ANI, NDTV ట్విట్టర్ అకౌంట్స్ బ్లాక్, కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

కంటెంట్ వయోలేషన్ జరిగినప్పుడు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు, నిబంధనలు పాటించనప్పుడు లేదంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయిపోవడం చూస్తుంటాం కానీ ప్రపంచంలో పేరు పొందిన రెండు ప్రముఖ న్యూస్ ఛానల్ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి. అవును మీరు విన్నది నిజమే, ఆశ్చర్యపోనవసరం లేదు. ట్విట్టర్ ప్రస్తుతం ఎవ్వరిని వదలడం లేదు. రూల్స్ పాటించాలని వాళ్లు ఎవరైనా సరే పరిమాణం ఎదుర్కోవాల్సిందే అంటోంది. తాజాగా సబ్స్క్రిప్షన్ తీసుకొని ట్విట్టర్ […]

Share:

కంటెంట్ వయోలేషన్ జరిగినప్పుడు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు, నిబంధనలు పాటించనప్పుడు లేదంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయిపోవడం చూస్తుంటాం కానీ ప్రపంచంలో పేరు పొందిన రెండు ప్రముఖ న్యూస్ ఛానల్ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి. అవును మీరు విన్నది నిజమే, ఆశ్చర్యపోనవసరం లేదు. ట్విట్టర్ ప్రస్తుతం ఎవ్వరిని వదలడం లేదు. రూల్స్ పాటించాలని వాళ్లు ఎవరైనా సరే పరిమాణం ఎదుర్కోవాల్సిందే అంటోంది. తాజాగా సబ్స్క్రిప్షన్ తీసుకొని ట్విట్టర్ ఖాతాలకు నోటీసులు ఇవ్వకుండా బ్లూటిక్ తొలగించారు. అందులో దేశ నేతలు, టాప్ బిజినెస్ మాన్, యాక్టర్స్ ఉన్నారు . తాజాగా ట్విట్టర్ మరో సాహసానికి ఒడిగట్టింది. ప్రపంచంలో మేటి న్యూస్ చానల్స్ లో ఒకటిగా ఉన్నా ANI, NDTV సంస్థల ట్విట్టర్ కాదాలను లాక్ చేసింది. ట్విట్టర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అయితే తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా తమ ఖాతాలను లాక్ చేయడంపై ఈ సంస్థలు మండిపడుతున్నాయి. అందుకు ఓ వింత కారణం కూడా ట్విట్టర్ చెప్పింది..

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రముఖ వార్త ఏజెన్సీ ఏషియన్ న్యూస్ ఏజెన్సీ ANI కి షాక్ ఇచ్చింది. కనీస వయసు వయసు ప్రమాణాలను పాటించినందుకు తమ ఖాతాను ట్విట్టర్ లాక్ చేసిందని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ తాజాగా తెలిపారు. ఈ వార్త సంస్థకు ట్విట్టర్ హ్యాండిల్ ను క్లిక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ఖాతా ఉనికి లేదని చూపుతోంది. ఏఎన్ఐ ట్విట్టర్ ఖాతా లాక్ అయినా కొన్ని నిమిషాల తర్వాత స్మిత ప్రకాష్ ఏఎన్ఐ హ్యండిల్ బ్లాక్ చేసినట్లు తెలియజేస్తూ ట్విట్టర్ పంపిన ఈమెయిల్ స్క్రీన్ షాట్ ను తన వ్యక్తిగత అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. మొదట మా ఖాతాకున్న గోల్డ్ టిక్ తీసేసి బ్లూ టిక్ ఇచ్చారు. ఇప్పుడు లాక్ చేశారు అంటూ ఎలాన్ మాస్క్ ను ట్యాగ్ చేశారు. ట్విట్టర్ ఖాతా క్రియేట్ చేయడానికి మీకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ వయసు నిబంధనకు అనుగుణంగా లేరని ట్విట్టర్ నిర్ధారించింది. కాబట్టి మీ ఖాతాను లాక్ చేశామని ట్విట్టర్ ఒక ఈమెయిల్లో పేర్కొంది. ఏఎన్ఐ వెబ్సైట్ ప్రస్తుతం దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ సెక్టార్లను కలిగి ఉంది. ప్రముఖ మల్టీమీడియా వార్తా సంస్థ అయినా ఏ ఎన్ ఐ కి భారతదేశం దక్షిణాసియా సహా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ బ్యూరో సెంటర్లు ఉన్నాయి. ఇక ఏఎన్ఐ ట్విట్టర్ ఖాతాకు  7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు ఎన్డీటీవీ ఖాతాను కూడా ట్విట్టర్ లాక్ చేసింది. ఎన్ డి టీవీ ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేయగా అకౌంట్ లేనట్లు చూపిస్తోంది. అయితే ఎన్డీటీవీ ట్విట్టర్ అకౌంట్ ఎందుకు నిలిచిపోయిందనేది తెలియాల్సిఉంది.

ట్విట్టర్ ఇప్పటికే దేశంలో సినీ, రాజకీయ క్రీడా ప్రముఖుల బ్లూటిక్ లను తొలగించి విమర్శల పాలైంది. సెలబ్రిటీల ఎకౌంట్లను గుర్తించేందుకు ఉపయోగపడే బ్లూ టిక్ ను సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణ యూజర్లకు సైతం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఎవరైతే డబ్బులు చెల్లించరో వారికి బ్లూ టిక్ మార్క్లను తొలగిస్తూ వచ్చింది. ఈ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే ప్రియాంక చోప్రా తో పాటు పలువురి అకౌంట్స్ ట్విట్టర్ తొలగించింది. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వంతు వచ్చింది. అందులో భాగంగా ఏషియన్ న్యూస్ ఏజెన్సీ, ఎన్డీటీవీ అకౌంట్స్ ను తొలగించింది.