రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ముందు నుంచే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

రిటైర్మెంట్ తర్వాత ఉండే ఖర్చులేమిటి? రిటైర్మెంట్‌ తర్వాత పెద్దగా ఖర్చులు ఉండవని.. దాచుకోక పోయినా పర్వాలేదని అనుకోవడం ముమ్మాటికి తప్పు. ఆఫీసుకు వెళ్లకపోవడం ఒక్కటే మార్పు తప్ప.. మిగిలిన విషయాలన్నీ సేమ్‌ టు సేమ్‌. పైగా అనారోగ్య ఖర్చులు అదనం.. కొన్ని కొన్ని కుటుంబాల్లో నెలవారీగా మందులకే రూ.10 వేల పైన ఖర్చు చేయవలసి వస్తుందని మనలో ఎంత మందికి తెలుసు? తీర్థయాత్రలకు వెళ్లాలని అనిపిస్తుంది.. మనవళ్లు, మనవరాళ్లకు పండగకో, ఏదైనా శుభకార్యానికి ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలని […]

Share:

రిటైర్మెంట్ తర్వాత ఉండే ఖర్చులేమిటి?

రిటైర్మెంట్‌ తర్వాత పెద్దగా ఖర్చులు ఉండవని.. దాచుకోక పోయినా పర్వాలేదని అనుకోవడం ముమ్మాటికి తప్పు. ఆఫీసుకు వెళ్లకపోవడం ఒక్కటే మార్పు తప్ప.. మిగిలిన విషయాలన్నీ సేమ్‌ టు సేమ్‌. పైగా అనారోగ్య ఖర్చులు అదనం.. కొన్ని కొన్ని కుటుంబాల్లో నెలవారీగా మందులకే రూ.10 వేల పైన ఖర్చు చేయవలసి వస్తుందని మనలో ఎంత మందికి తెలుసు? తీర్థయాత్రలకు వెళ్లాలని అనిపిస్తుంది.. మనవళ్లు, మనవరాళ్లకు పండగకో, ఏదైనా శుభకార్యానికి ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలని ఉంటుంది. మరి వాటన్నింటికి డబ్బులు ఎక్కడ అని.. ఎలానో ఆలోచించారా? యోగిలా మనం బతకాలని అనుకున్నా.. సమాజం ఊరుకోదు కదా.. అందుకోసమే ముందుగానే మేల్కొనండి.. ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి.. 

కావలసినదెంత?

ప్రస్తుతం మీ వయస్సు 40 ఏళ్లు ఉందని అనుకుందాం. మీరు 60 ఏళ్లకు రిటైర్‌ అవ్వచ్చు. నెలనెలా దాదాపు రూ.40 వేల వరకూ ఖర్చవుతోందని అనుకుందాం. ఇప్పటికే మీ దగ్గర రూ.5 లక్షలు పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 75 ఏళ్ల జీవన ప్రమాణం కూడా ఉంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుందాం. 6.5 శాతం వరకూ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వీటన్నింటినీ లెక్కించి చూసుకుంటే.. 2042 నాటికి మీకు కావలసిన కార్పస్‌ రూ.1.8 కోట్లు. మీ దగ్గర ఇప్పటికే ఉన్న రూ.5 లక్షలు కాస్తా రూ.34 లక్షలు అవుతుందని అనుకున్నా కూడా 20 ఏళ్ల తర్వాత మనకు ఇంకా రూ.1.5 కోట్లు కావాల్సి ఉంటుంది. మనం ఈ లక్ష్యం చేరుకోవాలంటే ఇప్పటి నుంచే నెలనెలా కనీసం రూ.13,800 పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఏడాదికి కనీసం 5 శాతం చొప్పున పెంచుకుంటే పోతేనే మన లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు పిల్లల చదువులు, పెళ్లిళ్ల ప్లానింగ్‌ కాకుండా రిటైర్మెంట్‌ కోసమే మనం ప్రత్యేకంగా చేసుకోవలసిన ప్లానింగ్‌ ఇది.

పెద్దగా ఖర్చులు పెరగకుండా, అది కూడా సింపుల్‌ లైఫ్‌ స్టైల్‌ చాలనుకుంటేనే ఈ మొత్తం సరిపోతుందనే విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే.. మెరుగవుతున్న వైద్యం కారణంగా జీవిత ప్రమాణం పెరుగుతున్నది. అది ఎంతగా పెరిగితే.. మనం అంతగా డబ్బులను పోగు చేసుకోవాల్సి ఉంటుంది. ముప్ఫై ఏళ్లకు మనం ఉద్యోగంలో చేరితే.. ముప్పై ఏళ్ల పాటు సంపాదించినా.. మరో 20 ఏళ్ల పాటు కనీసం దాన్ని కూర్చుని కరిగించేంతగా ఉండేలా డబ్బులు ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

సురక్షితమైన భవిష్యత్తు కోసం, అనుకోని అవసరాలకు అప్పులపాలయ్యే ముప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రజలు డబ్బును దాచుకుంటారు. ప్రస్తుతం చాలా రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. ఇలాంటి ప్రయోజనాలతో కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ సిస్టమ్‌ అయిన నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఇండియన్‌ సిటిజన్స్‌కు ప్రణాళికబద్ధంగా పొదుపు చేస్తూ, మెరుగైన రాబడి అందుకునే అవకాశం కల్పించింది.

NPSని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ  నిర్వహిస్తుంది. అయితే దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ ద్వారా ఆకర్షణీయమైన మార్కెట్-లింక్డ్ రిటర్న్‌లను అందిస్తుంది. సబ్‌స్క్రైబర్‌లకు ట్యాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్‌లు కూడా అందిస్తుంది.