KYC మార్గదర్శకాలను ఉల్లంఘించిన అమెజాన్

కొరడా ఝుళిపించిన రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా జర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా అమెజాన్ పే (ఇండియా)కి నోటీసు జారీ చేసింది, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని సూచించింది. ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించింది.  బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ రూ. 3 కోట్లు పెనాల్టీగా చెల్లించాలని ఆమెజాన్ డిజిటల్ పేమెంట్ విభాగం […]

Share:

కొరడా ఝుళిపించిన రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా

జర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా అమెజాన్ పే (ఇండియా)కి నోటీసు జారీ చేసింది, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని సూచించింది.

ఈ కామర్స్ దిగ్గజం ఆమెజాన్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించింది.  బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గానూ రూ. 3 కోట్లు పెనాల్టీగా చెల్లించాలని ఆమెజాన్ డిజిటల్ పేమెంట్ విభాగం ‘ఆమెజాన్ పే ఇండియా’ ను ఆదేశించింది. 2021న పీపీఐకి సంబంధించి జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్, కేవైసీకి సంబంధించి ఫిబ్రవరి 25, 2016న విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్‌ను కంపెనీ పాటించడం లేదని ఆర్బీఐ ప్రకటించింది.

ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాల (PPIలు) నిబంధనలను పాటించనందుకు నో యువర్ కస్టమర్ (KYC) మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు Amazon Payపై రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా రూ. 3.06 కోట్ల పెనాల్టీని విధించింది. రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా అమెజాన్ పే (ఇండియా)కి నోటీసు జారీ చేసింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని సూచించింది.

ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 3.06 కోట్ల పెనాల్టీని విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. “కెవైసి అవసరాలపై రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలకు అమెజాన్ పే ఇండియా కట్టుబడి లేదని గమనించాము” అని రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. తదనుగుణంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం తెలపాలని కోరుతూ అమెజాన్ పే ఇండియాకి నోటీసులు జారీ చేశారు.

పేమెంట్, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007లోని సెక్షన్ 30 ప్రకారం జరిమానా విధించబడింది అని రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

అయితే ఈ సందర్భంగా ఒక అమెజాన్ ప్రతినిధి , రెగ్యులేటరీ మార్గదర్శకాల ప్రకారం పనిచేయడానికి, సమ్మతిని కొనసాగించడానికి కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు.

“మా నిబద్ధతను వారికి తెలియజేయడానికి మేము అధికారులతో కలిసి పని చేస్తూనే ఉన్నాము” అని అమెజాన్ ప్రతినిధి చెప్పారు. 

“అమెజాన్ పే యొక్క ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఆదేశాలను పాటించనందుకు పైన పేర్కొన్న అభియోగం రుజువు చేయబడిందని, పెనాల్టీ విధించబడుతుందని రిజర్వ్ బ్యాక్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది” అని పేర్కొంది.

చెల్లింపు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 30 కింద పొందిన హక్కుల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెజాన్‌పై పెనాల్టీని విధించింది. రెగ్యులేటరీ సమ్మతిలో లోపాన్ని గుర్తించిన తర్వాత చర్యలు తీసుకుంది. ఈ జరిమానాకు అమెజాన్ పే ఇండియా తన కస్టమర్‌లతో చేసిన ఒప్పందం లేదా లావాదేవీ చెల్లింపులతో సంబంధం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.