2023 చూడాల్సిన బెస్ట్ 5 యాక్షన్ హాలీవుడ్ చిత్రాలు ఇవే..!

హాలీవుడ్ సినిమాలకు అమెరికాతో పాటు ఇండియాలో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి.. అక్కడ దుమ్ము లేపే కలెక్షన్లతో పాటు భారత్ లో కూడా పెద్ద మార్కెట్ గా విస్తరిస్తున్నాయి.. సుమారుగా ప్రతి హాలీవుడ్ సినిమా కూడా ఇండియాలో విడుదల అవుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మన వాళ్లు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.. హాలీవుడ్  యాక్షన్ సినిమాలు చూడాలనుకునే వారికి టాప్ 5 సినిమాస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 1. జాన్ విక్ చాప్టర్ 4  హాలీవుడ్ సూపర్ హిట్ […]

Share:

హాలీవుడ్ సినిమాలకు అమెరికాతో పాటు ఇండియాలో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి.. అక్కడ దుమ్ము లేపే కలెక్షన్లతో పాటు భారత్ లో కూడా పెద్ద మార్కెట్ గా విస్తరిస్తున్నాయి.. సుమారుగా ప్రతి హాలీవుడ్ సినిమా కూడా ఇండియాలో విడుదల అవుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మన వాళ్లు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.. హాలీవుడ్  యాక్షన్ సినిమాలు చూడాలనుకునే వారికి టాప్ 5 సినిమాస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. జాన్ విక్ చాప్టర్ 4 

హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీలో జాన్ విక్ ఒకటి.. ఇందులో నాలుగు సినిమా థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేస్తుంది.. జాన్ విక్ 3 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి చాప్టర్ 4 మొదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా దొరికేక్కుతున్న ఈ ఫ్రాంచైజీలో చాప్టర్ 4 నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడు డైరెక్టర్. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్, అంతకుముందు టాప్ వ్యూ లో తీసిన ఓ యాక్షన్ సీక్వెన్స్, జపాన్ ఎపిసోడ్ యాక్షన్ అయితే హైలైట్. యాక్షన్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారికి జాన్ విక్ 4 బెస్ట్ ఫెంటాస్టిక్ యాక్షన్ రైడ్.

2. డూంజియన్స్ & డ్రాగన్స్

ప్రపంచవ్యాప్తంగా ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రాలు ఇష్టపడే వారి కోసం మార్చి 31న డూంజియన్స్ & డ్రాగన్స్ గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కానుంది. హానర్ అమాంగ్ థీవ్స్ చిత్రం అలరించనుంది. జాన్ ఫ్రాన్సిస్ డాలీ, జోనాథన్ గోల్డ్‌స్టీన్ దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ ఫాంటసీ హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం ఇది. వీరు క్రిస్ మెక్‌కే, గిలియో కథ నుండి మైఖేల్ గిలియోతో కలిసి స్క్రీన్‌ప్లేను రచించారు. ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ను పారామౌంట్ పిక్చర్స్ (ఇండియా), వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా విడుదల అవుతుంది. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీలో విడదల కానుంది.

3. ఫాస్ట్ X

హాలీవుడ్ యాక్షన్ సినిమాలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ కు ఓ ప్రత్యేకత ఉంది. నమ్మశక్యం కాని యాక్షన్ సీక్వెన్స్ లను నమ్మించేలా కన్వీనింగ్ గా తీయడంలో ఈ చిత్రబంధం 100 శాతం సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పదో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మే 19న థియేటర్స్ లో విడుదల కానుంది. మరొక్క భాగంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ను ముగించనున్నారు. 11వ భాగాన్ని మరింత పెద్దదిగా మార్చనున్నారు. ఐరన్ మ్యాన్ పాత్రలో కనిపించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నాడని విన్ డీజిల్ ప్రకటించాడు. తనతో పాటు బోర్లు సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న మాట్ డామన్ కూడా ఈ సినిమాలో నటించారు. రోమ్, రియో డి జనీరో వాషింగ్టన్ డిసి, హవానా, అకాబా,  చైనా టౌన్లలో ఈ చిత్రాన్ని షూట్ చేశారు.

4. మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్

ఇండియన్ సినీ లవర్స్ మార్వెల్ సినిమాలు తరువాత ఎక్కువగా ఇష్టపడే హాలీవుడ్ సిరీస్ ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సినిమాల్లో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ ఆడియన్స్ కి గూస్‌ బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పటికే ఈ సిరీస్ లో 6 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇది మునపటి సినిమాల్లో కంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే రేంజ్ లో ఉండనున్నాయి. 60 ఏళ్ళ వయసులో టామ్ క్రూజ్ బైక్ తో కొండ పై నుంచి కిందకి దూకడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మిషన్ ఇంపాజిబుల్ 5, 6 అండ్ టాప్ గన్ మావెరిక్ చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. జులై 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

5. ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్

స్టీవెన్ కాపుల్ జూనియర్ దర్శకత్వం  ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ రానుంది. పీటర్ కల్లెన్ ఆప్టిమస్ ప్రైమ్ యొక్క వాయిస్‌గా తన పాత్రను నిలుపుకోవడంతో స్టీవెన్ కాపుల్ జూనియర్ దర్శకత్వం వహించారు, ఈ చిత్రం ప్రధానంగా దాని ప్రసిద్ధ కామిక్ బీస్ట్ వార్స్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రాన్ పెర్ల్‌మాన్, ఆంథోనీ రామోస్, పీటర్ కల్లెన్, డొమినిక్ ఫిష్‌బ్యాక్, లూనా లారెన్ వెలెజ్ నటీనటులుగా నటిస్తున్నారు. ఈ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 జూన్, 2023న విడుదల కానుంది.