియు జూబ్లీ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె త్వరలో సంజయ్ లీలా భన్సాలీ యొక్క హీరామండిలో కనిపించనుంది. ఇక గాంధీ టాక్స్ అనే మూకీ చిత్రంలో కూడా నటించనుంది. 

HT మీడియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్,  అంబియన్స్ గ్రూప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ కౌల్ చేతుల మీదుగా ఈ  అవార్డు అందుకుంది. ఈ అవార్డు నాకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. మా అమ్మ, అమ్మమ్మల ప్రోత్సాహం వల్లనే తాను ఈ స్టేజిలో ఉన్నానని,  ముఖ్యంగా మా అమ్మమ్మ నా చిన్నప్పటి నుండి అన్నింట్లో సహకారం అందించిందని, వాళ్ళు లేకపోతే నేను లేనట్టే అని పేర్కొంది. 

జీవితంలో నాకు ఛాంపియన్ అనేది పెద్ద పదం అనుకుంటా.. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి, నా జీవితం ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యింది. అందరూ నన్ను ఛాంపియన్‌గా పిలుస్తారని నేను అనుకోవడం లేదని ఆమె తెలిపింది. కలలను నిర్భయంగా సాకారం చేసుకోవాలని, నమ్మకంతో, దయతో, గౌరవంగా జీవించాలని అనుకుంటున్నానని ఆమె తెలిపింది. 

అదే విధంగా ప్రేక్షకులు కూడా ఇతరుల పట్ల దయతో ఉండాలని, వారి పట్ల సానుకూలంగా ఉండడం కూడా చాలా ముఖ్యమని ఆమె అన్నారు.

HT హెల్త్ షాట్స్‌ షీ స్లేస్ అవార్డ్స్‌‌ని.. యాంబియన్స్, వేదాంత కలిసి సంయుక్తంగా అందించాయి. వివిధ రంగాలలో వైవిధ్యం చూపుతున్న 20 మంది మహిళలను సత్కరించింది. కాగా.. గాయని ఉషా ఉతుప్‌ను షీ స్లేస్ లెజెండ్‌గా గౌరవించారు.

ఇప్పటివరకు అదితి రావ్ హైదరి ప్రధానంగా హిందీ, తమిళం మరియు తెలుగు చిత్రాలలో నటించింది. ఆమె 2006లో విడుదలయిన మలయాళ చిత్రం ప్రజాపతి (2006)తో సినీ రంగ ప్రవేశం చేసింది. మ్యూజికల్ డ్రామా రాక్‌స్టార్ (2011), హర్రర్ మూవీ మర్డర్ 3 (2013), థ్రిల్లర్ మూవీ వజీర్ (2016), మరియు పీరియాడికల్ సినిమా పద్మావత్ (2018) తో సహా పలు హిందీ చిత్రాలలో ఆమె సహాయ పాత్రల్లో నటించింది పోషించింది.

మణిరత్నం డైరెక్ట్ చేసిన కాట్రు వెలియిడై (2017) సినిమాతో తమిళ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది హైదరి. ఇక ఇదే సినిమాలో ఆమె బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్‌గా SIIMA అవార్డును గెలుచుకుంది. సమ్మోహనం (2018) లో ఆమె నటించిన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. అప్పటి నుండి ఆమె చెక్క చివంత వానం (2018), సూఫియుమ్ సుజాతయుమ్ (2020), మహా సముద్రం (2021) మరియు హే సినీమిక (2022) వంటి ఇతర తమిళ మరియు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.