Work: వారానికి 70 గంటల వర్క్ సాధ్యమేనా?

పోటీ పడుతున్న దేశాలలో భారతదేశం (India) వెనకబడకూడదు అనుకుంటే తప్పకుండా ఎక్కువ సమయం శ్రమించక తప్పదు అంటున్నారు నారాయణమూర్తి (Narayana Murthy). ఇటీవల జరిగిన ఒక డిబేట్ ప్రకారం సుమారు వారానికి 70 గంటల గంటలు శ్రమిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం అంటున్నారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Narayana Murthy). అయితే ఇప్పటివరకు చాలామంది సీఈవో (CEO)లు తమ ఎంప్లాయిస్ ని ఈ విధంగా ఎక్కువ సమయం పని (Work) చేయాలని చెప్పుకొచ్చిన చరిత్ర ఎంతో ఉంది.  వారంలో […]

Share:

పోటీ పడుతున్న దేశాలలో భారతదేశం (India) వెనకబడకూడదు అనుకుంటే తప్పకుండా ఎక్కువ సమయం శ్రమించక తప్పదు అంటున్నారు నారాయణమూర్తి (Narayana Murthy). ఇటీవల జరిగిన ఒక డిబేట్ ప్రకారం సుమారు వారానికి 70 గంటల గంటలు శ్రమిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం అంటున్నారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Narayana Murthy). అయితే ఇప్పటివరకు చాలామంది సీఈవో (CEO)లు తమ ఎంప్లాయిస్ ని ఈ విధంగా ఎక్కువ సమయం పని (Work) చేయాలని చెప్పుకొచ్చిన చరిత్ర ఎంతో ఉంది. 

వారంలో 70 గంటల పని: 

ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి వారంలో 70 గంటల పని (Work)ని సమర్ధించడంతో, ఆన్‌లైన్‌లో భారీ చర్చకు దారితీసింది. పోడ్‌కాస్ట్‌లో నారాయణ మూర్తి మాట్లాడుతూ, భారతదేశం (India) వైపు నుంచి పని (Work) ఉత్పాదకత ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని, భారతదేశం (India) ప్రపంచ వేదికపై సమర్థవంతంగా పోటీపడేలా సంస్కృతిని నిర్మించడంలో యువత సహకారం అందించాలని కోరారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పొడిగించిన పని (Work) గంటలను అమలు చేసిన రెండు దేశాలు జపాన్ మరియు జర్మనీ. 

మహమ్మారి కరోనా సమయం అనంతరం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి భారతీయులు రాబోయే రెండు మూడు సంవత్సరాల పాటు వారానికి 60 గంటలు పని (Work) చేయాలని నారాయణ మూర్తి (Narayana Murthy) 2020లో నిపుణులకు ఇదే విధమైన పిలుపు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం, అలీబాబాను స్థాపించిన జాక్ మా (Jack Ma), చైనా దేశానికి సంబంధించి టెక్ పరిశ్రమలో వివాదాస్పదమైన “996” నియమాన్ని ఆమోదించారు, ఎక్కువ గంటలు పని (Work)చేసిన ఉద్యోగులు (Employees) శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా పొందుతారు అని ఒక బ్లాగ్ పోస్ట్‌లో చెప్పారు.

వారానికి ఆరు రోజులు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు పని (Work) చేయడానికి కంపెనీ (Company) పిలుపునిచ్చింది. దేశంలోని పెద్ద టెక్నాలజీ కంపెనీ (Company)లు మరియు స్టార్ట్-అప్‌లలో ఇది సాధారణం అని చెప్పుకొచ్చాయి కూడా. అయితే సీఈవో (CEO) చేసిన వాక్యాలు, అప్పట్లో చైనా సోషల్ మీడియా వినియోగదారుల నుండి విమర్శలను ప్రేరేపించాయి. వివాదాస్పద పాలన కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, సమయం లేకపోవడం వల్ల ఎవరికీ పిల్లలు ఉండరని ఉద్యోగాలు ఆందోళన చెందారు.

ప్రతికూల స్పందనలు కూడా వినిపించాయి: 

గ్రూప్ CHRO, ఎక్స్‌పెరియన్ డెవలపర్స్ దేబ్‌శంకర్ బెనర్జీ (Debshankar Banerjee)మన వైపు నుంచి వాదనను వినిపించారు. నిజానికి తమ ఉద్యోగుల శ్రేయస్సు మరియు పని (Work)-జీవిత సమతుల్యత తమకు చాలా అవసరం అని అన్నారు. ఆధునిక కంపెనీలకు సంబంధించి డిమాండ్‌లను తాము నిజానికి అర్థం చేసుకున్నామని, అయితే 70-గంటల పని (Work) వారానికి సంబంధించిన ఆలోచన అనేది ఎక్కువ కాలం నిలుస్తుందా అనే అంశం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వివరించారు. క్లిష్టమైన సమయాల్లో ఎక్కువ సమయం పని (Work) చేయడం అనేది అవసరమవుతాయని తాము గుర్తించినప్పటికీ, తమ టీంకి  సంబంధించి ఆరోగ్యం (Health) మరియు ఆనందాన్ని త్యాగం చేయకుండా.. సమర్థవంతంగా తమ టార్గెట్స్ పూర్తి చేసే విధానానికి విలువనిచ్చే సంస్కృతిని పెంపొందించడంలో ఉన్న ప్రాముఖ్యతను తాము మరింత విశ్వసిస్తున్నామని వెల్లడించారు. 

ఈ కాన్సెప్ట్ కేవలం పని (Work)లో గడిపిన గంటల సంఖ్యను ట్రాక్ చేయడానికి మించి ఉంటుంది. rekrut HR ఆటోమేషన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ రవీందర్ గోయల్ (Dr Ravinder Goyal), వారానికి 70 గంటల వర్క్ విషయం గురించి మాట్లాడుతూ, నిజానికి తయారీ యూనిట్లలో ఓవర్‌టైమ్ అనేది పద్ధతిగా మారిందని.. అయితే ఎక్కువ గంటలు పని (Work) చేయడం అనే కాన్సెప్ట్ వచ్చినప్పటికీ.. ఇందులో ఎటువంటి స్ట్రిక్ట్ రూల్స్.. తప్పనిసరిగా చేయాలి అనే ఒత్తిడి వంటి అంశాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
9 AM నుండి 9 PM పని (Work) షెడ్యూల్‌ను నిర్ణయించే బదులు, 12 గంటల పని (Work) వ్యవధిని సమర్థవంతంగా నిర్వహించడం వైపు దృష్టి మళ్లించాలని.. వర్క్ కు సంబంధించిన అవుట్ పుట్ అనేది నిజానికి కేవలం గంటల సంఖ్యను బట్టి నిర్ణయించబడదని, ఆ సమయ వ్యవధిలో నాణ్యత, ప్రొడక్టివిటీ బట్టి నిర్ణయించబడుతుందని గుర్తు చేశారు రవీందర్ గోయల్ (Dr Ravinder Goyal).