మరింత ఆకర్షణీయంగా సావరిన్ గోల్డ్ బాండ్‌లు

రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం ధర మరింత పెరుగుతోంది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్‌ల ద్వారా పెట్టుబడిదారులకు లాభాలు రానున్నాయి.  సావరిన్ గోల్డ్ బాండ్ పథకం నవంబర్ 2022లో US ద్రవ్యోల్బణం  ఆందోళనల నేపథ్యంలో, అమెరికాలో ఫెడ్ రేట్ పెంపు ఎక్కుగా ఉన్న కారణంగా బంగారం ధర ప్రస్తుతం ట్రేండింగ్‌లో ఉంది. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గత నాలుగు నెలల్లో బంగారం ధరలు సుమారు 13% పెరిగాయి, గత రెండేళ్లలో  దేశీయంగా 28 శాతం […]

Share:

రోజులు గడుస్తున్న కొద్దీ బంగారం ధర మరింత పెరుగుతోంది. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్‌ల ద్వారా పెట్టుబడిదారులకు లాభాలు రానున్నాయి. 

సావరిన్ గోల్డ్ బాండ్ పథకం

నవంబర్ 2022లో US ద్రవ్యోల్బణం  ఆందోళనల నేపథ్యంలో, అమెరికాలో ఫెడ్ రేట్ పెంపు ఎక్కుగా ఉన్న కారణంగా బంగారం ధర ప్రస్తుతం ట్రేండింగ్‌లో ఉంది. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గత నాలుగు నెలల్లో బంగారం ధరలు సుమారు 13% పెరిగాయి, గత రెండేళ్లలో  దేశీయంగా 28 శాతం (13 శాతం CAGR) మరియు గత నాలుగేళ్లలో 78 శాతం (15.5 శాతం CAGR) పెరిగింది. భారతదేశంలో  సంవత్సరానికి బంగారంపై దీర్ఘకాలిక రాబడి 10 శాతం వస్తుంది. కాగా.. బంగారంపై ఇటీవలి రాబడి దీర్ఘకాలిక సగటు కంటే ఎక్కువగా ఉంది. బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నందున.. గోల్డ్ కొనుగోళ్లను కొనసాగించాలని బులియన్ నిపుణులు.. బంగారం పెట్టుబడిదారులకు సలహాలు ఇస్తున్నారు,

సాధారణ బంగారం కంటే SGBలు ఎందుకు గొప్పవి?

సావరిన్ గోల్డ్ బాండ్‌లకు అనుకూలంగా ICICI డైరెక్ట్ ఇలా పేర్కొంది, “సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB) బంగారాన్ని సేవ్ చేసుకోవడానికి ఉత్తమ మార్గం అని తెలిపింది. ఎందుకంటే వార్షికంగా 2.5% అదనపు వడ్డీ లభిస్తుంది, వచ్చిన లాభాలపై ట్యాక్స్ కూడా ఉండదు. ఇంకా.. మనం వడ్డీ తీసుకున్నప్పుడు కూడా అదనపు చార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. సావరిన్ గోల్డ్ బాండ్‌‌ను విత్ డ్రా చెయ్యడం ద్వారా వచ్చే లాభాలు కూడా ట్యాక్స్ నుండి మినహాయించబడతాయని పేర్కొంది. అయితే ఈ బాండ్‌లను మెచ్యూరిటీ కంటే ముందు సెకండరీ మార్కెట్‌లో విక్రయిస్తే.. అటువంటి లావాదేవీపై వచ్చే మూలధన లాభాలపై మూడు సంవత్సరాలలో లేదా తర్వాత విక్రయించినట్లయితే ఇండెక్సేషన్‌తో 20 శాతం ట్యాక్స్ విధించబడుతుంది. మరో వైపు మూడేళ్ల ముందు విక్రయిస్తే మార్జినల్ ట్యాక్స్ రేటుకు లోబడి ఉండాలని” ICICI డైరెక్ట్ తెలిపింది.

ఇంకా సావరిన్ గోల్డ్ బాండ్‌లపై ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టమని బంగారం పెట్టుబడిదారులకు సలహా ఇస్తూ.. బ్రోకరేజ్ “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, డిజిటల్ మోడ్‌లను ఉపయోగించి చెల్లింపులు చేసే పెట్టుబడిదారులకు ప్రతి గ్రామ్‌‌కు ₹ 50 తగ్గింపు అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. దీంతో పెట్టుబడిదారులు సంవత్సరానికి 2.50% చొప్పున అదనపు వడ్డీని పొందుతారు. 

ఇప్పటివరకు.. భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా 62 విడతలుగా సావరిన్ గోల్డ్ బాండ్‌లను జారీ చేసి సుమారు ₹ 43000 కోట్లను సమీకరించింది. సావరిన్ గోల్డ్ బాండ్‌ల ద్వారా అందించే సౌలభ్యం మరియు అదనపు వడ్డీపై పెట్టుబడిదారులు విశ్వాసం పొందడంతో.. గత కొన్ని సంవత్సరాలలోనే సావరిన్ గోల్డ్ బాండ్ యొక్క ప్రజాదరణ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పవచ్చు.

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

బంగారం ధర రోజురోజుకీ ఎందుకు పెరుగుతోందో అనే దానిపై ICICI డైరెక్ట్  బ్రోకరేజ్ మాట్లాడుతూ.. “యుఎస్ డాలర్ విలువ, యుఎస్ బాండ్ ఈల్డ్‌లు మరింత పెరగడం ప్రారంభించాయి, దీంతో బంగారం ధర కూడా అంతకంతకు పెరుగుతూ వస్తోంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేయడంతో పాటు బంగారం డిమాండ్‌పై మరింత సానుకూల ప్రభావం చూపుతుంది. మరోవైపుచైనా మార్కెట్ల పెరుగుదల కూడా ఈ బంగారం ధరల పెరుగుదలకు కారణం అయ్యింది.