10 బిలియన్ డాలర్లకు పెరిగిన మార్క్ జుకర్ బర్గ్ ఆదాయం

ప్రపంచ కుబేరుడు జుకర్ బర్గ్ ఆదాయం పది బిలియన్లు పెరిగినట్టు వెల్లడించారు. మార్క్ జుకర్ బర్గ్ మెటా సంస్థకు సీఈవో వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 14 శాతం షేర్లు పెరిగాయి. ఇటీవల 21 వేల మంది కంపెనీ ఉద్యోగులను రెండు దఫాలుగా తొలగించినట్లు ప్రకటించారు. దీంతో కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. జుకర్ బర్గ్ 87.3 బిలియన్లతో ప్రపంచ కుబేరులలో 12వ స్థానంలో నిలిచారు. మెటా సంస్థ 28.65 బిలియన్ల ఆదాయాన్నికల్గి ఉన్నట్టు వెల్లడించింది. […]

Share:

ప్రపంచ కుబేరుడు జుకర్ బర్గ్ ఆదాయం పది బిలియన్లు పెరిగినట్టు వెల్లడించారు. మార్క్ జుకర్ బర్గ్ మెటా సంస్థకు సీఈవో వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 14 శాతం షేర్లు పెరిగాయి. ఇటీవల 21 వేల మంది కంపెనీ ఉద్యోగులను రెండు దఫాలుగా తొలగించినట్లు ప్రకటించారు. దీంతో కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. జుకర్ బర్గ్ 87.3 బిలియన్లతో ప్రపంచ కుబేరులలో 12వ స్థానంలో నిలిచారు. మెటా సంస్థ 28.65 బిలియన్ల ఆదాయాన్నికల్గి ఉన్నట్టు వెల్లడించింది. ఇది గత సంవత్సరం కంటే మూడు శాతం పెరిగింది. గురువారం నాస్ డాక్ లిస్టెడ్ మెటా ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంది. 2022లో స్టాక్ మార్కెట్ అనేక మంది ప్రపంచ కుబేరులను ఆదాయాన్ని నాశనం చేసింది. దీంతో జుకర్ బర్గ్ ఆదాయం 50% కంటే క్షీణించింది. 

అయినప్పటికీ ప్రస్తుతం మంచి లాభాలతో ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. తమకు మంచి ఫలితాలు లభించాయని రాను రాను మంచి లాభాలు వస్తాయని తెలిపారు. మా యాప్ లు, వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయని తెలిపారు. మెరుగైన ఉత్పత్తులను వేగవంతంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

బలమైన స్థితిలో దీర్ఘకాలం ఉండేందుకు దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. మరింత ఉత్సాహంతో పని చేయనున్నట్టు తెలిపారు. మెటా రియాలిటీ ల్యాబ్స్ 2022లో 13.7 బిలియన్ల సంపద కోల్పోయింది. రెండవ త్రైమాసికంలో 29.5 నుంచి 32 బిలియన్ల పరిధిలో ఉండనున్నట్టు మెటా సంస్థ అంచనా వేస్తోంది. సంవత్సరం మొత్తం కలిపి 90 బిలియన్ల పరిధిలో అంచనా వేస్తోంది. మార్చిలో అందించిన మా ముందస్తు ఆలోచన నవీకరించబడింది అని పేర్కొన్నారు. ఏకీకరణ చార్జీలు, విభజన, ఇతర సిబ్బంది ఖర్చులు ఇందులో ఐదు బిలియన్లు ఉన్నాయి.

కాగా జుకర్ బర్గ్ 1984 మే 14న అమెరికాలో జన్మించారు. జుకర్ బర్గ్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఫిబ్రవరి 2004వ సంవత్సరంలో తన రూమ్ మెంట్స్ తో ఫేస్ బుక్‌ను ప్రారంభించారు. వాస్తవానికి కళాశాల క్యాంపస్ లను ఎంచుకోవడానికి ప్రారంభించినప్పటికీ ఈ సైట్.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 2012లో బిలినియర్ గా జుకర్ బర్గ్ ఎదిగారు. మే 2012లో మెజార్టీ షేర్లు కంపెనీని ముందుకు తీసుకువచ్చాయి. 

అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ కుబేరుడు అయ్యాడు. జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ తో సహా పలు ప్రయత్నాలను నిర్వహించారు. 2008, 2011, 2016, 2019లలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తులలో ఒకరిగా జుకర్బర్గ్ నిలిచారు. 2009, 2010, 2012, 2014, 2015, 2017, 2020 టైమ్స్  మ్యాగ్జిన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఆయనను పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగం జనాభా ఫేస్ బుక్‌ను వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో జుకర్ బర్గ్ పదవ స్థానంలో నిలిచారు.

జుకర్ బర్గ్ స్కూల్లో కంప్యూటర్లు రైటింగ్ సాఫ్ట్వేర్ పై పని చేసేవారు. పాఠశాలలో అతను, అతని తండ్రి ఆఫీస్ మధ్య ఉన్న కంప్యూటర్లను కమ్యూనికేట్ చేయడానికి ప్రోగ్రామ్ ను నిర్మించేవారు. హైస్కూల్ సంవత్సరం మీడియా ప్లేయర్ అనే మ్యూజిక్ ప్లేయర్ ను రూపొందించడంలో పనిచేశారు. పిల్లలు కంప్యూటర్ గేమ్లు ఆడే సమయంలోనే జుకర్ బర్గ్ గేమ్ ను సృష్టించాడు. జుకర్ బర్గ్ తన క్లాస్ మేట్ ప్రిసిల్లా చాన్ ను 2012 మే 19న వివాహం చేసుకున్నాడు. 2015 డిసెంబర్ 1  న జుకర్ బర్గ్ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది.