BiggBoss: బిగ్ బాస్ లో ఆటగాళ్లు పోటుగాళ్లు క్యాప్టెన్సీ రేస్

బిగ్ బాస్ సీజన్ 7 (bigg boss) రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో, మరిన్ని తెలుసుకుందాం.. (bigg boss season 7) కేవలం 15 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ మొదటి రోజున సందడి చేశారు. అయితే మొదటి ఎలిమినేషన్ లో, కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా, తర్వాత […]

Share:

బిగ్ బాస్ సీజన్ 7 (bigg boss) రిలీజ్ అయిన అనంతరం ప్రతి ఒకరు షాక్ కి గురయ్యారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బిగ్ బాస్ సీజన్ 7 లో అంతా ఉల్టా పల్టాగా జరుగుతుంది. ఎంతమంది ఎలిమినేట్ అయ్యారో, మరిన్ని తెలుసుకుందాం.. (bigg boss season 7)

కేవలం 15 మంది కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ మొదటి రోజున సందడి చేశారు. అయితే మొదటి ఎలిమినేషన్ లో, కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా, తర్వాత వారాల్లో, షకీలా, దామిని, రతిక, శుభశ్రీ, గౌతమ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆ తర్వాత మళ్లీ గౌతమ్ సీక్రెట్ రూమ్ కి పంపించగా మళ్లీ తిరిగి వచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన టీమ్ మెంబర్స్ లోకి గౌతం మెంబర్గా ఆడ్ అయ్యాడు. అయితే ప్రశాంత్ మొదటి కెప్టెన్ అయినప్పటికీ, బిగ్ బాస్ ఆదేశం మేరకు, మిగిలిన కంటెస్టెంట్స్ అభిప్రాయాలు మేరకు, కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు.

ఆటగాల్లు-పోటుగాల్లు టాస్క్‌లు: 

ఆటగాల్లు, పోటుగాల్లు అనే రెండు జట్లుగా ఇంట్లో వాళ్లని విపంచించారు విభజించారు. మునుపటిది పాత హౌస్‌మేట్‌లను ఆటగాల్లు మరియు కొత్త వారిని పోటుగాల్లు అని పేర్లు పెట్టారు. టీమ్ ఆటగాల్లు అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, శివాజీ, ప్రియాంక, శోభ, సందీప్, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఈ సీజన్‌లోని ఐదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంబటి అర్జున్, అశ్విని, బోలే షావలి, పూజా మూర్తి మరియు నాయని పావని టీమ్ పోటుగాల్లు. రెండు టీమ్స్ కి చాలా టాస్క్ పెట్టారు. 

హూ ఇస్ జీనియస్: 

ఈ పోటీలో ఇరువైపుల నుంచి ఒక్కొకరు పోటీ చేయాల్సి వచ్చింది. అయితే టీవీ స్క్రీన్ మీద చూపించిన కొన్ని పిక్చర్స్ ప్రకారం ప్రశ్నలు అడగడం జరిగింది బిగ్ బాస్. అయితే ఈ ఆటలో పాల్గొన్న వారు గౌతమ్ మరియు అమర్దీప్. అన్ని ప్రశ్నలు చెప్పి గౌతమ్ టీం విజయం సాధించింది. 

హూ ఇస్ ఫిట్టెస్ట్: 

ఈ రెండో ఛాలెంజ్ లో భాగంగా గ్రూపులుగా విడిపోయిన ఆటగాళ్లు, పోటుగాళ్లు టీమ్స్ లో నుంచి ఇద్దరు ఇద్దరుగా పాల్గొంటారు. ఇద్దరు టీమ్స్ నుంచి వచ్చిన ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో ఉండి కొన్ని నెంబర్స్ కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసిన నెంబర్స్ తాలూకా టైర్లను కలెక్ట్ చేయాలి మరొక హౌస్ మెంట్. అయితే ఇందులో చాలా బాగా ఆడిన తర్వాత గౌతమ్ మరియు అర్జునులు పోటుగాళ్లు టీం తరఫున ఆడి, పోటుగాళ్ల టీంని గెలిపించారు. 

హూ ఇస్ ఫాస్టెస్ట్: 

ఈ మూడో టాస్క్ లో భాగంగా ‘కలర్ కలర్ వాట్ కలర్ డు యు వాంట్’ అంటూ టీమ్ మెంబర్స్ అడగగానే, బిగ్ బాస్ ఒక కలర్ చెప్పిన వెంటనే ఆటగాళ్లు టీం నుంచి ఒకరు, పోటుగాళ్ల టీమ్ నుంచి మరొకరు వెళ్లి కలర్  వస్తువు తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఇందులో చాలా బాగా ఆడి త్వర త్వరగా బిగ్ బాస్ ఎంచుకున్న కలర్ వస్తువులను తీసుకువచ్చి ఆటగాళ్ల టీం విజయం సాధించింది. 

హూ ఇస్ స్ట్రాంగెస్ట్: 

ఈ టాస్క్ లో భాగంగా మీరు టీంలలో నుంచి ఒకరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు రాకెట్లను పట్టుకుని ఎవరైతే ఎక్కువ సేపు నిలబడతారో వాళ్లే గెలిచినట్టు, అయితే ఈ టాస్క్ లో భాగంగా ఆటగాళ్ల టీం నుంచి యావర్, పోటుగాళ్ల టీం నుంచి అర్జున్ వచ్చి తమ సత్తాను చూపించారు. కానీ రాకెట్లను చివరి వరకు సమర్థవంతంగా పట్టుకుని అర్జున్, తమ పోటుగాళ్ల టీంని గెలిపించాడు.