ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్నుల నిబంధనలో వచ్చిన మార్పులివే..

విదేశీ బహుమతులపై ట్యాక్స్ ఉంటుంది ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలను తీసుకొచ్చింది.. ఏప్రిల్ నుంచి  ప్లానింగ్‌లో వచ్చిన ప్రధాన మార్పులేమిటో, వాటి వల్ల ఎలాంటి ఆర్థిక నష్టాలు కలుగుతాయో  తెలుసుకుందాం..   ఏప్రిల్ 1, 2023 నుండి ఆదాయపు పన్ను నియమాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటు న్నాయి.  కొత్త ఆదాయపు […]

Share:

విదేశీ బహుమతులపై ట్యాక్స్ ఉంటుంది

ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మొదలుకానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పన్ను విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలను తీసుకొచ్చింది.. ఏప్రిల్ నుంచి  ప్లానింగ్‌లో వచ్చిన ప్రధాన మార్పులేమిటో, వాటి వల్ల ఎలాంటి ఆర్థిక నష్టాలు కలుగుతాయో  తెలుసుకుందాం..  

ఏప్రిల్ 1, 2023 నుండి ఆదాయపు పన్ను నియమాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటు న్నాయి.  కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమలు లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.  ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను అమల్లోకి రానున్నాయి. 

నో  ట్యాక్స్:

ఏప్రిల్ 1 నుండి, బంగారాన్ని SEBI- నామినేట్ చేసిన వాల్ట్ మేనేజర్‌కు ఎటువంటి కేపిటల్ గెయిన్స్ టాక్స్ లేకుండా బదిలీ చేయవచ్చు. డిజిటల్ బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 

విదేశీ బహుమతులపై ట్యాక్స్.. NRI ద్వారా రూ. 50,000 కంటే ఎక్కువ ఖరీదు గల ఏదైనా బహుమతి పంపితే దానిపై ట్యాక్స్ విధించనున్నారు.

లిస్టెడ్ డిబెంచర్లపై TDS: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193 లోని నిబంధనల  తెలిపిన  సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపునకు సంబంధించి TDS నుండి మినహాయింపును అందిస్తాయి. అయితే ఈ మినహాయింపు ఏప్రిల్ నుండి ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లిస్టెడ్ డిబెంచర్లతో సహా అన్ని వడ్డీ చెల్లింపుల ఏప్రిల్ 1 నుంచి 10 శాతం TDS కట్ చేయనున్నారు.  

TDS మినహాయింపు: కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. రూ.7 లక్షల కంటే తక్కువ పన్ను విధించదగిన ఆదాయం ఉన్నవారు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, వారికి ఆదాయపు పన్ను చట్టం, 1961 (ITA) సెక్షన్ 87A కింద అందించిన అదనపు మినహాయింపు కారణంగా TDS తీసివేయబడదు.

ఓవర్ లోడ్ తగ్గింపు: ఇది కాకుండా, సంవత్సరానికి పన్ను విధించదగిన ఆదాయం కొత్త పన్ను విధానంలో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు వర్తించే సర్‌ఛార్జ్ 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. అయితే, కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్న ట్యాక్స్ పేయర్స్ కి కాస్త ఊరట లభించింది.  

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54F కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుండి తగ్గనున్నాయి. ఏప్రిల్ 01 నుండి, ఈ సెక్షన్ల కింద రూ. 10 కోట్ల వరకు మూలధన లాభం మాత్రమే మినహాయించనున్నారు. దీని కంటే ఎక్కువ మూలధన లాభం ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం చొప్పున ట్యాక్స్ విధించనున్నారు.

 ఏప్రిల్ 1, 2023 నుండి, ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ గేమ్‌ల పై TDS ట్యాక్స్: ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115BBJ నిబంధనల ప్రకారం.. ఆన్‌ లైన్ గేమ్‌ల నుండి వచ్చే ఆదాయంపై ట్యాక్స్ విధించనున్నారు. ఈ పన్ను 30 శాతం పన్ను చెల్లించాలి.