తోటి షార్క్ ల నుండి 5 కోట్ల రూపాయల డీల్ పొందిన వినీతా సింగ్

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 ముగిసింది! అవును, వివిధ రంగాలకు చెందిన వ్యవస్థాపకులు తమ వ్యాపార ఆలోచనలను షార్క్ లకు అందించి, వారి నుండి నిధులు పొందే ప్రముఖ రియాలిటీ షో. షార్క్స్‌లో వినీతా సింగ్, పీయూష్ బన్సల్, నమితా థాపర్, అమన్ గుప్తా, అమిత్ జైన్ మరియు అనుపమ్ మిట్టల్ ఉన్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 ముగింపు ఎపిసోడ్‌లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. వినీతా సింగ్ మరియు ఆమె భర్త […]

Share:

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 ముగిసింది! అవును, వివిధ రంగాలకు చెందిన వ్యవస్థాపకులు తమ వ్యాపార ఆలోచనలను షార్క్ లకు అందించి, వారి నుండి నిధులు పొందే ప్రముఖ రియాలిటీ షో. షార్క్స్‌లో వినీతా సింగ్, పీయూష్ బన్సల్, నమితా థాపర్, అమన్ గుప్తా, అమిత్ జైన్ మరియు అనుపమ్ మిట్టల్ ఉన్నారు.

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2 ముగింపు ఎపిసోడ్‌లో ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. వినీతా సింగ్ మరియు ఆమె భర్త కౌశిక్ ముఖర్జీ  హైలైట్ అయ్యారు. అటు ఇతర షార్క్‌లకు తమ బ్రాండ్‌ను పరిచయం చేశారు. ఆమె షుగర్ కాస్మెటిక్స్‌ను ఎలా ప్రారంభించి, దానిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిందో, తన ప్రయాణం గురించి వివరాలను కూడా పంచుకుంది. మొత్తం ఐదు షార్క్‌ల నుండి 5 కోట్ల కలల ఒప్పందాన్ని కూడా ఆ వ్యవస్థాపకులు పొందారు.

వేదికపైకి వచ్చిన కౌశిక్ మాట్లాడుతూ.. 2016 నుండి తన వ్యాపార భాగస్వామి అయిన వినీతా సింగ్‌ను.. తనతో పాటు వచ్చి షార్క్‌లకు తన బ్రాండ్‌ను తెలియజేయమని కోరాడు.అటు  2% ఈక్విటీ కోసం 1 కోటి పెట్టుబడి పెట్టాలని ఆయన కోరారు.

మార్చి 10న టెలికాస్ట్ అయిన ఆ ఎపిసోడ్‌లో.. వినీతా మరియు కౌశిక్ షుగర్ కాస్మటిక్స్ పిచ్ చేస్తున్నప్పుడు, పీయూష్, “కనికరం ఆశించవద్దు” అని నవ్వుతూ అన్నాడు.

మరో షార్క్ అమన్.. వ్యాపారవేత్తలను బ్రాండ్ పేరు గురించి అడిగినప్పుడు, వారు ఇలా సమాధానమిచ్చారు, “ప్రారంభంలో, మేము దీనికి కికాస్ కాస్మటిక్స్ అని పేరు పెట్టాలనుకున్నాము. అయితే, తర్వాత.. షుగర్ అనే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం” అని అంటారు. ఇక వినీతా కూడా తన ప్రోడక్ట్ లను షార్క్‌లకు చూపించింది.

ఇంకా, అమన్ పెట్టుబడి రౌండ్ గురించి అడిగాడు. 2013లో తనకు పెట్టుబడి వచ్చిందని, ఆ తర్వాత ఈ వ్యాపారంలో దంపతులు ఇబ్బందులు పడవచ్చని..  చాలామంది భావించడంతో తనకు ఎలాంటి నిధులు రాలేదని వినీతా వెల్లడించింది. మరోవైపు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నందుకు..  అనుపమ్ దంపతులను ప్రశంసించారు, మరియు షార్క్ ట్యాంక్ ఇండియా షోలో వినీతా త్వరలో షార్క్‌గా సీటు పంచుకోనుందని జోక్  చేశారు.

లాభం మరియు నష్టాలపై తీవ్రమైన చర్చ జరిగిన  తర్వాత, వినీత షార్క్‌లందరితో 5% ఈక్విటీకి 5 కోట్ల డీల్‌ని ఖరారు చేసింది. షుగర్ కాస్మటిక్స్ 2015లో డీ2సీ (డైరెక్ట్-టు-కన్స్యూమర్) బ్రాండ్‌గా ప్రారంభమైంది మరియు 2017 సంవత్సరంలో కంపెనీ ఆఫ్‌లైన్ వ్యాపారంలోకి ప్రవేశించింది.

గత సంవత్సరం, సెప్టెంబర్ 2022లో.. నటుడు రణ్‌వీర్ సింగ్ షుగర్ కాస్మటిక్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఇది స్టార్టప్ కోసం సిరీస్ డీ ఫండింగ్ రౌండ్. అయితే, స్టార్టప్ ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది అనే విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు. షుగర్ కాస్మటిక్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ఉంది, దీని కారణంగా ఇది ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీని ఇవ్వగలదు. షుగర్ కాస్మటిక్స్ ప్రస్తుతం 550 నగరాల్లో 45,000 కంటే ఎక్కువ రిటైల్ స్టోర్లలో ఉంది.

చివరగా షార్క్‌లందరూ వినీతాకు 5 శాతం ఈక్విటీ కోసం రూ. 5 కోట్ల డీల్‌ను అందించారు. షార్క్ ట్యాంక్ ఇండియా 2కి అనుపమ్ మిట్టల్ (Shaadi.com – పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ), అమన్ గుప్తా (BOAT యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు సీఎమ్ఓ), పీయూష్ బన్సల్ (Lenskart.com వ్యవస్థాపకుడు మరియు సీఈఓ) మరియు నమితా థాపర్ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు.