పెట్టుబడుల్లో వారెన్ బఫ్ఫెట్ చేసిన అతిపెద్ద తప్పులు

వారెన్ బఫెట్ ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరు. వారెన్ బఫెట్ పేరు వినని ఏ పెట్టుబడిదారుడు మార్కెట్లో డబ్బును పెట్టుబడిగా పెట్టడు. అతని స్ఫూర్తితో గుజరాత్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ జున్‌జున్‌వాలాను భారతదేశ వారెన్ బఫెట్ అని పిలుస్తారు. బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నారు. వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు, వీరి గురించి ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లు మరియు ట్రెండింగ్ […]

Share:

వారెన్ బఫెట్ ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరు. వారెన్ బఫెట్ పేరు వినని ఏ పెట్టుబడిదారుడు మార్కెట్లో డబ్బును పెట్టుబడిగా పెట్టడు. అతని స్ఫూర్తితో గుజరాత్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ జున్‌జున్‌వాలాను భారతదేశ వారెన్ బఫెట్ అని పిలుస్తారు. బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆరవ స్థానంలో ఉన్నారు.

వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు, వీరి గురించి ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లు మరియు ట్రెండింగ్ వార్తలు వస్తూనే ఉంటాయి. వారెన్ బఫెట్ కూడా చాలా తప్పులు చేశాడని మీకు తెలుసా? అదే విధంగా ఈ తప్పుల నుండి నేర్చుకుని, అతను స్టాక్ మార్కెట్‌లో ఉన్నత స్థాయి విజయాన్ని సాధించాడు.

స్టాక్ మార్కెట్ హీరో వారెన్ బఫెట్ కోకాకోలా, యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మూడీస్, క్రాఫ్ట్ హీంజ్ వంటి కంపెనీలలో విజయవంతమైన పెట్టుబడుల గురించి మనందరికీ తెలిసిందే.

యూఎస్ స్టాక్ మార్కెట్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అతని అత్యుత్తమ పెట్టుబడి మేధస్సు మరియు అనుభవం ఆధారంగా అత్యంత ప్రజాదరణ పొందిన, విజయవంతమైన పెట్టుబడిదారుగా మారారు.

వారెన్ బఫ్ఫెట్ చేసిన తప్పులు

వారెన్ బఫ్ఫెట్ 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర విలువతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన, విజయవంతమైన పెట్టుబడిదారులలో ఒకరు. కానీ వారెన్ బఫెట్ ఒక తెలివైన పెట్టుబడిదారుడే కాకుండా ఇతరుల తప్పుల నుండి త్వరగా నేర్చుకునే వ్యక్తి కూడా.

వారు ఎల్లప్పుడూ వారి స్వంత, ఇతరుల తప్పుల నుండి నేర్చుకొని మరియు మార్కెట్లో అనుభవం ఆధారంగా వాటిని ఉపయోగించుకొని, విజయవంతంగా పెట్టుబడులు పెడతారు.

వారెన్ బఫ్ఫెట్ యొక్క కొన్ని ముఖ్యమైన తప్పుల గురించి మనం తెలుసుకుందాం, వారి తప్పుల నుండి మనమందరం ఏదైనా నేర్చుకొని.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి విజయవంతం కావచ్చు.

డెక్స్టర్ షూ కంపనీ

1993లో వారెన్ బఫెట్ డెక్స్టర్ షూ కంపెనీని కొనుగోలు చేశాడు. బఫెట్ దీనిని అత్యంత చెత్త ఒప్పందంగా అభివర్ణించాడు. బఫ్ఫెట్ డెక్స్టర్ షూ కంపెనీని కొనుగోలు చేయడంలో ఒకటి కంటే ఎక్కువ తప్పులు చేశాడు. డెక్స్టర్ షూ కంపెనీ అవకాశాలను తప్పుగా లెక్కించి, అనుకున్నదానికంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు.

ఇంకా.. అతను డెక్స్టర్ షూ కంపెనీని నగదుతో కొనుగోలు చేయలేదు, బదులుగా 433 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే స్టాక్‌ను ఉపయోగించాడు.

టెస్కో

టెస్కో అనేది యూకే ఆధారిత కంపెనీ. 2012 నాటికి బెర్క్‌షైర్ హాత్వే టెస్కోలో 5 శాతం పైగా షేర్ కలిగి ఉంది.

2013 నాటికి టెస్కోలో ఏదో తప్పు జరిగింది. తరువాతి కొన్ని నెలల్లో టెస్కో షేర్ ధర క్షీణించడం కొనసాగింది. దీంతో పాటు దాని షేర్లు దాదాపు 50% పైగా పడిపోయాయి. ఈ సమయంలో అకౌంటింగ్ కుంభకోణం కూడా జరిగింది. ఈ కారణంగా కంపెనీని యూకే ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు దర్యాప్తు చేసారు.

వారెన్ బఫెట్ చేసిన పొరపాటు ఏమిటంటే.. అతను టెస్కో షేర్లను అమ్మడంలో ఆలస్యం చేశాడు. ఫలితంగా బెర్క్‌షైర్ సుమారు US 445 మిలియన్ డాలర్లను కోల్పోయింది.

ఎనర్జీ ఫ్యూచర్ హోల్డింగ్స్

వారెన్ బఫెట్ ఎనర్జీ ఫ్యూచర్ హోల్డింగ్స్ కార్పొరేషన్ యొక్క బాండ్లలో US 2.1 బిలియన్ డాలర్లను కొనుగోలు చేశాడు. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లపై ఆధారపడింది.

సహజ వాయువు ధరలు పెరుగుతాయని 2007లో బఫ్ఫెట్ తన అధిక-దిగుబడి బాండ్ కొనుగోళ్లను చేసాడు. అయితే సహజ వాయువు ధరలు 2007 స్థాయిల నుండి పడిపోయాయి.

దీని ఫలితంగా ఎనర్జీ ఫ్యూచర్ హోల్డింగ్స్ కార్పొరేషన్‌కు భారీ నష్టాలు వచ్చాయి. చివరికి 2014లో కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించింది.

చివరగా.. వారెన్ బఫెట్ యొక్క బెర్క్‌షైర్ హాత్వే 2013లో $2.1 బిలియన్ల విలువైన బాండ్లను కేవలం 873 మిలియన్ డాలర్ల నష్టానికి అమ్మాల్సి వచ్చింది.