Gaurav Taneja: ఏయిర్‌ ఏసియా సీఈవోతో పోలిస్తే సంపాదనలో నేనే టాప్

మాజీ పైలట్‌  గౌరవ్ తనేజా(Gaurav Taneja) మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో(Metro) రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్(Youtuber) గౌరవ్ తనేజా గుర్తున్నాడా?  యూట్యూబ్‌లో ఫ్లైయింగ్‌ బీస్ట్‌(Flying Beast)గా ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్  తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు.  అంతేకాదు  తన పాత సీఈవోతో పోలిస్తే సంపాదనలో   కింగ్‌ని  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకపుడు తనను తొలగించిన ఏయిర్‌ ఏసియా (AirAsia) సీఈవో కంటే ఇపుడు […]

Share:

మాజీ పైలట్‌  గౌరవ్ తనేజా(Gaurav Taneja) మరోసారి వార్తల్లో నిలిచాడు. మెట్రో(Metro) రైల్లో పుట్టిన రోజు వేడుకలు జరిపిన బుక్కైన యూట్యూబర్(Youtuber) గౌరవ్ తనేజా గుర్తున్నాడా?  యూట్యూబ్‌లో ఫ్లైయింగ్‌ బీస్ట్‌(Flying Beast)గా ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పే యూ ట్యూబర్ గౌరవ్  తన సంపాదన ఎంతో ఫ్యాన్స్‌కి చెప్పేశాడు.  అంతేకాదు  తన పాత సీఈవోతో పోలిస్తే సంపాదనలో   కింగ్‌ని  అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఒకపుడు తనను తొలగించిన ఏయిర్‌ ఏసియా (AirAsia) సీఈవో కంటే ఇపుడు తన సంపాదన ఎక్కువ అంటూ ఇటీవల ఇన్‌ఫ్లుయెన్సర్ రాజ్ షమానీ(Influencer Raj Shamani) హోస్ట్ చేసిన పోడ్‌ కాస్ట్ సందర్భంగా వెల్లడించారు. బ్రాండ్ డీల్స్(Brand Deals), యాడ్స్‌(Ads) ఆదాయం గురించి చెప్పమని అడిగినపుడు ఈ వ్యాఖ్యలు చేశాడు.  గౌరవ్‌ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. నిర్దిష్టంగా ఇంత అనీ సంపాదన వివరాలు బహిరంగంగా వెల్లడించ లేదు. కానీ ఎయిర్‌ ఏసియా (AirAsia) సీఈవో టోనీ ఫెర్నాండెజ్(CEO Tony Fernandes) మిలియన్‌ డాలర్ల ఆస్తులను గుర్తు చేసుకుని తనేజా ఫ్యాన్స్‌ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. అదీ  సీఈవో టోనీ లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌తో విమర్శల పాలైన తరువాత  కంపెనీ మాజీ పైలట్‌ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో మరింత వైరల్‌గా మారాయి.

ఇంతకీ ఎవరీ  గౌరవ్‌ తనేజా

  • 2008లో ఐఐటీ ఖరగ్‌పూర్‌(IIT Kharagpur) పట్టభద్రుడైన గౌరవ్ తనేజా “సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్(Certified Nutritionist), ప్రొఫెషనల్ బాడీబిల్డర్ ,  ఏవియేటర్ కూడా.
  • ఇపుడు ఢిల్లీ  యూనివర్శిటీనుంచి ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాడు.
  •  మరో పైలట్‌ రీతూ రథీ(Ritu Rathi is a pilot)తో వివాహం. వీరికి ఇద్దరు కుమార్తెలు .
  • భద్రతా సమస్యల్ని గురించిన మాట్లాడినందుకే తనను  ఎయిర్‌ ఏసియానుంచి తొలగించారనేది  గౌరవ్‌ వాదన. 
  • ఫ్లైయింగ్ బీస్ట్ కంటే ముందే  2016లో ఫిట్ మజిల్ టీవీ (FitMuscle TV)ని లాంచ్‌ చేశాడు. దీనికి దాదాపు 30 లక్షల సబ్‌ స్క్రైబర్లున్నారు. ఇక 2020లో లాంచ్‌ చేసిన రాస్బరీ కే పాపాకి 12 లక్షలకు పైగా సబ్‌ స్క్రైబర్లున్నారు.

కాగా 2020జూన్‌లో ఎయిర్ ఏసియా (AirAsia) ఇండియా గౌరవ్‌ను పైలట్‌గా  విధులనుంచి  తొలగించింది. అప్పటికే ప్రముఖ వ్లాగర్‌గా తనేజా ఫుట్‌ టైం కంటెంట్‌ క్రియేటర్‌గా, యూట్యూబర్‌గా కరియర్‌ స్టార్ట్‌ చేశాడు.ఫ్లైయింగ్ బీస్ట్‌(Flying Beast), ఫిట్ మజిల్ టీవీ(FitMuscle TV), రాస్బరీకే పాపా పేర్లతో యూట్యూబ్ ఖాతాలను నిర్వహిస్తున్నాడు. అలా సోషల్‌మీడియాలో పాపులర్‌ స్టార్‌గా మారిపోయాడు.

గతంలో ఎందుకు అరెస్ట్ అయ్యాడు 

ఉత్తరప్రదేశ్‌లోని యూట్యూబర్ గౌరవ్ తనేజాను (జులై 9) పోలీసులు అరెస్ట్ చేశారు. తన పుట్టిన రోజు వేడుకను నోయిడాలోని సెక్టార్-51 మెట్రో స్టేషన్ దగ్గర జరుపుకోవడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనేజా తన పుట్టిన రోజును జరుపుకోవడానికి మొత్తం  ఎన్ఎంఆర్సీ(NMRC) మెట్రో కోచ్ బుక్ చేయబడిందని, వేడుకలో భాగం కావాలని అభిమానులకు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా స్వాగతం పలికారు.

దాంతో ఫ్లయింగ్ బీస్ట్‌(Flying Beast)గా ప్రసిద్ధి చెందిన యూట్యూబర్‌ గౌరవ్ తనేజా(Gaurav Taneja)ను కలవడానికి వేలాది మంది అభిమానులు సెక్టార్-51 మెట్రో స్టేషన్‌(Metro station)కు చేరుకున్నారు. అలా పెద్ద సంఖ్యలో జనం చేరడంతో స్టేషన్ దగ్గర తొక్కిసలాట జరిగింది. దీంతో మెట్రోలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మెట్రో స్టేషన్‌ కింద ఈవెంట్‌ టోకెన్‌లు పంపిణీ చేస్తున్న సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

తర్వాత ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. దానిని ఉల్లంఘించిన తనేజాను అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. తర్వాత ఐపీసీ సెక్షన్(IPC Section) 241, సెక్షన్ 188 కింద అరెస్టు చేశారు. గౌరవ్ తనేజా తన అద్భుతమైన కంటెంట్ ద్వారా పాపులర్ యూట్యూబర్‌గా నిలిచాడు. భారత్‌లో టాప్ యూట్యూబర్లలో తనేజా కూడా ఒకడు. గౌరవ్ తనేజా నెలవారీ ఆదాయం 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. అతనికి వేలాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం, యూట్యూబ్‌లో 80 లక్షలకుపైగా  సబ్‌స్క్రైబర్లు, ట్విటర్‌లో  దాదాపు 900k, ఇన్‌స్టాలో  40 లక్షల  ఫాలోవర్స్‌   ఉన్నారంటే అతని క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు.