ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా!

మీ ఆధార్ కార్డు లోని ఫోన్ నెంబర్ ని మార్చుకోవాలి అనుకుంటే కొన్ని సూచనలను అనుసరిస్తే చాలు మీ ఆధార్ కార్డు లోని ఫోన్ నెంబర్ ని మార్చుకోవచ్చు. ఆధార్ కార్డ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింద. దేశంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల ప్రతి మనిషి యొక్క చిరునామా మరియు వారి పర్సనల్ స్టేటస్ ని గుర్తించవచ్చు. ఆధార్ కార్డ్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఏదైనా […]

Share:

మీ ఆధార్ కార్డు లోని ఫోన్ నెంబర్ ని మార్చుకోవాలి అనుకుంటే కొన్ని సూచనలను అనుసరిస్తే చాలు మీ ఆధార్ కార్డు లోని ఫోన్ నెంబర్ ని మార్చుకోవచ్చు.

ఆధార్ కార్డ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింద. దేశంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల ప్రతి మనిషి యొక్క చిరునామా మరియు వారి పర్సనల్ స్టేటస్ ని గుర్తించవచ్చు. ఆధార్ కార్డ్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఏదైనా ఐడెంటిఫికేషన్ చూపించాలి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి. మన దేశంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం ఎటువంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలను వాటి సేవలను వినియోగించుకున్నప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్తుంది.

మన ఆధార్ కార్డు తో మన మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించి మన ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవచ్చు.

మీరు చేయవలసిందల్లా మీ దగ్గరలో ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం   యూనిక్ ఐడెంటిఫికేషన్ అత్తరిటి ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోని లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్ అన్న ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి మీరు మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ను సంప్రదించవచ్చు.

మీ మొబైల్ నెంబర్ ఏ కాక మీ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ని కూడా ఆధార్ లో జత చేయొచ్చని తెలిపింది. మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యాజమాన్యం మనకు సహకరించి ఏ విధంగా మనం ఆధార్ నెంబర్ మరియు మన డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ను అప్డేట్ చెయ్యాలో చెప్తారు. 

మన ముందుగా ఫారం నింపి ఇవ్వాలి . తర్వాత అక్కడ యాజమాన్యం ఫోన్ నెంబరు లేదా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు సంబంధించిన డాక్యుమెంట్లను మరియు ఇతర పత్రాలు జతపరచి ఇవ్వమని అడుగుతారు. అప్పుడు మనం వాటికి సంబంధించిన వారికి అందజేసినట్లయితే వారు మిగతా ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు.

మనం పత్రాలను ఫామ్ ను ఆధార్ ఎగ్జిక్యూటివ్ కి అందజేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అదే  పేమెంట్. ఈ ప్రాసెస్ లో మనం 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని పూర్తిగా ఆధార ఎగ్జిక్యూటివ్ మనకి వివరించి వారు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు.

ఆ తర్వాత మనం ఏదైతే మొబైల్ నెంబర్ వారంలో జత చేస్తాము ఆ నెంబర్ కి ఓటిపి వస్తది దాన్నే అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ అని కూడా చెప్తారు. ఆ ఓటీపీ మన ఆధార్ ఎగ్జిక్యూటివ్ కి తెలియపరిచిన తర్వాత మనం ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మరియు ఇతర వివరాలను సరి చేసుకునే పద్ధతి లేదా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది.

ఈ పద్ధతులు అన్ని అనుసరించిన తర్వాత మనకి ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది అది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లేదా మనం ఆ తాలూకు వెబ్సైట్లోకి వెళ్లి మన ఆధార్ కార్డు అప్డేట్ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు.

మన ఆధార్ కార్డు అప్డేట్ సెండ్ చేసిన తర్వాత 90 రోజుల్లో మన ఫోన్ నెంబర్ అప్డేట్ అవుతుందని చెప్తుంది. మన ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యే వరకు పాత ఫోన్ నెంబర్ ని మనం వినియోగించవచ్చును.