అచ్చం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా ఉన్నాడే..!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఆయన బాలీవుడ్ లో చేసిన హంగామా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు ఫాన్స్. ఏదో ఒక సందర్భంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోను గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు అభిమానులు. ఇదే క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమాని ఒకరు తనదైన శైలిలో సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ని గుర్తుచేసే పనిలో పడ్డాడు. కొంతమంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ని గుర్తు చేసినందుకు అభినందిస్తుండగా, మరికొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లైక్ ల […]

Share:

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఆయన బాలీవుడ్ లో చేసిన హంగామా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు ఫాన్స్. ఏదో ఒక సందర్భంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోను గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు అభిమానులు. ఇదే క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమాని ఒకరు తనదైన శైలిలో సుశాంత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ని గుర్తుచేసే పనిలో పడ్డాడు. కొంతమంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ని గుర్తు చేసినందుకు అభినందిస్తుండగా, మరికొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లైక్ ల కోసం, ఆ యూసర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫేస్ ఉపయోగించుకుంటున్నందుకు ఫైర్ అవుతున్నారు. 

అసలు విషయం: 

ప్రస్తుతం వచ్చిన టెక్నాలజీ తో ఎవరైనా ఒక సెలబ్రిటీగా మారిపోతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కనిపించేది, ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితులు కూడా వచ్చేసాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొందరు ఉద్యోగాలు పోగొట్టుకుంటే, మరికొందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని చాలా బాగా సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫేస్ యూస్ చేసుకొని ఒక అభిమాని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసిన వీడియో అచ్చం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మళ్ళీ తిరిగి వచ్చాడా అన్నట్టు కనిపిస్తుంది. ఇది చూసి కొంతమంది అభిమానులు అభినందిస్తుంటే, మరి కొంత మంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫేస్ ఉపయోగించి లైక్స్ తెచ్చుకుంటున్నందుకు, అతని మీద ఫైర్ అవుతున్నారు. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం:

జూన్ 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ నేపథ్యంలో అక్కడ ముంబై పోలీసుల దర్యాప్తు ప్రారంభమైన తర్వాత, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)లను రప్పించారు. అయితే మూడు సంవత్సరాల అయినప్పటికీ ఇంకా ఈ కేసులో పురోగతి కనిపించకపోవడం గమనార్హం. ” 2021లో, సుశాంత్ కి సంబంధించిన చాట్స్ గురించి సోషల్ మీడియా దిగిజాలను అడగడం జరిగింది కానీ, ఇప్పటికీ US నుండి రాబోయే రిప్లై కోసం మేము ఇంకా ఎదురు చూస్తున్నాము, ఇది తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడుతుంది, అంతేకాకుండా ఇది కేసు క్లోజ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. కేసు ప్రస్తుతానికి, దీని కారణంగానే ఇంకా పెండింగ్‌లో ఉంది” అని ఒక సీబీఐ అధికారి తెలిపారు. 

నిజానికి అప్పట్లో సుశాంత్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు కూడా తీయడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికి, సుశాంత్ తమ ప్రేక్షకులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. 2020లో సుశాంత్ మరణ విషయం వినగానే చాలామంది దుఃఖంలో మునిగిపోయారు. ఇండియాలోనే కాకుండా పలు దేశాలలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎందుకు చనిపోయాడు, అతనికి న్యాయం జరిగేలా నినాదాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పటికీ కూడా సుశాంత్ సింగ్ నటించిన సినిమాలు అభిమానుల మనుషులకు హత్తుకుంటూనే ఉన్నాయి. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన సినిమాలు: 

ఎంఎస్ ధోని, చిచ్చోరే, కేదార్నాథ్, రాబతా, చందమామ దుర్గే, సంచరియా, షుడ్ దేశి రొమాన్స్, చివరి సినిమా దిల్ బేచారా.