లాల్ సింగ్ చద్దా వైఫల్యాన్ని అంగీకరించిన అమిర్ ఖాన్

అమీర్ ఖాన్ బాలీవుడ్‌లో ప్రసిద్ధ నటుడు. విఫలమైన చిత్రాల గురించి బహిరంగంగా మాట్లాడే అతికొద్ది మంది సెలబ్రిటీలలో అమీర్ ఖాన్ ఒకరు. అదే విధంగా తన సినిమాలు తాను ఆశించిన స్థాయిలో ఆడలేదు అనే వాస్తవం గురించి ఓపెన్‌గా చెప్తాడు. ఇటీవలి అతడు నటించిన ఒక వాణిజ్య ప్రకటనలో..  తన సినిమా గురించిన జోకులని అంగీకరించడం మనం గమనించవచ్చు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినా.. కానీ అతను ఇప్పటికీ ఆవిషయంలో ఆనందిస్తున్నట్లు మనం చూడవచ్చు.  అమీర్ […]

Share:

అమీర్ ఖాన్ బాలీవుడ్‌లో ప్రసిద్ధ నటుడు. విఫలమైన చిత్రాల గురించి బహిరంగంగా మాట్లాడే అతికొద్ది మంది సెలబ్రిటీలలో అమీర్ ఖాన్ ఒకరు. అదే విధంగా తన సినిమాలు తాను ఆశించిన స్థాయిలో ఆడలేదు అనే వాస్తవం గురించి ఓపెన్‌గా చెప్తాడు. ఇటీవలి అతడు నటించిన ఒక వాణిజ్య ప్రకటనలో..  తన సినిమా గురించిన జోకులని అంగీకరించడం మనం గమనించవచ్చు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినా.. కానీ అతను ఇప్పటికీ ఆవిషయంలో ఆనందిస్తున్నట్లు మనం చూడవచ్చు. 

అమీర్ ఖాన్ ప్రస్తుతం తన డ్రీమ్11 ప్రకటనలతో IPL కమర్షియల్ బ్రేక్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇక ఓ ప్రకటనలో అతను తన చిత్రం లాల్ సింగ్ చద్దా సినిమాపై వేసిన జోకులతో తనపై తాను జబ్బలు చరుచుకోవడం చూడవచ్చు ఫాంటసీ స్పోర్ట్స్ వెబ్‌సైట్ కోసం కొత్త వాణిజ్య ప్రకటనలో అమీర్ మరియు క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా కనిపించారు. తన సినిమా పరాజయాన్ని ఎగతాళి చేసినా కూడా..  అమీర్ దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవడంతో.. అతని ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా.. గత సంవత్సరం అతను నటించిన లాల్ సింగ్ చద్దా..  బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది

ఈ  ప్రకటనలో.. అమీర్ బుమ్రాతో “బూమ్ బూమ్, బాల్ ధ్యాన్ సే దాలియో, బడే బడే హిట్ మార్తా హూన్ (బుమ్రా, బాల్ జాగ్రత్తగా, నేను పెద్ద పెద్ద హిట్స్ కొడతాను)” అని అంటాడు. దీనికి బుమ్రా ఇలా బదులిస్తూ.., “ఇత్నే హిట్స్ మార్తే హో సర్, తో లాల్ సింగ్ కా క్యా హువా (మీరు ఇంత పెద్ద హిట్స్ కొడితే, లాల్ సింగ్ చద్దాకు ఏమైంది) మరి?” అంటాడు. దీంతో అమీర్ అతడిని చూసి మైదానంలో తనని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని అంటాడు.

చాలా మంది ఈ యాడ్ స్క్రిప్ట్‌ను ప్రశంసిస్తున్నారు. అమీర్ ఖాన్ తన వైఫల్యాన్ని అంగీకరించినందుకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇది యాడ్ స్క్రిప్ట్ అయినప్పటికీ.. అమీర్ ఖాన్ కూడా లాల్ సింగ్‌ను ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అతను తన వైఫల్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక కొందరు అమీర్‌ను సమర్థిస్తుంటే.. మరి కొందరు మాత్రం దీనికి అవునని చెప్పడానికి అమీర్ నోరు మెదపక తప్పలేదని అంటున్నారు. అయితే అతని అభిమానులు మాత్రం.. అతను వద్దనుకుంటే.. ఆ లైన్‌ను కట్ చేసే సత్తా ఆయనకు ఉందని అంటున్నారు. ఇక ఏదేమైనా తన వైఫల్యాన్ని ఇంగీకరించడం మాత్రం గొప్ప విషయం అని చెప్పవచ్చు.

మరో యాడ్‌లో రోహిత్ శర్మ అమీర్ ఖాన్‌‌తో ఇలా అన్నాడు, “లగాన్ మే క్రికెట్ ఖేల్ కే కోయి క్రికెటర్ నహీ బన్ జాతా (లగాన్‌లో క్రికెట్ ఆడినంత మాత్రానా మీరు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారరు)” అని అన్నారు. ఇది అమీర్ ఖాన్ 2001 నటించిన లగాన్ చిత్రం. అయితే అతను బ్రిటిష్ వారితో అప్పుల సమస్యలను పరిష్కరించడానికి క్రికెట్ ఆడాడు. అందుకే రోహిత్ ఇలా అన్నాడు. ఇక లాల్ సింగ్ చద్దా వైఫల్యంపై రోహిత్ శర్మ కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు. అమీర్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక హిట్ సినిమాని అందిస్తాడని పేర్కొన్నాడు. అమీర్ నటించిన ఈ యాడ్స్‌లో అతని అభిమానులు, విమర్శకులు తెగ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అందులో ఒకరు ఇలా వ్రాశారు, “అమీర్ ది లెజెండ్! చాలా చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రకటన చూశాను అని రాశాడు.