ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ న‌టుడికి ఈడీ స‌మ‌న్లు

బెట్టింగ్ యాప్ మహాదేవ్ మనీ ల్యాండరింగ్ కుంభకోణం సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్‌ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ బుధవారం నాడు […]

Share:

బెట్టింగ్ యాప్ మహాదేవ్ మనీ ల్యాండరింగ్ కుంభకోణం సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుండగా.. విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్‌ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కు ఈడీ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. మహాదేవ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌కు రణ్‌బీర్‌ ప్రచారకర్తగా వ్యవహరించాడు. తాజాగా అతడికి నోటీసులు జారీ చేసిన ఈడీ అక్టోబర్‌ 6న విచారణకు రావాలని ఆదేశించింది. రణబీర్ కపూర్‌తో పాటు సన్నీ లియోన్, పాకిస్థానీ గాయకుడు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, బాలీవుడ్ గాయని నేహా కక్కర్, సంగీత స్వరకర్త విశాల్ దద్లానీ పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా.. మహాదేవ్  బెట్టింగ్‌ యాప్‌ మాటున జరుగుతున్న భారీ కుంభకోణాన్ని ఇటీవల ఈడీ బయటపెట్టింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సౌరభ్‌ చంద్రఖర్‌, రవి ఉప్పల్‌ యూఏఈలోని దుబాయ్‌ కేంద్రంగా దేశంలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, వీరు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ బెట్టింగ్‌ యాప్‌ పెద్ద ఎత్తున యాడ్స్​ కోసం ఖర్చు చేసినట్లూ ఈడీ పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన దేశవ్యాప్తంగా కోల్‌కతా, భోపాల్, ముంబై వంటి నగరాల్లో 39 ప్రాంతాల్లో ఈడీ సోదాలను నిర్వహించి, రూ.417 కోట్ల నగదుతో పాలు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరిగిన సౌరభ్ చంద్రకర్ వివాహ వేడుకకు పలువురు బాలీవుడ్ నటులు , గాయకులు హాజరైన విషయం బయటపడింది.  మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల్లో ఒకరి పెళ్లికి వీరు హాజరవ్వడమే అందుకు కారణం. ఈ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రఖర్‌ వివాహం 2023 ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, సన్నీ లియోనీ, నేహా కక్కర్‌, అతిఫ్‌ అస్లమ్‌, రహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్‌, అలీ అస్గర్‌, విశాల్‌ దద్లానీ తదితరులు హాజరయ్యారు. వీరి కోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆ వేడుకకు హాజరైన సినీతారలపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రణ్‌బీర్‌ కపూర్‌కు తాజాగా సమన్లు జారీ చేసింది. కాగా.. మరో 17 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలపై ఈడీ నిఘా పెట్టినట్లు సమాచారం. త్వరలోనే వారికి కూడా సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు రణ్ బీర్ వరుస సినిమాలతో బిజీగా ఉననాడు. రణ్‌బీర్ కపూర్ యానిమల్‌లో గ్యాంగ్‌స్టర్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇందులో రష్మిక మందన్న, అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కూడా నటిస్తున్నారు. తు ఝూటీ మై మక్కర్ తర్వాత రణబీర్ నటిస్తున్న సినిమా యానిమల్. కబీర్ సింగ్ తర్వాత సందీప్ రెడ్డి వంగా యొక్క రెండవ బాలీవుడ్ చిత్రం. ఈ చిత్రం టీజర్‌కు ఇంటర్నెట్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే వారంలోపే 34 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.