ఎంత మానేద్దాం అనుకున్నా ఈ అలవాటు మానలేకపోతున్నానన్న అదితి రావ్ హైదారి

చందమామ కూడా ఈర్ష పడేంత అందంగా ఉంటుంది అదితి రావ్ హైదరి.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ అందాల భామ. తన అందం, అభినయంతో యావత్ సినీ ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఈ చూడ చక్కనమ్మ. ఇటీవల తన బ్యూటీ సీక్రెట్స్ ను ట్వీక్ ఇండియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. బ్యూటీ సీక్రెట్: మీరు […]

Share:

చందమామ కూడా ఈర్ష పడేంత అందంగా ఉంటుంది అదితి రావ్ హైదరి.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ అందాల భామ.

తన అందం, అభినయంతో యావత్ సినీ ప్రపంచాన్ని ఆకట్టుకుంది ఈ చూడ చక్కనమ్మ. ఇటీవల తన బ్యూటీ సీక్రెట్స్ ను ట్వీక్ ఇండియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బ్యూటీ సీక్రెట్:

మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి అని ఆ ఇంటర్వ్యూలో అడగగా.. నేను నా ముఖానికి ఎలాంటి సబ్బు వాడను. ఇంట్లోనే తయారు చేసుకున్న న్యాచురల్ పౌడర్లు, కషాయాలను మాత్రమే ఉపయోగిస్తాను. ఇక ఉదయం లేచిన తర్వాత పచ్చిపాలు, ఓట్స్ తో తయారు చేసిన మిశ్రమంతో ముఖాన్ని కడుక్కోవడం నాకు అలవాటు అని చెప్పింది. ఆ తరువాత టోనర్ రాసుకోవడం అస్సలు మర్చిపోను. షూటింగ్ ఉన్నా, లేకపోయినా.. బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా మాత్రం సన్ స్క్రీన్ తప్పకుండా రాసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక రాత్రి నిద్ర పోయే ముందు క్లెన్సర్ తో ముఖాన్ని కడుక్కుంటానని.. నిద్రపోయేటప్పుడు నైట్ క్రీం, ఐ క్రీమ్ ముఖానికి తప్పకుండా రాసి నిద్రపోతానని.. ఇవే నా బ్యూటీ సీక్రెట్స్ అంటూ కూల్ గా చెప్పేసింది అదితి.

అలవాటు మానలేకపోతున్నా..?

మనం అందంగా, ఫిట్ గా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం చేయడం తప్పనిసరి. నేను కూడా ప్రతిరోజు అరగంట వ్యాయామానికి కేటాయిస్తా. వారంలో మూడు రోజులు ట్రైనింగ్, మరో మూడు రోజులు యోగ చేస్తా.. ఇక షూటింగ్ సమయంలో కుదరకపోతే కనీసం 10 నిమిషాలైనా వర్కౌట్స్ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉందని తెలిపింది. అదేంటంటే .. ఉదయం లేవగానే ఫోన్ చూడడం. మరోవైపు రాత్రి నిద్రపోయే ముందు ఫ్లైట్ మోడ్ లోనే పెట్టినా.. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకుంటాను. ఈ అలవాటు మంచిది కాదని నాకు తెలుసు. కానీ ఈ అలవాటుని మానాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నా, కానీ మానేయలేకపోతున్నా. కానీ త్వరలోనే ఈ అలవాటుకి స్వస్తి పలికి, మెడిటేషన్ ను నా వర్క్ అవుట్ లో యాడ్ చేసుకుంటానని తెలిపింది.

బుల్లెట్ కాఫీ, సప్లిమెంట్స్

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏది ఉన్నా, లేకపోయినా.. బుల్లెట్ కాఫీ మాత్రం ఉండాల్సిందే. ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ఓ కప్పు బుల్లెట్ కాఫీ తాగకుండా ఉండలేనని తెలిపింది అదితి. అందరిలాగే నేను కూడా వీకెండ్ లో ఏది నచ్చితే అది తింటాను. అసలు డైట్ ఫాలో అవ్వను. ఇక షూటింగ్ సమయంలో మాత్రం కరెక్ట్ డైట్ ని తీసుకుంటాను. అదే విధంగా విటమిన్ సీ, బీ 12 సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

హెయిర్ కేర్: 

నాకు హెయిర్ స్టైల్స్ ఫాలో అవ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాటి వల్ల జుట్టు కుదుళ్ళు బలహీనపడే అవకాశం ఉంటుంది. నాకు లూజ్ హెయిర్ తో పాటు పోనీ వేసుకోవడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. హెయిర్ కేర్ లో భాగంగా జుట్టుకి కొబ్బరి నూనె రాసుకొని మర్దన చేసుకుంటానని చెప్పింది. తల స్నానం చేశాక మొరాకం ఆయిల్ రాసుకోవడం నా హెయిర్ కేర్ రొటీన్ లో భాగమని చెప్పింది. ఇక రోజు ఉదయాన్నే లేవగానే ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడం నాకు అలవాటు. సహజ సిద్ధంగా తయారు చేసిన నూనెను నోట్లోకి వేసుకొని పుక్కిలించడం వల్ల దంతాలు శుభ్రంగా ఉండడంతో పాటు, మెలమెలా మెరిసిపోతాయని తన బ్యూటీ సీక్రెట్స్ పంచుకుంది అదితి రావ్ హైదరి.