ఉప్పెన మూవీకి జాతీయ అవార్డు.. ఆనందంగా ఉంది..!

కృతి శెట్టి, ఈ పేరు వింటే వెంటనే ఆమె గుర్తుకురాకపోవచ్చు గానీ, బేబమ్మ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టొచ్చు. అంతలా ఫేమస్‌ అయ్యింది ఆ పేరు. తను యాక్ట్‌ చేసిన మొదటి సినిమానే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది కృతి శెట్టి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి  కలిసి నటించిన రొమాంటిక్‌ డ్రామా ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ […]

Share:

కృతి శెట్టి, ఈ పేరు వింటే వెంటనే ఆమె గుర్తుకురాకపోవచ్చు గానీ, బేబమ్మ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టొచ్చు. అంతలా ఫేమస్‌ అయ్యింది ఆ పేరు. తను యాక్ట్‌ చేసిన మొదటి సినిమానే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయింది కృతి శెట్టి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి  కలిసి నటించిన రొమాంటిక్‌ డ్రామా ‘ఉప్పెన’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో కృతి నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటించిన మొదటి సినిమాకే తన పేరు మారుమోగింది. చాలా మందికి డ్రీమ్‌ గర్ల్‌ గా కృతి మారింది. ఇప్పుడు తను యాక్ట్‌ చేసిన ఉప్పెన మూవీకి జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. 69వ నేషనల్‌ ఫిల్మ్ అవార్డులో  బెస్ట్ తెలుగు సినిమాగా ఉప్పెన ఎంపికైంది. తాను నటించిన మొదటి సినిమాకే జాతీయ అవార్డు రావడం పట్ల కృతి ఫుల్‌ హ్యాపీగా ఫీల్‌ అయింది. 

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆమె కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పింది. అలాగే, అందరికీ తాను కృతజ్ఞురాలినని పేర్కొంది. 2021లో రిలీజ్‌ అయిన ఉప్పెన మూవీతో కృతిశెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో సంగీత (బేబమ్మ)  పాత్రలో అలరించింది. 

అవార్డు రావడం ఆశీర్వాదంగా భావిస్తాను

జాతీయ అవార్డు గెలుచుకోవడంపై కృతి శెట్టిని మీడియా పలకరించగా, ‘‘ఉప్పెన మూవీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో తనను ఆదరించిన, ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమలో ఎత్తు పల్లాలు, ఆశీర్వాదాలు, పాఠాలు, వెనక్కి వెళ్లిపోవడం, ముందుకు రావడం, ప్రేమ, ద్వేషం.. అన్నీ చిత్ర పరిశ్రమలో ఉంటాయి. ఇవన్నీ తట్టుకున్నాను కాబట్టే నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. నేను నటించిన మొదటి సినిమాకు జాతీయ అవార్డు రావడం నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. ఉప్పెన టీమ్‌కు అభినందనలు” అని కృతి పేర్కొంది. 

కొత్త నటులు వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు సనా డైరెక్టర్‌‌లో ఉప్పెన సినిమా 2002లో తెరకెక్కింది. ఆశీర్వాదం (ఆసి) అనే దళిత క్రైస్తవ యువకుడి పాత్రలో వైష్ణవ్‌ తేజ్‌ నటించాడు. గొప్పింటి అమ్మాయి పాత్రలో బేబమ్మగా కృతి నటించింది. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథ చుట్టూ సినిమా తిరుగుతుంది. బేబమ్మ తండ్రిగా రాయణం అనే పవర్‌‌ఫుల్‌ పాత్రలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి యాక్ట్ చేశాడు. 

ఇంకా ఈ మూవీలో సాయి చంద్‌, మామిళ్ల జైలజ ప్రియ, గాయత్రీ జయరామన్, మహదేవన్‌, రాజీవ్‌ కనకాల, కంచరపాలెం రాజు, రవివర్శ, నాగ మహేశ్, జైకృష్ణ, రాజశేఖర్ అనింగి, ఇతరులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు సుకుమార్ హోమ్‌ బ్యానర్‌‌ సుకుమార్‌‌ రైటింగ్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తగా నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ  ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

వరుస ఆఫర్లు..

ఉప్పెన మూవీ సక్సెస్‌ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కృతి శెట్టికి ఆఫర్లు వరుస కట్టాయి. నాటి నటించిన శ్యామ్‌ సింగరాయ్‌, నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు, రామ్‌తో వారియర్‌‌, నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం, సుధీర్‌‌ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగ చైతన్యతో కస్టడీ సినిమాలో నటించింది. అయితే, ఈ సినిమాలు ఏవీ కృతి శెట్టికి పేరు సంపాదించలేదు. ఇందులో  చాలా మూవీస్‌ మిశ్రమ స్పందనకే పరిమితం అయ్యాయి. ఏ సినిమా కూడా ఉప్పెన అంతా సక్సెస్‌ అవ్వలేకపోయింది.