చిన్న పొదుపును కోట్లుగా కోట్లుగా మార్చే చక్రవడ్డీ.. ఎలాగో తెలుసుకోండి..

“డబ్బులు సంపాదించడం ఎలా?” అని అందరూ ఆలోచిస్తారు.  కానీ కొంతమంది మాత్రమే అందులో విజయాన్ని సాధిస్తారు.. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించిన గ్రాండ్ సాబెటీర్ డబ్బుల గురించి గొప్పగా వివరించారు. డబ్బు సంపాదించడం కాదు.. ఆ డబ్బు మీద చక్రవడ్డీని ఎలా సంపాదించుకోవాలో తెలిపారు. అంతేకాకుండా చక్రవడ్డీ యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మొత్తాలతో కోటీశ్వరులు అవ్వచ్చని తెలిపారు. చక్రవడ్డీ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. చక్రవడ్డీ అనేది ప్రపంచంలో […]

Share:

“డబ్బులు సంపాదించడం ఎలా?” అని అందరూ ఆలోచిస్తారు.  కానీ కొంతమంది మాత్రమే అందులో విజయాన్ని సాధిస్తారు..

ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని రచించిన గ్రాండ్ సాబెటీర్ డబ్బుల గురించి గొప్పగా వివరించారు. డబ్బు సంపాదించడం కాదు.. ఆ డబ్బు మీద చక్రవడ్డీని ఎలా సంపాదించుకోవాలో తెలిపారు. అంతేకాకుండా చక్రవడ్డీ యొక్క ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మొత్తాలతో కోటీశ్వరులు అవ్వచ్చని తెలిపారు. చక్రవడ్డీ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

చక్రవడ్డీ అనేది ప్రపంచంలో ఎనిమిదవ అద్భుతం మరియు వింత.. దానిని అర్థం చేసుకున్నవాళ్ళు వడ్డీ సంపాదిస్తారు.. అర్థం చేసుకోలేనివాళ్ళు.. చెల్లిస్తారు.. అని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ స్వయంగా తెలిపారు..!! చక్రవడ్డీ అనేది మనం చేసే చిన్న చిన్న పొదుపు మొత్తాలకు పెద్ద లాభాలను చేకూరుస్తుంది. ఇది సాధారణంగా లభించే వడ్డీ కంటే భిన్నంగా ఉంటుంది. తప్పకుండా గుర్తించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే చక్రవడ్డీలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తానికి గతంలో కలిపిన వడ్డీపై ఆదాయం వచ్చినప్పుడు కాంపౌండింగ్ జరిగింది అంటారు. చక్రవడ్డీలో మీరు అసలుతో పాటు అసలుకి  వచ్చిన వడ్డీకి కూడా చక్రవడ్డీని పొందుతారు. అదేవిధంగా ఆ మొత్తాన్ని ఉంచితే, వడ్డీపై వడ్డీ, ఆ వడ్డీపై మళ్ళీ వడ్డీ కూడా లభిస్తుంది. భలే ఇంటరెస్టింగ్ విషయం కదూ?

చక్రవడ్డీ వల్ల కలిగే ప్రయోజనాలు..

డిపాజిట్లు, పెట్టుబడుల అభివృద్ధి విషయంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు పెద్ద ఆప్త మిత్రుడు. ఇది మీ పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మీకు లభించే వడ్డీ ద్వారా చాలా వరకు లాభం పొందుతారు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పరంగా చూస్తే చక్రవడ్డీ అనేది మీ పెట్టుబడిపై మరింత లాభం సంపాదించడానికి గొప్ప మార్గం. అంతేకాకుండా దీర్ఘకాలిక డిపాజిట్‌లపై చక్రవడ్డీతో చాలా ఎక్కువ రాబడిన పొందుతారు. ఏ విధంగా అంటే నెల నెలా, మూడు నెలలు, ఆరు నెలలు సంవత్సరానికి ఒకసారి మీ వడ్డీ మరింతగా పెరుగుతుంది.

చక్రవడ్డీ ద్వారా డబ్బును పెంచుకోవడడానికి ఈ నాలుగు ఆప్షన్లను ఎన్నుకోవచ్చు.

1. రీ ఇన్వెస్ట్మెంట్

2. హై డిపాజిట్ వాల్యూ 

3.లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 

4. చూజింగ్ ఆప్షన్

ఈ నాలుగు ఆప్షన్లలో మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే బోలెడంత సంపదను క్రియేట్ చేసుకోవచ్చు. 

మ్యూచువల్‌ ఫండ్స్‌లో చక్రవడ్డీ బెనిఫిట్స్ లభిస్తాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి గ్రోత్‌ ప్లాన్‌లు ఈ తరహావే అని చెప్పవచ్చు. అయితే వీటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా పరిగణించడానికి లేదు. ఎందుకంటే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తే, ఎంత మొత్తం రాబడి వస్తుందో ముందే తెలుస్తుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే  ఇంత మొత్తాల్లో రాబడులు వస్తాయని గ్యారంటీగా చెప్పలేము. అయితే అంతకు మించిన లాభాలు వచ్చాయని చరిత్ర చెబుతోంది. గత 20 ఏళ్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 17–18 శాతం చొప్పున వృద్ధి సాధించింది. ఇది డిపాజిట్‌ రేట్‌కి దాదాపు రెట్టింపు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏడాదికి 20–22 శాతం చక్రవడ్డీ రాబడులను కూడా ఇచ్చాయి.