పార్టీ చేసుకున్న సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ

లవ్ బర్డ్స్ సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ మళ్లీ దొరికేశారు. ఈ వీకెండ్‌లో వారు ఫ్రెండ్స్‌ తో గడిపారు. సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, దీనిని వీరు ఖండించలేదు. అయినా అప్పుడప్పుడు వీరిద్దరూ పలు పార్టీలు, ఫంక్షన్లు, వెకషన్లలో మీడియా  కంటపడుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ జంట మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ‘హోమిస్‌ అండ్‌ […]

Share:

లవ్ బర్డ్స్ సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ మళ్లీ దొరికేశారు. ఈ వీకెండ్‌లో వారు ఫ్రెండ్స్‌ తో గడిపారు. సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, దీనిని వీరు ఖండించలేదు. అయినా అప్పుడప్పుడు వీరిద్దరూ పలు పార్టీలు, ఫంక్షన్లు, వెకషన్లలో మీడియా  కంటపడుతూనే ఉన్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ జంట మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ‘హోమిస్‌ అండ్‌ సండే నైట్‌ రేజ్‌’ అనే కాప్షన్‌ పెట్టి కామన్ ఫ్రెండ్స్ తో ఉన్న సెల్ఫీ ఫొటోను అభిమానులతో అదితి పంచుకుంది. ఇందులో ఈ జంట సూపర్‌‌ క్యూట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

తెలుగులో అజయ్ భూపాతి డైరెక్టర్‌‌ చేసిన సముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ టాక్‌. ఆ మూవీ సరిగ్గా ఆడకపోయినా వీరి రిలేషన్‌ బాగా బలపడింది. అప్పటి నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇద్దరూ కలిసి పలు ఈవెంట్లు, ఫంక్షన్లలో కనిపించారు. తరుచూ కలిసి ఉన్న ఫొటోలను కూడా  సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇటీవల మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ ఏఆర్ రహమాన్‌ కుమార్తె రిసెప్షన్‌, చెన్నైలో మణిరత్నం పీఎస్‌1 సినిమా ఈవెంట్‌, శర్వానంద్‌ నిశ్చితార్థం తదితర ఈవెంట్లకు వీరు కలిసే హాజరయ్యారు. దీంతో త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్స్‌ గట్టిగా వినిపించాయి. తాజాగా ఈ జంట సోషల్‌ మీడియాలోనూ సందడి చేస్తున్నారు. కలిసి రీల్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ ఫిబ్రవరిలో సిద్దార్థ్‌, అదితి కలిసి తుమ్‌ తుమ్‌ సాంగ్‌లో తమ ఫర్మామెన్స్‌తో నెట్టింట హాల్‌ చల్‌ చేశారు.  

ఇప్పటివరకు వీరి రిలేషన్‌ గురించి ఇటు అదితి రావు గానీ, అటు సిద్ధార్థ్‌ గానీ ఓపెన్‌గా చెప్పలేదు. తాజాగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అదితి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పర్సనల్‌ విషయాల గురించి మాట్లాడొద్దని కాస్త గట్టిగానే చెప్పింది. నా పర్సనల్‌ విషయాలు పక్కనబెట్టి, సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, వాటి మీదే తన ఫోకస్‌ అని చెప్పింది. మంచి హిరోయిన్‌గా గుర్తింపు పొందే వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చిది. దయచేసి, పర్సనల్‌ విషయాలను పట్టించుకోకపోవడ మంచిదని పేర్కొంది. 

కాగా, ఇంకో ఇంటర్య్వూలో కూడా సిద్ధార్థ్‌తో డేటింగ్‌ రిలేషన్స్‌ గురించి ఆమెకు ప్రశ్న ఎదురవ్వగా, ఈసారి సిగ్గు పడుతూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది. సిద్ధార్థ్‌ తాను మంచి ఫ్రెండ్స్‌ అంటూనే సిగ్గుపడుతూ పెదాలను జిప్‌ వేస్తున్నట్లు సంజ్ఞ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ విషయం గురించి తాను ఎక్కువ మాట్లాడదలుచుకోవడం లేదని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వారి ప్రేమపై క్లారిటీ కూడా ఇచ్చినట్లు అర్థమవుతుంది. కానీ, కన్మర్ఫ్‌ చేయలేదు. 

కాగా, అదితిరావు హైదరీ ఇటీవల తన ప్రాజెక్టు తాజ్‌: బ్లడ్‌ అడ్‌ జూబ్లీ, సంజయ్‌ లీలా బన్సాలీ డైరెక్ట్ చేసిన వెబ్‌ సీరిస్‌ హీరామాడిలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు సిద్ధార్థ్‌.. ఇటీవల టక్కర్‌‌ సినిమాతో ముందుకొచ్చాడు. అలాగే, శంకర్‌‌ డైరెక్ట్‌ చేస్తున్న ఇండియన్‌ 2 సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు.