పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సీనియర్ నటి శోభన

ఈ మ‌ధ్య‌కాలంలో న‌టీనటుల ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాల కేసులు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని నెల‌ల క్రితం సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఇంట్లో దాదాపు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేసే న‌గలు పోయిన‌ట్లు ఆమె చెన్నైలోని ఓ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా.. ఇంట్లో ప‌నిచేసే ఓ వ్య‌క్తిపై ఐశ్వ‌ర్య అనుమానం వ్య‌క్తం చేసారు. దాంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా తానే డ‌బ్బుకి క‌క్కుర్తిప‌డి న‌గ‌లు కాజేసిన‌ట్లు ఒప్పుకున్నారు. తాజాగాసీనియర్‌‌ […]

Share:

ఈ మ‌ధ్య‌కాలంలో న‌టీనటుల ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాల కేసులు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని నెల‌ల క్రితం సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ఇంట్లో దాదాపు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు విలువ చేసే న‌గలు పోయిన‌ట్లు ఆమె చెన్నైలోని ఓ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా.. ఇంట్లో ప‌నిచేసే ఓ వ్య‌క్తిపై ఐశ్వ‌ర్య అనుమానం వ్య‌క్తం చేసారు. దాంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించ‌గా తానే డ‌బ్బుకి క‌క్కుర్తిప‌డి న‌గ‌లు కాజేసిన‌ట్లు ఒప్పుకున్నారు.

తాజాగాసీనియర్‌‌ నటి శోభన (Actress Shobana) ఇంట్లో చోరీ జరిగింది. తమిళనాడు చెన్నైలోని తేనాంపేట ఏరియాలో శ్రీమాన్‌ శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి శోభన నివాసం ఉంటుంది. ఇంట్లో పనితో పాటు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని చూసుకోవడానికి విజయ అనే పని మనిషి కొన్నేండ్ల క్రితం శోభన ఇంట్లో చేరింది. 

అయితే, గత కొద్ది కాలంగా ఇంట్లో డబ్బులు మాయం అవుతుండటాన్ని శోభన గమనించింది.దీంతో తేనాంపేట పోలీస్‌ స్టేషన్‌ (police station) లో ఆమె ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. పని మనిషి విజయను అదుపులోకి తీసుకొని విచారించగా, తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. మొత్తం రూ.41 వేలు చోరీ చేసినట్లు చెప్పింది. దొంగిలించిన డబ్బును డ్రైవర్‌‌ సాయంతో తన కూతురి అకౌంట్‌కి పంపించినట్లు వెల్లడించింది. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండి ఈ పని చేశానని చెప్పింది. చేసిన పనికి తాను గిల్టీగా ఫీల్‌ అవుతున్నానని పేర్కొంది. దీంతో పని మనిషి విజయ పరిస్థితిని అర్థం చేసుకున్న శోభన (Actress Shobana) ఆమెపై పెట్టిన కేసును వెనక్కి తీసుకొని, మంచి మనసు చాటుకుంది. అంతేకాకుండా నీ ఉద్యోగం నీకు ఉంటుందని, మళ్లీ వచ్చి పనిలో చేరాలని పని మనిషికి చెప్పింది. 

తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని, ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని శోభన పోలీసులను కోరారు. దొంగిలించిన డబ్బును ప్రతి నెలా ఆమె జీతంలో నుంచి రికవరీ చేస్తానని పోలీసులకు చెప్పింది. ఆమెను తిరిగి పనిలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. శోభన హిరోయిన్‌ మాత్రమే కాదు, ఆమె క్లాసిక్‌  డ్యాన్సర్‌‌ (Classic dancer) కూడా.

చెన్నైలో ఆమె ఇంట్లోనే డ్యాన్స్‌ స్కూల్‌ నడుపుతుంది. ఇప్పటికే పలు స్టేజీ షోలు కూడా ఆమె ఇచ్చింది. అలాగే, తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. బాలచంద్ర మీనన్‌ దర్శకత్వంలో మలయాళంలో హిరోయిన్‌గా మొదటి సినిమాలో నటించింది. మల్లు వెట్టి మైనర్‌‌, పొన్మన సెల్వన్‌, ఎన్‌ కిట్టా మోతతే (1988), శివ (1989), ఇన్నాలే (1990), కలికాలం (1990), తలపతి (1991), పాపాయుడే సొంతం అప్పూస్‌ వంటి చిత్రాలకు శోభనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవిడుతే పోలే ఇదియుం నుంచి ఉపహారం వరకు 1985లో ఒకే ఏడాది 16 సినిమాల్లో నటించింది శోభన.అంతేకాకుండా ఆమె జాతీయ అవార్డు(National award), పద్మ భూభూషణ్‌ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు(awards) కూడా అందుకున్నారు.