సురక్షితంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న నటి

నటి నుష్రత్ భరుచ్చా, హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయిల్ వెళ్లి ఆకస్మిక యుద్ధ వాతావరణంలో చిక్కుకున్నట్లు అయింది. ఏది ఏమైనప్పటికీ నటి సురక్షితంగా తిరిగి ముంబై చేరుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.  భారత్ చేరుకున్న నటి నుష్రత్ భరుచ్చా:  నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో అనుకోకుండా యుద్ధ వాతావరణంలో చిక్కుకున్నప్పటికీ చివరకు అక్టోబర్ 8న ముంబైకి చేరుకున్నారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన నటి. నిజానికి అక్టోబర్ 7 నుంచి నటి తన టీమ్ మెంబర్స్ […]

Share:

నటి నుష్రత్ భరుచ్చా, హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయిల్ వెళ్లి ఆకస్మిక యుద్ధ వాతావరణంలో చిక్కుకున్నట్లు అయింది. ఏది ఏమైనప్పటికీ నటి సురక్షితంగా తిరిగి ముంబై చేరుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

భారత్ చేరుకున్న నటి నుష్రత్ భరుచ్చా: 

నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌లో అనుకోకుండా యుద్ధ వాతావరణంలో చిక్కుకున్నప్పటికీ చివరకు అక్టోబర్ 8న ముంబైకి చేరుకున్నారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన నటి. నిజానికి అక్టోబర్ 7 నుంచి నటి తన టీమ్ మెంబర్స్ తో కనెక్షన్ కోల్పోయినట్లు తెలుస్తోంది. అందరూ ఆందోళన చెందుతున్న వేళ అక్టోబర్ 8 తెల్లవారుజామున, నుష్రత్ విజయవంతంగా కనెక్టింగ్ ఫ్లైట్‌లో ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి తిరిగి చేరుకుంది. ఆమె ముంబై చేరుకున్న అనంతరం మీడియా వాళ్లతో మాట్లాడేందుకు నిరాకరించినట్లు సమాచారం. 

ఇజ్రాయెల్ – పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య వివాదం చెలరేగిన సమయానికి, నటి నుష్రత్ తన ‘అకెల్లి’ చిత్రం కోసం హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ‘ఫౌడా’ ఫేమ్‌ ఇజ్రాయెలీ యాక్టర్ సాహి హలేవితో నుష్రత్ కలిసి నటించారు. యాదృచ్ఛికంగా, ఆమె నటించిన సినిమా నిజానికి మిడిలిస్ట్ ప్రాంతంలో యుద్ధ భూమిలో చిక్కుకున్న ఒక అమ్మాయి కథ. ఆ అమ్మాయి జీవితంలో ఎలా పోరాడి బయటపడింది అనేది స్టోరీ. కానీ ఇప్పుడు కూడా ఆ సినిమాలో నటించిన నటి యుద్ధభూమిలో చిక్కుకుని విజయవంతంగా తిరిగి తన స్వదేశానికి చేరుకోవడం విశేషం.

ఇజ్రాయిల్- హమ్మస్ యుద్ధభేరి: 

ప్రపంచంలో ఏ మూల చూసిన సరే హింస చాయలు కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకపక్క ఇప్పటికే రష్యా యుక్రెన్ దేశాల మధ్య ఎన్నో నెలలుగా హోరాహోరీగా సాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ మరొక యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్ దేశం మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డ హమ్మస్, తన బాంబులతో దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉంటున్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని కోరింది.

దశాబ్దాలుగా జరుగుతున్న సంఘర్షణ రక్తపాతంగా మారుతుంది.. కారణంగా హమాస్ భారీ రాకెట్లతో దాడిని చేపట్టింది, నివేదికలు అందిస్తున్న సమాచారం ప్రకారం, 600 మంది ఇజ్రాయెల్‌ వాసులు చనిపోగా సుమారు, 1,000 మందికి పైగా గాయపడ్డాయని పేర్కొంది. తీరప్రాంత ఎన్‌క్లేవ్‌పై తీవ్రమైన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కారణంగా, పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 413కి పెరిగినట్లు తెలుస్తోంది, వేలాది మంది గాయపడ్డారని గాజా అధికారులు తెలిపారు. 

లెబనాన్, ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో, ఇజ్రాయెల్ స్థానాలపై పెద్ద సంఖ్యలో ఫిరంగిల్లు, గైడెడ్ క్షిపణుల ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. హమాస్ ప్రారంభించిన దాడికి సంఘీభావంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌కు దాడి జరిగిన రోజు “బ్లాక్ డే” అని చెప్పి, దానికి ప్రతీకారం తీర్చుకుంటానని, బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశాడు. హమాస్ సామర్థ్యాలను నాశనం చేయడానికి IDF (సైన్యం) తన శక్తినంతా ఉపయోగించబోతోందని.. వారిని తీవ్రంగా తిప్పికొట్టి, వారు ఇజ్రాయెల్ ప్రజలపై తెచ్చిన ఇటువంటి బాధాకరమైన చీకటి రోజుకు ప్రతిగా.. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని అతను చెప్పాడు. ఆకస్మిక దాడి తరువాత దాని రహస్య స్థావరాలను “శిధిలాలు”గా మారుస్తానని ప్రతిజ్ఞ చేసిన అనంతరం.. గాజాలోని హమాస్ సైట్ల సమీపంలో నివసిస్తున్న పాలస్తీనియన్లను విడిచిపెట్టమని, బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించాడు.