Siddharth-Aditi Rao: మరోసారి జంటగా కనిపించిన సిద్దార్థ్‌, అదితి

హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు..డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై(Mumbai) వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ ముంబైలోని పెట్ క్లినిక్(Pet Clinic) నుండి బయటకు వస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. Read More: Shraddha Kapoor: రూ. 4కోట్ల లంబోర్ఘినిలో […]

Share:

హీరో సిద్దార్థ్(Siddharth), హీరోయిన్ అదితిరావు హైదరి(Aditi Rao Hydari) గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు..డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై(Mumbai) వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ ముంబైలోని పెట్ క్లినిక్(Pet Clinic) నుండి బయటకు వస్తున్నట్లు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది.

Read More: Shraddha Kapoor: రూ. 4కోట్ల లంబోర్ఘినిలో చక్కర్లు కొడుతున్న శ్రద్ధా కపూర్

వీరిద్దరూ కలిసి `మహా సముద్రం`(Mahasamudram)అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని తెలుస్తుంది. అప్పట్నుంచి ఈ ఇద్దరు ఎక్కడ చూసినా కలిసే కనిపిస్తున్నారు. ఓపెన్‌గానే ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అయితే అంతా ఓపెన్‌గానే చేస్తూ ప్రేమ విషయాన్ని మాత్రం దాస్తున్నారు. దానిపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి ఎప్పుడు రివీల్‌ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వారు ప్రస్తుతం పెట్ క్లినిక్‌ వద్ద కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. సాధారణంగా మీడియాకు, ఫొటోగ్రాఫర్లకు దూరంగా ఉండే సిద్ధార్థ్(Siddharth).. వాళ్ల పెంపుడు జంతువుతో వేగంగా కారు ఎక్కాడు. ఇదిలా ఉంటే, అదితి(Aditi ) కెమెరాలకు పోజులిచ్చి నవ్వుతూ కనిపించింది.  

సిద్ధార్థ్ తన కొత్త చిత్రం ‘చిత్తా'(Chitta) యొక్క ముంబై ప్రీమియర్‌కి తన ప్రేయసి అదితి రావ్ హైదరీ(Aditi Rao Hydari)తో కలిసి వెళ్ళాడు. అలాగే ముంబైలో జూబిలీ(Jubilee) సిరీస్ ప్రీమియర్ వేయగా అదితి సిద్దార్థ్ తో కలిసి వచ్చింది. సిద్దార్థ్ వైట్ షర్ట్ లో, అదితి ఫుల్ బ్లాక్ లాంగ్ ఫ్రాక్ లో కలిసి వచ్చి సందడి చేశారు. మీడియాకు ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా ఇచ్చారు. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి ప్రైవేట్ గా పార్టీలకు, డిన్నర్స్ కి వెళ్తే మీడియాకి చిక్కడంతో అందరూ వీరు డేట్ లో ఉన్నారు అనుకున్నారు. ఈ సిరీస్ కి సిద్దార్థ్ కి సంబంధం లేకపోయినా అదితి కోసం వచ్చాడు. ఈ సారి ఇలా ఇద్దరూ కలిసి వచ్చి మీడియాకి ఫోజులు ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీంతో సిద్దార్థ్, అదితి నిజంగానే ప్రేమలో ఉన్నారని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు.

ఇక కెరీర్‌ పరంగా ఇద్దరూ బిజీగా ఉన్నారు. అదితి రావు హైదరీ ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఆమె ఇటీవల `తాజ్‌`(Taj) వెబ్‌ సిరీస్‌లో తో మెరిసింది. ఇది మంచి ఆదరణ పొందింది. దీంతోపాటు రీసెంట్‌గా `జుబిలీ`(Jubilee)తో మెప్పించింది. ఈ వెబ్‌ సిరీస్‌కి కూడా పాజిటివ్‌ టాక్‌ వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన “హీరమండి”(Hiramandi) అనే వెబ్ సిరీస్‌లో ఆమె కనిపించనుంది. ప్రఖ్యాత చిత్రనిర్మాత సంజయ్ లీలా బన్సాలీ(Sanjay Leela Bhansali) తన సాధారణ సినిమాలకు కాస్త భిన్నంగా ఓటీటీ కోసం కంటెంట్‌ను రూపొందించడం ఇదే మొదటిసారి. అదితి గతంలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అనేక ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. దీంతోపాటు `గాంధీ టాక్స్` అనే సినిమాలో నటిస్తుంది.

హీరో సిద్ధార్థ్‌ నటించిన లేటెస్ట్ మూవీ చిత్తా(Chitta). ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. సినిమాను రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంట‌ర్‌టైన‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇకపోతే ఈ చిత్రంలో నిమిషా సజయన్‌(Nimisha Sajayan), అంజలి నాయర్‌(Anjali Nair) తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో రిలీజ్ అయింది. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి ఎస్‌.యం అరుణ్‌ కుమార్‌ దర్శకుడిగా వ్యవహరించారు.  బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే ఓ ఎమోషనల్ డ్రామానే ఈ చిత్రం. అంతా సాఫీగా సాగే జీవితంలో త‌న కూతురు కిడ్నాప్​కు గురవ్వగా.. ఆమె కోసం సిద్ధార్థ్‌ చేసే పోరాటమే ఈ సినిమా కథ అని అర్థమవుతోంది. రీసెంట్​గా వచ్చిన టక్కర్ కూడా అంతగా ఆడలేదు. మరి ఈ చిత్రంతోనైనా సిద్ధార్థ్​ సక్సెస్ ట్రాక్ ఎక్కుతడో లేదో చూడాలి.