2024 ఆస్కార్ బరిలో ‘2018’ చిత్రం

ఈ సంవత్సరం 2023లోనే ఆస్కార్ గెలుచుకున్న ఎన్నో చిత్రాలను చూసే ఉంటాం. మనం ముఖ్యంగా తెలుగు చలనచిత్రాన్ని ఆస్కార్ వేదిక మీద చూపించిన ఘనత మన RRRకి దక్కింది. నాటు నాటు పాటతో ప్రపంచ దేశాలను ఉర్రూతలూగించే స్టెప్పులు వేయించడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ అవార్డు గెలుచుకుంది మన తెలుగు చలనచిత్రం RRR. ఇప్పుడు ‘2018’ అనే మరొక మలియాల చిత్రం 2024 ఆస్కార్ బరిలో నిలవనుంది. నిజానికి 2018లో కేరళలో బీభత్సాన్ని సృష్టించిన […]

Share:

ఈ సంవత్సరం 2023లోనే ఆస్కార్ గెలుచుకున్న ఎన్నో చిత్రాలను చూసే ఉంటాం. మనం ముఖ్యంగా తెలుగు చలనచిత్రాన్ని ఆస్కార్ వేదిక మీద చూపించిన ఘనత మన RRRకి దక్కింది. నాటు నాటు పాటతో ప్రపంచ దేశాలను ఉర్రూతలూగించే స్టెప్పులు వేయించడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ అవార్డు గెలుచుకుంది మన తెలుగు చలనచిత్రం RRR. ఇప్పుడు ‘2018’ అనే మరొక మలియాల చిత్రం 2024 ఆస్కార్ బరిలో నిలవనుంది. నిజానికి 2018లో కేరళలో బీభత్సాన్ని సృష్టించిన వరదల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయిన కేరళ వరదల సంఘటన మరొకసారి గుర్తు చేసింది చిత్రం. ఫ్లాప్ అయిపోతుందేమో అని భయపడుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడం గొప్ప విషయం.

మరిన్ని విశేషాలు చూద్దాం రండి: 

2018, మలయాళ చిత్రం, ఆస్కార్ 2024 కోసం భారతదేశం నుంచి పోటీ పడనున్న చిత్రంగా, ఈ చిత్రాన్ని ప్రకటించడం జరిగింది. చాలా మంది కఠినమైన పోటీదారులను అధిగమించి, జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన 2018 చిత్రం, వచ్చే ఏడాది ఆస్కార్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అన్ని ఇతర చిత్రాలను అధిగమించడం జరిగింది. ఈ చిత్రం 2018 కేరళ వరదల ఆధారంగా రూపొందించబడింది. 2018 విమర్శకుల నుంచి సైతం తనదైన శైలిలో అభిమానాన్ని సంపాదించి విజయాన్ని సాధించడమే కాకుండా, భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించింది. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాగా ఆకట్టుకుంది.

ప్రముఖ చిత్రనిర్మాత గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, 2024 అకాడమీ అవార్డుల కోసం భారతదేశం అధికారిక ప్రవేశంగా 2018ని ఎంపిక చేసింది. ఆస్కార్‌ల ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే చలనచిత్రాన్ని ఎంచుకోవడానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఆస్కార్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం, 2018 గ్రాండ్ స్టేజ్‌పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే గౌరవాన్ని అందుకున్న ప్రత్యేకమైన చిత్రం.

2018 గురించి మరింత: 

2018 గొప్ప విమర్శనాత్మక మరియు కమర్షియల్ హిట్‌గా మారినప్పటికీ, జూడ్ ఆంథనీ జోసెఫ్ సినిమా చేసేటప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. ఓన్మనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్రనిర్మాత మాట్లాడుతూ, సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు, ఇది కేరళీయులకు బాగా తెలిసిన కథ అని, అలాంటి సినిమా చేయడం చాలా ప్రమాదమని ఆంటో జోసెఫ్ అన్నారట. ఐదుగురు ప్రముఖులతో ఐదు వేర్వేరు సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే తన కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించాడని.. అయితే తన మీద తనకున్న నమ్మకంతో ముందుకు సాగుతానని చెప్పినట్లు వెల్లడించాడు. ప్రతి మలయాళీ ఈ కథతో కనెక్ట్ అవుతారని ఖచ్చితంగా చెప్పారు చిత్ర నిర్మాత.

జూడ్ ఆంథనీ జోసెఫ్ టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాస్, అపర్ణ బాలమురళి, సుధేష్, శ్రీజ రవి, శ్రీజిత్ రవి, నరైన్ మరియు లాల్‌లతో సహా ఎంతోమంది నటుల సెట్‌లో కనిపించడం జరిగింది. వరదలు. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు, ఈ చిత్రం తమిళం, హిందీ మరియు తెలుగులోకి కూడా డబ్ చేయడం జరిగింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా మారడమే కాకుండా.. కేరళలో జరిగిన సంఘటనలు చూపించి, ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించింది. ఈ మే 5, 2023న థియేటర్లలో విడుదలైంది.