కోటక్ మహేంద్ర బ్యాంక్ ఫౌండర్ కీలక నిర్ణయం

కోటక్ మహేంద్ర బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. తను ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ అదే విధంగా సీఈవో విధుల నుంచి రిజైన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా తాను నిరంతరం చేసిన కృషికి, అతని సుప్రసిద్ధ కెరీర్‌కు ముగింపు పలికారు ఉదయ్ కోటక్. అయితే, ఉదయ్ కోటక్ బ్యాంక్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.  క్రికెటర్ గా మొదలైన ఉదయ్ కోటక్ జర్నీ:  అతను ముంబైలో పుట్టి పెరిగాడు. […]

Share:

కోటక్ మహేంద్ర బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. తను ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ అదే విధంగా సీఈవో విధుల నుంచి రిజైన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా తాను నిరంతరం చేసిన కృషికి, అతని సుప్రసిద్ధ కెరీర్‌కు ముగింపు పలికారు ఉదయ్ కోటక్. అయితే, ఉదయ్ కోటక్ బ్యాంక్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. 

క్రికెటర్ గా మొదలైన ఉదయ్ కోటక్ జర్నీ: 

అతను ముంబైలో పుట్టి పెరిగాడు. జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ మరియు సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో విద్యను పూర్తి చేశాడు. అతని కుటుంబం పత్తి మరియు ఇతర వ్యవసాయ వస్తువుల వ్యాపారంలో ఉన్నప్పటికీ, అతను తన కుటుంబ వ్యాపారంలో చేరడానికి ఆసక్తి చూపలేదు. 

నిజానికి1970లో, అతను క్రికెటర్‌గా ఎదగాలని ఎన్నో కలలు కన్నాడు, అంతేకాకుండా అతను లెజెండరీ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే అతనికి అనుకోకుండా తగిలిన గాయం కారణంగా అతని క్రికెట్ కల మధ్యలోనే ముగిసిపోవడంతో.. ఫైనాన్స్ రంగంలో ఆయనకున్న ఆసక్తి, ఫైనాన్స్ రంగం వైపుకు అడుగులు వేసేలా చేస్తుంది. 

నవ్‌సారి బిల్డింగ్ ప్రాంగణంలో 300 చదరపు అడుగుల స్థలాన్ని ఆఫీస్ పెట్టేందుకు గాను, కొటక్ తండ్రి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉదయ్ కోటక్ ని ఒప్పించాడు తన తండ్రి. కోటక్ తన 23 సంవత్సరాల వయస్సులో, 1982లో, తన తండ్రి తనకోసం ఏర్పాటు చేస్తున్న 300 చదరపు అడుగుల ఆఫీసు స్థలంలో తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. తరువాతి కొన్ని సంవత్సరాలలోనే, కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని వివిధ రంగాలలోకి విస్తరించుకున్నాడు, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మరియు కారు ఫైనాన్స్.

64 ఏళ్ల భారతదేశపు అత్యంత సంపన్నమైన బ్యాంకర్ 1985లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను స్థాపించారు. Kotak స్థాపించిన బ్యాంక్‌కు 2003లో బ్యాంకింగ్ లైసెన్స్ రావడం జరిగింది. అతను మార్చి 2003 నుండి 20 సంవత్సరాలకు పైగా దాని MD మరియు CEOగా విధులు నిర్వహించారు. శుక్రవారం ముగింపు నాటికి ₹3.5 లక్షల కోట్ల విలువైన తన బ్యాంక్‌లో, సుమారు 26 శాతం కోటక్ వాటా. 

బహిరంగంగా వ్యక్తం చేసే వ్యక్తిత్వం: 

బ్యాంకింగ్ రంగంలో తన వైపు నుంచి ఉన్న అనేక సవాళ్లను అంతేకాకుండా ఆందోళనలను బహిరంగంగా వ్యక్తం చేసిన వ్యక్తి ఉదయ్ కోటక్. నోట్ల రద్దుపై అప్పట్లో తన ఆందోళనలను ప్రజలతో పంచుకోవడం జరిగింది ఉదయ్. ఇటీవల US డాలర్‌కు వ్యతిరేకంగా, అవమానకరంగా మాట్లాడాడు, తరువాత తన మాటలను వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. 

2023, సెప్టెంబర్ 2 నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన భారతదేశంలోని అత్యంత ధనిక బ్యాంకర్ ఉదయ్ కోటక్. బ్యాంక్‌లో అతనికి ఉన్న వాటా ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 26%గా ఉంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ప్రస్తుతం ప్రపంచ ధనికులలో 133వ స్థానంలో ఉన్న కోటక్. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతని MBA పూర్తి చేసిన తర్వాత, అతను కుటుంబం మరియు స్నేహితుల నుండి తీసుకున్న కొంత మొత్తంతో తన ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. మరి ముఖ్యంగా, పెట్టుబడిలో ఎక్కువ భాగం అతని ప్రాణ స్నేహితుడు ఆనంద్ మహీంద్రా నుండి వచ్చింది.