జీవిత బీమా ఎందుకు తీసుకోవాలో చెప్పే 6 కారణాలు?

జీవిత బీమా అనేది మీ డబ్బులు రెట్టింపు చేసుకునే పెట్టుబడి సాధనం కాదు. చాలామంది జీవిత బీమా అనగానే.. ఎంత కడితే ఎంత లాభం వస్తుంది అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి.. వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు. ఇది మీ ప్రియమైన వారికి ఆర్థిక రక్షణ కల్పించే పథకం మాత్రమే. కానీ చాలామంది మనం పోతే గాని రాని డబ్బులు ఎందుకు అని భావిస్తుంటారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జరగరానిది […]

Share:

జీవిత బీమా అనేది మీ డబ్బులు రెట్టింపు చేసుకునే పెట్టుబడి సాధనం కాదు. చాలామంది జీవిత బీమా అనగానే.. ఎంత కడితే ఎంత లాభం వస్తుంది అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి.. వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు. ఇది మీ ప్రియమైన వారికి ఆర్థిక రక్షణ కల్పించే పథకం మాత్రమే. కానీ చాలామంది మనం పోతే గాని రాని డబ్బులు ఎందుకు అని భావిస్తుంటారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి జరగరానిది జరిగితే..  రెండు రకాల నష్టాలు ఉంటాయి.  మొదటిది అన్ని తానే అనుకున్న వ్యక్తి దూరం కావటం. ఆ లోటు ఎన్నటికీ పూడ్చలేనిది, ఎంతమంది సానుభూతి చెప్పిన ఆ మనిషి ఎప్పటికీ తిరిగిరాలేడు. ఇక రెండో నష్టం.. ఆర్థికంగా ఆ కుటుంబం చితికి పోయే ప్రమాదం ఉంటుంది. జీవిత బీమా తోడుగా ఉంటే ఆర్థికపరమైన నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. అందుకే జీవిత బీమా తీసుకోవడం తప్పనిసరి. అసలు జీవిత బీమా ఎందుకు తీసుకోవాలో చెప్పే కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భాగస్వామికి భరోసా

జీవిత బీమాలో ఇది అత్యంత కీలకమైన అంశం. సంపాదించే ఆ ఒక్కరూ పోతే.. ఆ ఇంటి ఇల్లాలు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎలాంటి ఆర్థిక ఏర్పాట్లు చేయకుంటే.. కుటుంబం, ఇల్లాలు ఇంకా పోయిన వారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి ఆపద రావాలని ఎవరు కోరుకోరు. కానీ.. అనుకోని పరిస్థితుల్లో కొన్ని కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఆ నష్టాన్ని భరించాలన్నా, పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించాలన్నా, ఇల్లు సక్రమంగా నడపాలన్నా, వారికి ఇలాంటి ఆర్థిక భరోసా అవసరం. అది జీవిత బీమా తోనే సాధ్యమవుతుంది.

అప్పులు తీర్చడానికి

కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన కుటుంబం ఇబ్బంది పడాలని ఎవరు అనుకోరు. కానీ.. జీవిత బీమా ఉంటే.. సరైన సమయానికి కట్టాల్సిన పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బిల్లులు, కార్ లోను, గృహ రుణం, వాహన రుణం నిశ్చింతగా చెల్లించవచ్చు.

తక్కువ ప్రీమియం

జీవిత బీమా అందరికీ అవసరం కాకపోవచ్చు. జీవిత బీమాని చిన్న వయసులోనే తీసుకుంటే తక్కువ ప్రీమియంను చెల్లించవచ్చు. మీ వయసు పెరిగేకొద్దీ ప్రీమియం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా మీరు ఎలాంటి జీవిత బీమా పాలసీ తీసుకున్నా.. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు  వస్తుంది. పాలసీదారుడు మృతి చెందిన తర్వాత వచ్చే మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదు. 

దీర్ఘకాల లక్ష్యాల సాధన

భీమాను దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలు సాధించే పెట్టుబడిగా పరిగణించవచ్చు. బీమా పథకం నుంచి వచ్చే డేవిడెండ్, క్యాష్ బ్యాక్ ద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఇది సుదీర్ఘ లక్ష్యాలైన సొంత ఇల్లు, రిటైర్మెంట్ ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవచ్చు. 

రిటైర్మెంట్ తర్వాత

ఉద్యోగానికి వీడ్కోలు పలికిన తరువాత.. ఆదాయ ప్రయోజనాలను వదులుకోవాలని ఎవరు అనుకోరు. అదే మీరు బీమా తీసుకుంటే.. ఉద్యోగ విరమణ తర్వాత నెల నెల ఆదాయం పొందవచ్చు. పెన్షన్ ప్రణాళికలో క్రమానుగుణంగా పెట్టుబడులు పెట్టినట్టే.. భీమా పథకంలోను పెడితే.. విరమణ తర్వాత నిశ్చింతగా ఆదాయం పొందవచ్చు.

అనువైన సాధనం

మృత్యువు అనివార్యం. అలాంటి విపత్కర పరిస్థితిలో మీరు.. మీ కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందివ్వాలంటే.. పాలసీ తీసుకోవడం మంచిది. చిన్న మొత్తానికి పాలసీ తీసుకున్నా.. అది ఏదో ఒక సమయానికి అవసరం అవుతుంది. కుటుంబ రక్షణకు, క్రమశిక్షణగా డబ్బులు ఆదా చేసుకోవడానికి జీవిత బీమా అనువైన సాధనం.