మిస్ అవకుండా చూడాల్సిన రాజ‌మౌళి సినిమాలు

టాలీవుడ్ చిత్రసీమలో రాజ‌మౌళి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. రాజమౌళినే ముద్దుగా జక్కన్న అని కూడా పిలుస్తారు. తెలుగు నాట ఏ దర్శకుడికీ లేని మార్కెట్ ను రాజమౌళి సంపాదించుకున్నారు. రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు అది హిట్ పక్కా అనే ధోరణిలో టాలీవుడ్ జనాలు ఉంటారు. ఈ మధ్య ఆయన పాన్ ఇండియా సినిమాల మీద కాన్సంట్రేట్ చేశాడు. కొన్ని రోజుల వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తీసిన జక్కన్న కొన్ని రోజుల […]

Share:

టాలీవుడ్ చిత్రసీమలో రాజ‌మౌళి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. రాజమౌళినే ముద్దుగా జక్కన్న అని కూడా పిలుస్తారు. తెలుగు నాట ఏ దర్శకుడికీ లేని మార్కెట్ ను రాజమౌళి సంపాదించుకున్నారు. రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు అది హిట్ పక్కా అనే ధోరణిలో టాలీవుడ్ జనాలు ఉంటారు. ఈ మధ్య ఆయన పాన్ ఇండియా సినిమాల మీద కాన్సంట్రేట్ చేశాడు. కొన్ని రోజుల వరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తీసిన జక్కన్న కొన్ని రోజుల నుంచి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. దీంతో అతడి పేరు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా వేరే ఇండస్ట్రీస్ లో కూడా మార్మోగిపోతుంది. రీసెంట్ గా రాజమౌళి తన పుట్టిన రోజును జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. రాజమౌళి సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అతడు తీసినవి అన్ని సినిమాలు ఇంస్ట్రీ హిట్ లే అని ఒప్పుకుని తీరాలి. రాజమౌళి దృశ్య కావ్యాలలో తప్పకుండా చూడాల్సిన ఐదు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.. 

1. బాహుబలి: ది బిగినింగ్ 

ఈ మూవీతో రాజమౌళి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీకి ముందు వరకు రాజమౌళి అంటే కేవలం తెలుగు ఆడియన్స్ కు మాత్రమే ఎక్కువగా తెలిసేది. కానీ ఈ మూవీ విడుదల తర్వాత ఆయన భారతీయ చిత్రసీమకు తెలిసిపోయారు. ఈ మూవీ కేవలం ఒక్క పార్ట్ లా కాకుండా రెండు పార్ట్స్ లా వచ్చి రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇది ఒక చందమామ కథ అయినా కానీ రాజమౌళి తనదైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో ఈ సినిమాను మరో స్థాయిలో తెరకెక్కించారు. మొదటి పార్ట్ లో అసలు స్టోరీ చెప్పకుండా ఆయన తెరకెక్కించిన విధానం అద్భుతం. మొదటి పార్ట్ చివరలో ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే క్యూరియాసిటీని కలిగించి ప్రేక్షకులు అరే తప్పకుండా సెకండ్ పార్ట్ చూడాలని థియేటర్లోనే ఫిక్స్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.  

2. బాహుబలి: ది కన్‌క్లూజన్ 

మొదటి పార్ట్ భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన వేళ.. మరియు మొదటి పార్ట్ ఎండింగ్ లో రాజమౌళి ప్లే చేసిన స్ట్రాటజీతో ప్రేక్షకులు బాహుబలి రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా.. అని ఆతృతగా ఎదురు చూశారు. మొదటి పార్ట్ వచ్చిన దాదాపు రెండు సంవత్సరాలకు రెండో పార్ట్ రిలీజ్ అయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే కన్ ఫ్యూజన్ లో ఉన్న ప్రేక్షకులు ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ సినిమాకు క్యూ కట్టారు. దీంతో ఈ మూవీ కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది.

3. ఈగ 

బాహుబలి చిత్రాలతో రాజమౌళి గొప్పతనం ఏంటో అందరికీ తెలసిందే కానీ అంతకు చాలా ముందే రాజమౌళి తానేంటో నిరూపించుకున్నాడు. హీరోలనే కాకుండా కీటకాలను పెట్టి కూడా తాను హిట్ కొట్టగలనని నిరూపించాడు. ఈగ సినిమా పేరుతో హీరోతో మాత్రమే కాకుండా ఈగతో కూడా హిట్ కొట్టి చూపించాడు. అంతగా విజువల్ ఎఫెక్ట్స్ చూడని తెలుగు ప్రేక్షకులు ఈ మూవీలో రాజమౌళి చూపెట్టిన విజువల్ వండర్స్ కు ఫిదా అయిపోయారు. ఈ మూవీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా మక్కీ అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీ అక్కడ కూడా రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. 

4. మగధీర 

బాహుబలి సిరీస్ లు ఈగ మూవీ కంటే చాలా ముందుగానే రాజమౌళి మగధీర అనే హిస్టారిక్ లవ్ కమ్ రివేంజ్ స్టోరీని తెరకెక్కించాడు. 400 ఏళ్ల క్రితం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ సినీ లవర్స్ ను ఎంతో అట్రాక్ట్ చేసింది. ఈ మూవీ కూడా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇందులో వాడిన వీఎఫ్ఎక్స్ వర్క్ చూసి తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తెలుగు ఆడియన్స్ ఇంతవరకు అంతటి వీఎఫ్ఎక్స్ వర్క్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి.

5. ఆర్ ఆర్ ఆర్ 

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి క్రేజ్ విశ్వవ్యాప్తం అయింది. ఇది వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా కొల్లగొట్టింది. చాలా రోజుల తర్వాత ఓ ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డును కూడా కొల్లగొట్టింది. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ఇది చూసిన ఎవరికైనా సరే దేశం అంటే ఎవరికైనా ప్రేమ ఏర్పడేలా చేయడం కామన్. 

రాజమౌళి అనగానే ఇండియాలో ఉన్న ప్రముఖ దర్శకుల్లో ఒకరని మనకు ఇట్టే తెలిసిపోతుంది. రాజమౌళి అంటే కేవలం ఈ ఐదు సిినమాలు మాత్రమే కాదు. ఇప్పటి వరకు జక్కన్న తీసిన ప్రతి సిినమా ఒక హిట్ మూవీయే. ప్రతి మూవీ చూసే విధంగానే ఉంటుంది. కావున రాజమౌళి సినిమాలు చూడాలని అనుకున్న వారు అతడి అన్ని సినిమాలు చూస్తే వేరే రకమైన థ్రిల్ కలుగుతుంది.