అందుకోసం RRR టీమ్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా??

ఈ మూవీ రిలీజ్ అయినపుడు ఇన్ని రికార్డులు కొల్ల గొడుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. అంచనాలకు అందని విధంగా ఈ మూవీ దూసుకుపోయింది. కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా అవార్డుల్లో కూడా ఈ మూవీ తన సత్తాను చాటుతోంది. ఇప్పటికే ఈ మూవీలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు కూడా ఈ సినిమాను వరించింది. అంతే కాకుండా త్వరలో జరగబోయే ఆస్కార్ వేడుకల్లో కూడా ఈ […]

Share:

ఈ మూవీ రిలీజ్ అయినపుడు ఇన్ని రికార్డులు కొల్ల గొడుతుందని ఎవరూ కూడా ఊహించలేదు. అంచనాలకు అందని విధంగా ఈ మూవీ దూసుకుపోయింది. కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా అవార్డుల్లో కూడా ఈ మూవీ తన సత్తాను చాటుతోంది. ఇప్పటికే ఈ మూవీలోని నాటు నాటు పాటకు అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాగా.. హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు కూడా ఈ సినిమాను వరించింది. అంతే కాకుండా త్వరలో జరగబోయే ఆస్కార్ వేడుకల్లో కూడా ఈ మూవీ తన సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అవార్డుల విషయం అలా పక్కన పెడితే.. ఇది వరకు అనేక విషయాల్లో వైరల్‌గా మారిన ఈ మూవీ.. ఇప్పుడు కూడా ఒక విషయంలో వైరల్‌గా మారుతోంది. అదే ఈ సినిమా అవార్డుల ప్రమోషన్ల కోసం ఈ మూవీ టీం దాదాపు రూ. 83 కోట్లు ఖర్చు చేసిందట. ఇప్పుడు ఎవరిని కదిలించినా కానీ.. ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

వసూళ్ల సునామీ

జక్కన్న తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ వసూళ్ల సునామీనే క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలయిన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను చూసినపుడు గూస్ బంప్స్ రావడం పక్కా. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇండియా నుంచి RRR మూవీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది. ఇది తెలుగు వారిగా మనందరికీ ఎంతో గర్వకారణంగా నిలిచే విషయం. RRR మాత్రమే కాకుండా.. ఎన్నో రీజినల్ సినిమాలు కూడా వసూల్లు సాధించినప్పటికీ, కేవలం RRRకు మాత్రమే అవార్డుల పంట పండుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్  ఇండియా కూడా భారత్ నుంచి ఆస్కార్ నామినేషన్ల కోసం RRR సినిమాను పంపింది .

మాస్టర్ ప్లానేసిన రాజమౌళి

ఈ మూవీ దర్శకుడు రాజమౌళి పెద్ద మాస్టర్ మైండ్ అనే విషయం చాలా మంది మూవీ లవర్స్‌కు తెలుసు. ఆస్కార్‌కు నామినేట్ అవడం ఒక వంతయితే, ఆ అవార్డు గెల్చుకోవడం మరో వంతు. అందుకోసమే తన మూవీని ప్రమోట్ చేసేందుకు జక్కన్న అండ్ టీం నడుం బిగించింది. అందరూ నివ్వెర పోయేలా ఈ మూవీ యూనిట్ ప్రపంచవ్యాప్త పబ్లిసిటీ కోసమే దాదాపు రూ. 83 కోట్లు ఖర్చు చేసింది. అందుకోసం RRR మూవీని ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోట్ చేసి, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులకు కూడా పంపారు. ఇక ఈ మూవీ టీం కృషి వల్ల RRR మూవీ.. గ్లోబల్ లెవల్లో గ్రాండ్‌గా ప్రమోట్ అయింది. ఈ మూవీకి ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డు రావడానికి జక్కన్న చాలా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. RRR గ్లోబల్ ప్రమోషన్ గురించి ఓ ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే ఈ మూవీని ఇంటర్నేషనల్ లెవల్లో ప్రమోట్ చేసేందుకు మూవీ యూనిట్ రూ. 83 కోట్లు ఖర్చు చేసిందనే విషయం. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు 17 కోట్ల రూపాయలు వెచ్చించాడని వినికిడి. ఆస్కార్‌కి వెళ్లేందుకు హాలీవుడ్ స్థాయిలో మూవీని ప్రమోట్ చేసేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించారని అంటున్నారు. మెజారిటీ మొత్తాన్ని రాజమౌళి చేతిలో పెట్టినట్లు బలంగా వినిపిస్తోంది. జపనీస్ విడుదలలో వచ్చిన లాభాల నుంచి చిన్న మొత్తాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. హాలీవుడ్‌లో ఆ స్థాయిలో ఖర్చు చేసి ప్రమోట్ చేయడం వల్లే RRR ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లిందని చెబుతున్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత RRR  మూవీ ప్రపంచవ్యాప్త అప్పీల్‌ని పొందిందని, వారు ప్రమోషన్ కోసం ఖర్చు చేశారనేది వాస్తవం కాదని మరి కొందరు వాదిస్తున్నారు . మరి ఇందులో ఏది నిజమో చెప్పలేం.

త్వరలోనే ఆస్కార్

జక్కన్న చెక్కిన RRR ఆస్కార్ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మరి ఈ అవార్డుల వేడుకల్లో RRR సత్తా చాటుతుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది.