ఎయిర్ ఇండియాతో విలీనం కానున్న విస్తారా

విషయాన్నీ కన్ఫర్మ్  చేసిన  విస్తారా సీఈఓ  భారతదేశానికి చెందిన విస్తారా ఇప్పుడు తన సిబ్బందిని ఎయిర్ ఇండియాతో కలిసి పని చేసే ప్రక్రియలో ఉందని ఎయిర్‌లైన్స్ చీఫ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి పనిచేసే విస్తారాకి, ఏప్రిల్ 2024 నాటికి రెగ్యులేటరీ అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. సీఈవో మాటల్లో:  విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ, అయితే ప్రస్తుతం విస్తారా సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతే […]

Share:

విషయాన్నీ కన్ఫర్మ్  చేసిన  విస్తారా సీఈఓ 

భారతదేశానికి చెందిన విస్తారా ఇప్పుడు తన సిబ్బందిని ఎయిర్ ఇండియాతో కలిసి పని చేసే ప్రక్రియలో ఉందని ఎయిర్‌లైన్స్ చీఫ్ వెల్లడించారు. ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి పనిచేసే విస్తారాకి, ఏప్రిల్ 2024 నాటికి రెగ్యులేటరీ అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు.

సీఈవో మాటల్లో: 

విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ, అయితే ప్రస్తుతం విస్తారా సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బందితో కలిసి పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా కలిసి పని చేయడం అనేది 2020 నాటికి రెగ్యులేట్ అవుతుందని చెప్పారు.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) నుండి రెగ్యులేటరీ అనుమతులు పొందేందుకు, ఇప్పుడు విస్తారా ఎయిర్‌లైన్ ఎదురుచూస్తోంది అని కన్నన్ సోమవారం తెలిపారు. 

ఇటీవల సంబరాలు జరుపుకున్న విస్తారా: 

విస్తారా ఎయిర్ లైన్స్ అనేది ప్రారంభించినప్పటి నుండి, 50 మిలియన్ల మంది ప్రయాణికులు తమ ఎయిర్ లైన్స్ ఉపయోగించుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సెలబ్రేషన్ నిజంగా ఒక కొత్త మైలు రాయికి పునాది అని, ఎయిర్ లైన్స్ చెప్పుకొచ్చింది.

ఎయిర్‌లైన్ తన 50 మిలియన్ల కస్టమర్‌కు ఎంతో అద్భుతమైన సౌకర్యాలతో మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇందులో లగ్జరీ, పిక్-అప్ మరియు డ్రాప్ సర్వీస్, బిజినెస్ క్లాస్‌కి ఆశ్చర్యకరమైన క్యాబిన్ అప్‌గ్రేడ్ మరియు క్లబ్ విస్తారా లాయల్టీ ప్రోగ్రామ్ కోసం కాంప్లిమెంటరీ గోల్డ్ టైర్ మెంబర్‌షిప్ ఇవ్వడం ఇలా ఎన్నో సౌకర్యాలు విస్తార ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.

మరో కొత్త సవాలు: 

గత ఏడాది టాటా గ్రూప్ టేకోవర్ చేసి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్ ఇండియాకు, ఇది కొత్త సవాలు అని చెప్పుకోవాలి. భారతీయ విమానయాన సంస్థ తన విమానాలు, అలాగే వర్కింగ్ సిస్టం, అంతేకాకుండా ఆదాయ నిర్వహణను ఆధునీకరించడానికి ఇప్పుడు ప్రత్యేకమైన కొత్త పద్ధతులను పాటిస్తోంది.

ఇప్పుడున్న బిజినెస్ అనేది క్రమబద్ధీకరించే ప్రయత్నంలో, నవంబర్‌లో టాటా తన రెండు ఫుల్ సర్వీస్ క్యారియర్‌లను, ఎయిర్ ఇండియా మరియు విస్తారాలతో పాటుగా విలీనం చేసి ఒక పెద్ద ఎయిర్‌లైన్‌ను సృష్టిస్తున్నట్లు ప్రకటించినట్లు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇండిగో వంటి స్థానికంగా ఉండే ఎయిర్ లైన్స్ తో పోటీ పడడానికి ఒక గొప్ప అవకాశం. అంతేకాకుండా ఇప్పుడు ఎయిర్లైన్స్ విలీనం అనేది మిగిలిన స్థానిక ఎయిర్లైన్స్ అన్నిటికీ ఒక సవాలుగా మారింది.

విస్తారా అనేది టాటా మరియు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్. నవంబర్ 2022లో, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ (SIA) టాటా సన్స్‌తో తన విస్తారా ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్ జాయింట్ వెంచర్‌ను భారతదేశ జాతీయ ఎయిర్ లైన్స్ తో పాటు పని చేస్తూ, మరి ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియాకు 25.1 శాతం భాగస్వామ్యం కూడా లభిస్తుందని పేర్కొంది. 

ప్రయాణికులు కోరుకునేది సౌకర్యం: 

అయితే ప్రస్తుతం భారత దేశంలో నేషనల్, ఇంటర్నేషనల్కి సంబంధించిన ఎన్నో ఎయిర్లైన్స్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి ప్రయాణికులు కోరుకునేది సౌకర్యవంతమైన ప్రయాణం. అంతేకాకుండా, ఫ్లైట్ ఎక్కిన దగ్గర్నుంచి దిగేంతవరకు మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైన అనుభవాన్ని ప్రయాణికులు కోరుకుంటారు. ఇప్పుడున్న ఎయిర్ లైన్స్ కూడా ఇలాంటి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ ప్రయాణికులను ఆకర్షించే అవకాశాన్ని అస్సలు వదులుకోవటం లేదు.