లేడీ గాగాపై కేసు ఎందుకు పెట్టారు

లేడీ గాగాపై ఓ ముసలావిడ వింత కేసుకుక్కలు పట్టించినందుకు.. బహుమతి ఇవ్వనందుకంటా ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగాపై ఓ ముసలావిడ ఇటీవల ఓ కేసు పెట్టింది. అయితే ఆ కేసు గురించి వింటే కొంచెం వింతగా ఉంది. జెన్నిఫర్ మెక్‌బ్రైడ్ అనే ఓ వృద్ధురాలు.. ఇటీవల లేడీ గాగాపై ఈ కేసు పెట్టింది. లేడీ గాగా కుక్కలు ఇటీవల ఎవరో దొంగతనం చేశారు. దొంగిలించ బడిన కుక్కలను ఎవరైనా కనుగొంటే బహుమతి ఇస్తానని లేడీ గాగా […]

Share:

లేడీ గాగాపై ఓ ముసలావిడ వింత కేసు
కుక్కలు పట్టించినందుకు.. బహుమతి ఇవ్వనందుకంటా

ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగాపై ఓ ముసలావిడ ఇటీవల ఓ కేసు పెట్టింది. అయితే ఆ కేసు గురించి వింటే కొంచెం వింతగా ఉంది. జెన్నిఫర్ మెక్‌బ్రైడ్ అనే ఓ వృద్ధురాలు.. ఇటీవల లేడీ గాగాపై ఈ కేసు పెట్టింది. లేడీ గాగా కుక్కలు ఇటీవల ఎవరో దొంగతనం చేశారు. దొంగిలించ బడిన కుక్కలను ఎవరైనా కనుగొంటే బహుమతి ఇస్తానని లేడీ గాగా వాగ్దానం చేశారు. దీంతో ఆ ముసలావిడ కుక్కలకు సంబంధించిన సమాచారాన్ని లేడీ గాగాకు అందించారు. అయితే అస్సలు చిక్కు ఇక్కడే వచ్చింది. కనిపెట్టిన వాళ్లకి ఇస్తానన్న మొత్తాన్ని ఆమెకు చెల్లించలేదు. దీంతో లేడీ గాగాపై జెన్నిఫర్ కేసు పెట్టింది. 

తన దొంగిలించబడిన కుక్కలను ఎవరైనా కనుగొంటే భారీ ప్రైజ్ మనీని ఇస్తానన్న లేడీ గాగా 

పాప్ సింగ్ లేడీ గాగా తన కుక్కను కనుగొని వాటిని సురక్షితంగా తన వద్దకు తిరిగి ఇచ్చే వ్యక్తికి 500,000 డాలర్ల భారీ ప్రైజ్ మనీని ఆఫర్ చేసింది. నివేదికల ప్రకారం గాగా యొక్క రెండు కుక్కలు, కోజీ మరియు గుస్తావ్ 2021లో కిడ్నాప్ చేయబడ్డాయి. కుక్క పిల్లలను అపహరణ నుండి రక్షించే ప్రయత్నంలో ఆ కుక్కలను సంరక్షించే వ్యక్తిపై కూడా దొంగలు కాల్పులు జరిపారు. తర్వాత ఈ నేరానికి పాల్పడిన జేమ్స్ హోవార్డ్ జాక్సన్ మరియు జాయిలిన్ వైట్‌గా గుర్తించారు. దీంతో వాళ్లకి.. ఈ నేరానికి పాల్పడినందుకు 21 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అయితే తాను కుక్కలను కనిపెట్టానని చెప్పిన మెక్ బ్రైడ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తానే ఆమె కుక్కలను కనుగొన్నట్లు పోలీసులకు తెలిపింది. కానీ, తరువాత ఆమె నేరస్థులలోని ఒకరి తండ్రితో డేటింగ్ చేసినందున ఆమె నేరంలో భాగమని అనుమానించి అరెస్ట్ చేశారు.

ఇప్పుడు మెక్‌బ్రైడ్‌పై కేసు పెట్టారు

ఆమె క్లెయిమ్ చేసిన రివార్డ్ డబ్బు ఇవ్వనందుకు లేడీ గాగాపై కేసు పెట్టింది. అలాగే ఆమెను తప్పుదోవ పట్టించినందుకు ఈసారి కోర్టు నుండి మూడు రెట్లు మొత్తాన్ని మెక్ బ్రైడ్ క్లెయిమ్ చేసింది. నివేదికల ప్రకారం ఆమె కుక్కలను తిరిగి ఇవ్వడానికి కారణం ఆమెకు తిరిగి డబ్బు వస్తుందని భావించింది. అయితే, ఈమె కూడా దోషులలో ఒకరని భావించి కేసు పెట్టారు.

2021లో లేడీ గాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను చూడండి. లేడీ గాగా తన కుక్కలతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉందని అందులో కనబడుతుంది. కుక్కలు కిడ్నాప్ అవ్వకముందే ఆమె అభిమానులందరికీ వాటి గురించి బాగా తెలుసు. గాగా తన కుక్కల గురించి ఎల్లప్పుడూ అందరి దృష్టిలో పడేలా ఇన్ స్టాలో పోస్టులు చేస్తుంటారు. అది లేడీ గాగా వెళ్లే రెడ్ కార్పెట్ షో అయినా లేదా ఆమెతో మ్యాగజైన్ కోసం కవర్ షూట్ చేసినా అవి కూడా వెళ్లేవి. లేడీ గాగాకు మిస్ ఆసియా, కోజి మరియు గుస్తావో అనే మూడు కుక్కలు ఉన్నాయి. కోజీ జనవరి 14, 2015న జన్మించింది. కోజీ ఏప్రిల్ 2015 నుండి గాగాతోనే ఉంది. 2016లో జన్మించిన గుస్తావోను కూడా పెంచుకుంటున్నారు. మిస్ ఆసియా ఫిబ్రవరి 1, 2014న జన్మించింది. 7 సంవత్సరాల నుంచి తనతో ఉంటుంది. కోజీ, గుస్తావోను కిడ్నాప్ చేయగా.. ఆసియా మాత్రం కిడ్నాప్ కాలేదు. గాగా కుక్కలు 2015లో హార్పర్స్ బజార్ కవర్‌తో సహా మ్యాగజైన్ షూట్‌లకు ఆమెతో పాటు వెళ్లాయి.