ర‌జినీకాంత్‌కు మ‌రో రూ.100 కోట్లు.. కారు..!

జైలర్ సినిమా ప్రస్తుతం ఎంత అలరించిందో చెప్పనవసరం లేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన రజినీకాంత్ సినిమా జైలర్, అంచనాలకు మించిన 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఆ ఫోటోలో ఏముంది:  జైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైలర్ సినిమా ప్రొడ్యూసర్  కళానిధి మారన్ రజినీకాంత్ […]

Share:

జైలర్ సినిమా ప్రస్తుతం ఎంత అలరించిందో చెప్పనవసరం లేదు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన రజినీకాంత్ సినిమా జైలర్, అంచనాలకు మించిన 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఆ ఫోటోలో ఏముంది: 

జైలర్ కు సంబంధించిన మరో అప్డేట్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైలర్ సినిమా ప్రొడ్యూసర్  కళానిధి మారన్ రజినీకాంత్ ఇంటికి వెళ్ళినట్లు, అంతేకాకుండా రజనీకాంత్ కు 100 కోట్ల చెక్ ఉన్న ఎన్విలోప్ అందించినట్లు, ఫిలిం ట్రేడ్ ఎక్స్పర్ట్ మనోబాల విజయ్ బాలన్ ట్విట్టర్ వేదికగా ఫోటో షేర్ చేస్తూ అంచనా వేయడం జరిగింది. మరోపక్క సన్ పిక్చర్స్ వారు కళానిధి మారన్ రజినీకాంత్ కి ఒక ప్రత్యేకమైన చెక్ అనేది అందించినట్లు, జైలర్ సినిమా సక్సెస్ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలిపింది. 

ఫిలిం ట్రేడ్ ఎక్స్పర్ట్ మనోబాల విజయ్ బాలన్ ట్విట్టర్ వేదికగా ఫోటో షేర్ చేస్తూ, ప్రొడ్యూసర్  కళానిధి మారన్ రజినీకాంత్ ఇంటికి వెళ్ళినట్లు, అంతేకాకుండా రజనీకాంత్ కు 100 కోట్ల చెక్ ఉన్న ఎన్విలోప్ అందించినట్లు, అంతే కాకుండా చెక్ మీద, సిటీ యూనియన్ బ్యాంక్, మండవేలి శాఖ, చెన్నై అడ్రస్ ఉన్నట్లు అంచన వేస్తున్నారు. అంటే ఈ 100 కోట్లు తీసుకున్న రజినీకాంత్.. ఈ సినిమాకు గాను ముందుగా తీసుకున్న 110 కోట్లతో కలిపి, పూర్తిగా 210 కోట్లు తీసుకుని, భారత దేశంలో ఒక్క సినిమాకు అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకున్న నటుడిగా పేరు సంపాదించుకుంటున్నట్లు చెప్తున్నారు. ఏది నిజమో తెలుసుకునేందుకు కాస్త వెయిట్ చేయాల్సిందే. 

జైలర్ సినిమా విశేషాలు:

రజనీకాంత్‌తో పాటు, జైలర్‌లో జాకీ ష్రారోఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, రమ్య కృష్ణన్, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా మరియు మలయాళం స్టార్ మోహన్‌లాల్ అతిధి పాత్రలో పెద్ద పెద్ద తారలు కనిపించబోతున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు, ఆ పాటలు ఇప్పటికే ఇంటర్నెట్ ని ఊపేస్తున్నాయి. జైలర్ ఆగస్ట్ 10న విడుదల అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా ముఖ్యంగా తమన్నా డాన్స్ స్టెప్పులు, అదేవిధంగా, ఎప్పటిలాగే రజనీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జైలర్ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే హడావిడి మొదలైంది, జైలర్ సినిమా రిలీజ్ కారణంగా చెన్నై అలాగే బెంగళూరులోని పలు ప్రాంతాలలో కొన్ని ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో జైలర్ సినిమా కోసం ఉచిత టికెట్లు పంపిణీ కూడా చేశారు. 

రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ఈ సినిమాలో కావాలా అనే పాటను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్పులు ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్నాయి. రజనీకాంత్ తో కలిసి తమన్నా స్టెప్పులు వేయడం సినిమా పై అంచనాలను మరింత పెంచింది, అదేవిధంగా ప్రస్తుతం రిలీజ్ అయిన సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కావాలా అనే పాటని శిల్పారావు, అనిరుద్ రవిచంద్రన్ పాడారు. ఈ పాట లిరిక్స్ని అరుణ్ రాజా కామరాజ్ రాశాడు. ఈ పాట అందర్నీ ఇంప్రెస్ చేస్తుంది. ఈ కావాలా అనే పాట ట్రాక్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని ఫాన్స్ అంటున్నారు