సెబీ విచారణ దర్యాప్తును మేము స్వాగతిస్తామన్న అదానీ గ్రూప్

హిండెన్ బర్గ్ రీసర్చ్ వ్యవహారం వల్ల అదానీ గ్రూప్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో విపక్షాలు సహా సుప్రీంకోర్టు సైతం ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. దీని పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సైతం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తన విచారణను పూర్తి చేయడానికి ఆరు నెలల పొడిగింపును కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో తాజాగా ఓ దరఖాస్తును దాఖలు […]

Share:

హిండెన్ బర్గ్ రీసర్చ్ వ్యవహారం వల్ల అదానీ గ్రూప్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో విపక్షాలు సహా సుప్రీంకోర్టు సైతం ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. దీని పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని సైతం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తన విచారణను పూర్తి చేయడానికి ఆరు నెలల పొడిగింపును కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో తాజాగా ఓ దరఖాస్తును దాఖలు చేసింది. సమీకరించిన ఫలితాలను ధ్రువీకరించుకోవడానికి దర్యాప్తును ముగించడానికి మరింత సమయం పడుతుందని అందులో తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదికలోని ఆరోపణల నిర్ధారణకు కనీసం 15 నెలల సమయం పడుతుందని కానీ, ఆరు నెలల్లోగా పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

అదానీ  హిండెన్ బర్గ్ విషయంలో పలు ప్రజా ప్రయోజన పిటిషన్లు సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆరోపణలపై మార్కెట్ నియంత్రణ సంస్థ చేయడానికి మార్చి 2న ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లోగా విచారణను త్వరితగతిన ముగించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కోరింది. కాగా హిండెన్ బర్గ్ నివేదిక ప్రచురణకు ముందు నుంచి అదానీ గ్రూపునకు సంబంధించిన వ్యవహారాన్ని లోతుగా పరిశీలించడంలో ఇంకొంత సమయం కావాలని ఈరోజు సెబీ కోరింది. నివేదికలోని ఆరోపణలు సంక్లిష్టంగా ఉన్నాయని అనేక ఉప లావాదేవీలు సైతం కనుగొన్నట్లు సెబీ తన అభ్యర్థనలో తెలిపింది. మరింత కఠినమైన దర్యాప్తు కోసం ఆయా కంపెనీలు సమర్పించిన పత్రాల ధ్రువీకరణతో సహా వివరణాత్మక విశ్లేషణ చేయాలని తెలిపింది. ఇందుకోసం వివిధ మూలాల నుంచి డేటా సమాచారాన్ని క్రోడీకరించడం అవసరం అని విన్నవించుకుంది. విదేశాలు అంతర్జాతీయ బ్యాంకుల స్టేట్మెంట్ సైతం పొందాల్సిన అవసరం ఉందని తెలిపింది. తన మధ్యంతర ఫలితాలను ఇప్పటికే నిపుణుల కమిటీకి సమర్పించినట్లు వెల్లడించింది.

ఇదిలావుండగా, అదానీ గ్రూప్ దర్యాప్తులో తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని మాట ఇచ్చింది. “అందరి సమస్యలనూ విని, అన్నిటినీ పరిష్కరించే న్యాయమైన అవకాశాన్ని సూచించే దర్యాప్తు మాకు సమ్మతమే. మేము అన్ని చట్టాలు, నియమాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాము, ఎప్పటికైనా నిజం గెలుస్తుందని నమ్మకంగా ఉన్నాము. మేము SEBIకి పూర్తిగా సహకరిస్తున్నాము. మా మద్దతును, సహకారాన్ని అందిస్తూనే ఉంటాం’’ అని అదానీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు.

ఒక అనుబంధ సంస్థలతో పాటు ఏడు లిస్టెడ్ అదానీ కంపెనీలు స్కానర్‌లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్‌తో సహా పత్రాలు సమాచారాన్ని సమర్పించాలని కోరింది. 

“ఈ విషయం యొక్క సంక్లిష్టత దృష్ట్యా, సాధారణంగా ఈ లావాదేవీల దర్యాప్తును సెబీ పూర్తి చేయడానికి కనీసం 15 నెలల సమయం పడుతుంది, అయితే ఆరు నెలల్లోగా దానిని ముగించడానికి సహేతుకమైన ప్రయత్నాలన్నింటినీ చేస్తోంది” అని SEBI తెలిపింది. 

US- ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ యొక్క నివేదిక నుండి తలెత్తిన వివాదం మధ్య కోర్టు మార్చి 2 న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది, అదానీ గ్రూప్ పన్ను స్వర్గధామాలలో కంపెనీల నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఆదాయాన్ని, స్టాక్ ధరలను పెంచడానికి ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్  ఖండించింది.సెబీ నిబంధనలలోని సెక్షన్ 19ని ఉల్లంఘించి, స్టాక్ ధరలను అదానీ గ్రూప్ ఏదైనా తారుమారు చేసిందా అనే దానిపై దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.