ఓసిసిఆర్పీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు

అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ (ఓసిసిఆర్పీ) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు […]

Share:

అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ (ఓసిసిఆర్పీ) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్‌బర్గ్ తర్వాత వెల్లడించాడు. 

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ గ్రూప్‌కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి. 

OCCRP రిపోర్ట్‌లోని విషయాలు

ఇంటర్నేషనల్‌ మీడియా సంస్థ ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్’ (ఓసిసిఆర్పీ), అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన తరహా ఆరోపణలే చేస్తూ ఒక రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం…. ‘గుర్తు తెలియని’ మారిషస్ ఫండ్స్‌ ద్వారా అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల షేర్లలోకి వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదానీ గ్రూప్‌ ప్రమోటర్‌ కుటుంబంతో వ్యాపార సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించారు.

టాక్స్‌లు తక్కువగా ఉండే కొన్ని దేశాల్లోని పేపర్లు, అదానీ గ్రూప్‌ ఇంటర్నల్‌ ఈ-మెయిళ్లను తాము పరిశీలించామని OCCRP తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ముఖ్యంగా, నాసర్ అలీ షాబాన్ అహ్లీ, ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను తన రిపోర్ట్‌లో OCCRP ప్రస్తావించింది. వీళ్లిద్దరికీ అదానీ కుటుంబంతో ఏళ్ల తరబడి వ్యాపార సంబంధాలు ఉన్నాయని తెలిపింది. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీకి చెందిన కొన్ని కంపెనీల్లో నాసర్ అలీ షాబాన్ అహ్లీ, ఛాంగ్‌ చుంగ్‌ లింగ్‌ డైరెక్టర్లుగా, స్టేక్‌ హోల్డర్లుగా ఉన్నారని రిపోర్ట్ చేసింది. వీళ్లిద్దరూ ఫారిన్‌ ఫండ్స్‌ ద్వారా అదానీ కంపెనీల షేర్లను కొంటూ, అమ్ముతూ భారీ లాభాలు సంపాదించారంటూ OCCRP బాంబ్ పేల్చింది.

అదానీ గ్రూప్ రియాక్షన్‌ ఇది

OCCRP ఆరోపణలను అదానీ గ్రూప్‌ ఖండించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను మళ్లీ తెర పైకి తీసుకురావడానికి, ఫారిన్‌ మీడియాలోని ఒక వర్గం మద్దతుతో, ఇలాంటి రీసైక్లింగ్‌ రిపోర్ట్‌ తీసుకొచ్చారంటూ రియాక్ట్‌ అయింది. ఓసిసిఆర్పీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవంది. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలన్నీ రూల్స్‌కు అనుగుణంగానే పనిచేస్తున్నాయని వివరించింది. ముఖ్యంగా, ఎఫ్పిఐల విషయంలో ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబీ) ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని చెప్పింది. ఉన్నాయి. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ప్రకారం, మినిమమ్‌ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపిఎస్) రూల్స్‌ను ఉల్లంఘించినట్లు లేదా స్టాక్ ప్రైస్‌లను తారుమారు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని గుర్తు చేసింది. 

కానీ.. కొత్తగా ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తిన ఓసిసిఆర్పీ, వాటికి సంబంధించిన తమ నుంచి సమాధానాలు తీసుకోకూడదని నిర్ణయించుకోవడం విచారకరం అని అదానీ గ్రూప్‌ స్పష్టం చెప్పింది. సుప్రీంకోర్టు, సెబీ ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాయని, కొనసాగుతున్న దర్యాప్తు ప్రక్రియను గౌరవించడం ముఖ్యమని అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. చట్టబద్ధమైన ప్రక్రియపై తమకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించింది.