టాలీవుడ్ టాప్ 10 సీక్వెల్స్ ఇవే..!

సినిమా అంటే రంగుల ప్రపంచం. కోట్ల రూపాయల వ్యాపారం. సినిమా ప్రేక్షకుడికి నచ్చితే పెట్టిన పెట్టుబడితో పాటు రెట్టించిన స్థాయిలో లాభాలు వస్తాయి.. అదే నచ్చుకుంటే అదే స్థాయిలో అప్పలు మిగులుతాయి. టాలీవుడ్ఎం త తోపు ఇండస్ట్రీ అయినప్పటికీ విజయాల శాతం 5కు మించదు. కానీ ఇప్పుడు వెనుకటి రోజులు కావు. పైగా సినిమా విస్తృతి పెరిగిన నేపథ్యంలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ […]

Share:

సినిమా అంటే రంగుల ప్రపంచం. కోట్ల రూపాయల వ్యాపారం. సినిమా ప్రేక్షకుడికి నచ్చితే పెట్టిన పెట్టుబడితో పాటు రెట్టించిన స్థాయిలో లాభాలు వస్తాయి.. అదే నచ్చుకుంటే అదే స్థాయిలో అప్పలు మిగులుతాయి. టాలీవుడ్ఎం త తోపు ఇండస్ట్రీ అయినప్పటికీ విజయాల శాతం 5కు మించదు. కానీ ఇప్పుడు వెనుకటి రోజులు కావు. పైగా సినిమా విస్తృతి పెరిగిన నేపథ్యంలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌కు కొన‌సాగింపుగా ప‌లు సీక్వెల్స్ రాబోతున్నాయి. ఆ సీక్వెల్స్ ఏవంటే…

దేవర

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన “దేవర”లో, జూనియర్ ఎన్టీఆర్‌ని ఉత్తేజకరమైన పాత్రలో చూస్తామని డైరెక్టర్ తెలిపారు. ఇందులో యాక్షన్, భావోద్వేగాలు మరియు ముఖ్యమైన సామాజిక సందేశాలు ఉంటాయని తెలిపారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే “దేవర”కి సీక్వెల్ రాబోతుంది.

సలార్

‘కేజీఎఫ్‌’ ఘనవిజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమా చేస్తున్నాడు. ఇది ఇంటెన్స్ యాక్షన్ తో నిండిన సినిమా, మరియు వారు ఇప్పటికే “సాలార్” కి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.

పుష్ప-2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పుష్ప చిత్రం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకున్న‌ది. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ‌ర‌వాణా నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ న‌ట‌న‌, మేన‌రిజ‌మ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ నాలుగు వంద‌ల కోట్లకుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈబ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీకి కొన‌సాగింపుగా పుష్ప -2 పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కుతోంది.

ప్ర‌స్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ మారేడుమిల్లిలో జ‌రుగుతోంది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో పుష్ప -2ను రిలీజ్ చేసేందుకు డైరెక్ట‌ర్ సుకుమార్ స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈ సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అన‌సూయ‌, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోన్నారు.

గూడాచారి-2

అడివిశేష్ గూఢ‌చారి-2 కూడా ప్రేక్ష‌కుల‌కు థిల్‌ను పంచ‌డానికి రెడీ అవుతోంది. ఈ సీక్వెల్‌కు విన‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. వీటితో పాటుగా ప‌లువు సీక్వెల్‌, థ‌ర్డ్ పార్ట్‌ల‌ను అనౌన్స్‌చేశారు.

స్కంద-2

మొదటి “స్కంద” పెద్ద హిట్ అయింది, ఇప్పుడు “స్కంద-2” రాబోతుంది. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మరియు నటుడు రామ్ పోతినేని మరింత హృదయాన్ని కదిలించే యాక్షన్ మరియు ఎమోషనల్ స్టోరీని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. 

డబుల్ ఇస్మార్ట్

ఇస్మార్ట్ శంక‌ర్‌కు డ‌బుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు హీరో రామ్‌, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌. రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం ఈ సీక్వెల్‌ను అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న పూరి జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్‌తో తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే లైగ‌ర్‌తో అత‌డి కెరీర్ మ‌రోసారి ఇబ్బందుల్లో ప‌డింది. ఈ త‌రుణంలో మ‌రోసారి రామ్ అత‌డికి అవ‌కాశం ఇవ్వ‌డం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అనౌన్స్‌మెంట్ రోజే డ‌బుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించేశారు. 2024 మార్చి 8న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ సీక్వెల్ సెట్స్‌పైకిరానుంది.

టిల్లు స్క్వేర్

ప్ర‌స్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ రాబోతోన్న‌ది. డీజే టిల్లు స్క్వేర్ పేరుతో రూపొందుతోన్న ఈ సీక్వెల్‌లో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సీక్వెల్ ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది.

బింబిసార-2

నందమూరి కళ్యాణ్ రామ్ చారిత్రాత్మకమైన “బింబిసార”లో అద్భుతంగా నటించారు. ఇప్పుడు, మల్లిడి వస్సిష్ట దర్శకత్వం వహించిన “బింబిసార-2” రానుంది.  ఇది పురాతన భారతదేశానికి ఆకర్షణీయమైన పర్యటనకు హామీ ఇస్తుంది.

అఖండ-2

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నటుడు బాలకృష్ణ కలయికలో వస్తున్న చిత్రం “అఖండ-2”. మొదటి సినిమా విజయం తర్వాత, ఈ సీక్వెల్ మరింత తీవ్రమైన యాక్షన్ మరియు ఉత్తేజకరమైన కథతో ఉంటుందని బోయపాటి తెలిపారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ-2

“ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” అనే సినిమా తెలివైన డిటెక్టివ్ కథలకు ప్రసిద్ధి చెందింది. స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వం వహించిన మరియు నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సీక్వెల్ త్వరలో రాబోతుంది. 

వీటితో పాటు దాస్ కా ధ‌మ్కీకి సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్లు విశ్వ‌కే సేన్ ప్ర‌క‌టించారు. అలాగే హిట్ ఫ్రాంచైజ్‌లో హిట్ -3 రాబోతుంది. ఇందులో నాని హీరోగా న‌టిస్తోన్నాడు. విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ -2 తో పాటు మ‌రికొన్ని సీక్వెల్స్ రానున్నాయి.