ఆదిపురుష్ కోసం ల‌వి ప‌జ్ని ఏం చేసాడో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ ఇతిహాస రామాయణ గాధ ఆధారంగా ఆది పురుష్ సినిమాను తెరకెక్కించారు. సుమారుగా రూ .500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా రాముడి పాత్రలో నటించగా.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ […]

Share:

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ ఇతిహాస రామాయణ గాధ ఆధారంగా ఆది పురుష్ సినిమాను తెరకెక్కించారు. సుమారుగా రూ .500 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా రాముడి పాత్రలో నటించగా.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా సీత పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్ల పరంగా మొదటి రోజే  రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఆ తరువాత రోజుల్లో పూర్తిగా డిజాస్టర్ గా మిగిలిందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించగా దేవదత్త నాగే తోపాటు పలువురు నటీనటులు ఈ సినిమాలో నటించి సినిమాని మరింత విజయవంతం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. త్రీడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో పాత్రలు బొమ్మలను పోలి ఉన్నాయని.. పైగా రామాయణంలోని పాత్రలను కించపరచుతూ సినిమాని తీశారు అని డైరెక్టర్ ఓం రౌత్ పై కూడా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మొత్తానికైతే భారీ బడ్జెట్ తో తెరెకెక్కించిన ఈ సినిమాను ఇలా డిజాస్టర్ గా మార్చడం ఒకరకంగా బాధాకరమని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరొక విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది.

అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో నటుడు లవి పజ్ని నటించిన విషయం తెలిసిందే. దాదాపు 6 నెలల పాటు భుజించి మరో ఆరు నెలల పాటు నిద్రపోయే కుంభకర్ణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు లవి పజ్ని నటించిన విషయం తెలిసిందే. పంజాబ్ లోని పాటియాలకు చెందినవారు ఇతను.. 6’10″ఎత్తు..140  కిలోల బరువుతో భారీ పరిమాణంతో చూడడానికి విభిన్నంగా కనిపించాడు. ముఖ్యంగా రాక్షసుడిగా చిత్రీకరించబడిన కుంభకర్ణుడి పాత్రను పోషించడానికి ఇతడిని ఎంపిక చేయడానికి కారణం ఇదే అని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాలో కుంభకర్ణుడి పాత్రలో మరింత దృఢంగా , భలశాలిగా కనిపించడానికి లవి పజ్ని ఏం చేశారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అతను ఈ పాత్రలో మెప్పించడానికి ప్రతిరోజు 20 చపాతీలు, 25 గుడ్లు ,ఒక కేజీ చికెన్ తినేవాడట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలాగే ప్రతిరోజు 1.5 లీటర్ల పాలు కూడా తాగే వాడినని వివరించారు. ఇకపోతే ఆది పురుష్  లో తన పాత్ర కోసం ఇదే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకునే వాడినని తెలిపారు. మరొకవైపు లవి పజ్ని బాహుబలి 2 : ది కంక్లూజన్ లో కూడా నటించారు.  కాలకేయ వంశానికి చెందిన ఘోరమైన నాయకుడిగా నటించిన విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇకపోతే ఆది పురుష్ చుట్టూ ఉన్న వివాదానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. సనాతన హిందూ అయిన నేను కూడా దేశంలోని ఇతర వ్యక్తుల లాగే ఆది పురుష్ డైలాగులకు మనస్థాపం చెందాను అని వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమాపై నెగటివ్ గా స్పందించిన ఏకైక ఆది పురుష్ టీమ్ నెంబర్ కూడా ఇతడే కావడం గమనార్హం.