"గుంటూరు కారం" నుంచి ‘కుర్చీ మడతపెట్టి’.. పూర్తి లిరికల్ వీడియో వచ్చేసింది

Kurchi Madatha Petti: కుర్చీ మడతపెట్టి అంటూ సాగే ఈ హైఓల్టేజ్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

Courtesy: x

Share:

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, శ్రీలీలా ప్ర‌ధాన పాత్ర‌ల్లో గుంటూరు కారం (Guntur Kaaram) అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాట ప్రోమోను మేక‌ర్స్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా కుర్చీ మడతపెట్టి అంటూ సాగే ఈ హైఓల్టేజ్ సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. నిన్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోతోనే మహేశ్ అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు పూర్తి పాట రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. 

ఈ పాట‌కు సంబంధించిన ఫుల్ లిరిక‌ల్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. తమన్ సంగీతం స‌మ‌కుర్చాడు. ఈ సాంగ్ చూస్తే.. మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీలతో మహేశ్ బాబు ఉత్సాహంగా స్టెప్పులేసిన తీరు మాస్ మసాలా రేంజ్ లో ఉర్రూతలూగిస్తోంది. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. "రాజమండ్రి రాగమంజరి... మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ... సోకులాడి స్వప్న సుందరీ... నీ మడతచూపు మాపటేల మల్లెపందిరీ" అంటూ ఆడియన్స్ ను కిర్రెక్కించేలా రామజోగయ్య తన కలానికి పనిచెప్పారు. జనవరి 12న థియేటర్స్ లో మాస్ జాతర కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్‌ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.