పెరిగిన టెస్లా సేల్స్

మోటార్ వెహికల్స్ రంగం లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ టెస్లా. డీజల్ మరియు పెట్రోల్ ఇంధనం ద్వారా కాకుండా, కేవలం ఎలక్ట్రికల్ పవర్ తో నడిచే కార్లను తయారు చెయ్యడమే ఈ కంపెనీ లక్ష్యం. అంటే డీజిల్ మరియు పెట్రోల్ తో నడిచే బ్రాండెడ్ కార్ల కంటే కూడా ఇవి ఎంతో సౌకర్యం గా ఉండడం తో రోజు రోజుకి టెస్లా బ్రాండెడ్ కార్స్ కి మార్కెట్ లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ […]

Share:

మోటార్ వెహికల్స్ రంగం లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంస్థ టెస్లా. డీజల్ మరియు పెట్రోల్ ఇంధనం ద్వారా కాకుండా, కేవలం ఎలక్ట్రికల్ పవర్ తో నడిచే కార్లను తయారు చెయ్యడమే ఈ కంపెనీ లక్ష్యం. అంటే డీజిల్ మరియు పెట్రోల్ తో నడిచే బ్రాండెడ్ కార్ల కంటే కూడా ఇవి ఎంతో సౌకర్యం గా ఉండడం తో రోజు రోజుకి టెస్లా బ్రాండెడ్ కార్స్ కి మార్కెట్ లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సంస్థని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థాపించాడు ఎలాన్ మస్క్. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది టెస్లా కార్స్ అమ్మకాలు 83 శాతం కి పైగా పెరిగిందని, కంపెనీ విధిస్తున్న కట్ ప్రైజులు కారణం గా అమెరికన్ గవర్మెంట్ కి టాక్సుల రూపం లో మంచి లాభాలు కలుగుతున్నాయని ఈ సందర్భంగా మస్క్ తెలిపాడు.

ఏప్రిల్ నుండి జూన్ వరకు 466140 కార్లు అమ్ముడుపోయాయి :

టెక్సాస్ ప్రాంతం లో ఆస్టిన్ లో ఉండే సోలార్ ప్యానెల్ మరియు బ్యాటరీస్ అధినేత టెస్లా ప్రభంజనం గురించి మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి జూన్ నెల వరకు సుమారుగా 466140 టెస్లా వాహనాలు అమ్ముడుపోయాయని, గత ఏడాది ఇదే టైం పీరియడ్ లో 254695 వాహనాలు అమ్ముడుపోయాయి. అంటే గతం తో పోలిస్తే ఈ ఏడాది డబుల్ అమ్మకాలు జరిగిందట. అమ్మకాలలో అధికశాతం మోడల్ 3 మరియు మోడల్ Y వెర్షన్స్ హవానే ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. వాల్ స్త్రీట్స్ అంచనాల కంటే కూడా టెస్లా సేల్స్ అధికంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. సెకండ్ క్వాటర్ లో టెస్లా సంస్థ 9 లక్షల వాహనాలను తయారు చేస్తే అందులో  జనవరి నెల నుండి మార్చ్ వరకు 422875 వాహనాలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయట. రాబొయ్యే సంవత్సరాలలో ప్రతీ ఏడాది టెస్లా అమ్మకాలు 50 శాతం కి పైగా పెరుగుతూ పోతుందని టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ఈ సందర్భంగా తెలిపాడు.

భారీగా తగ్గించిన ధరలు :

ఈ ఏడాది ముగిసేలోపు 20 లక్షల టెస్లా కార్లు అమ్ముడుపోయాయని అంచనా వేస్తున్నారు. వాటిల్లో కనీసం 18 లక్షల కార్లు ఈ ఏడాది లోనే వినియోగదారులకు డెలివరీ అవుతుందని ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మార్కెట్ లో ఒక రేంజ్ లో అమ్ముడుపోతున్న టెస్లా కార్ మోడల్ 3 ని ఎలాన్ మస్క్ ప్రస్తుతం ఉన్న ధర లో 3000 వేల అమెరికన్ డాలర్స్ తగ్గించినట్టు చెప్పుకొచ్చాడు. మోడల్ X కార్లకు అయితే 10 వేల అమెరికన్ డాలర్స్ తగ్గించారు, అంతే కాకుండా S , X మోడల్స్ కార్లకు ఫ్రీ డెలివరీ చార్జీలు కూడా అందించారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన మోడల్ S కార్లకు 7500 డాలర్లు ప్రస్తుతం ఉన్న ప్రైజ్ కి తగ్గించారు. ఇక టెస్లా సంస్థలో టాప్ సేల్స్ ని దక్కించుకున్న మోడల్ Y స్మాల్ SUV కార్ కి 1570 అమెరికన్ డాలర్స్ తగ్గించారు. ఇలా తగ్గించడం వల్ల కార్స్ అమ్మకాలు క్రమంగా పెరిగిపోతూ ఉంది. రాబొయ్యే రోజుల్లో మన ఇండియా లో కూడా ఇక మీదట ఇంధనం తో నడిచే కార్లు కాకుండా, టెస్లా ఎలక్ట్రికల్ కార్స్ తోనే మన రోడ్లు నిండిపోతాయని అంటున్నారు విశ్లేషకులు. అదే కనుక జరిగితే పర్యావరణం ని కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియచేస్తున్నారు.